Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘రాజేంద్ర కేంద్రీయ వ్యవసాయ విశ్వ విద్యాలయం’ పేరును “డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వ విద్యాలయం”గా మార్పు చేయడానికి సంబంధిత బిల్లులో ఆధికారిక సవరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం


‘రాజేంద్ర కేంద్రీయ వ్యవసాయ విశ్వ విద్యాలయం’ పేరును “డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వ విద్యాలయం”గా మార్పు చేయడానికి సంబంధించిన రాజేంద్ర సెంట్రల్ అగ్రికల్చరల్ విశ్వ విద్యాలయ బిల్లు, 2015 లో ఆధికారిక సవరణ చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఎక్స్- పోస్ట్ ఫాక్టో ఆమోదం తెలిపింది. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

విద్యా బోధనలో ప్రావీణ్యాన్ని అందించడం, ఆశించిన లక్ష్యాన్ని నెరవేర్చడం, వ్యవసాయం మరియు సంబంధిత శాస్త్ర విజ్ఞానంలో సుశిక్షితులైన వారిని దేశానికి అందించడం పూసా లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఏర్పాటు లోని ఉద్దేశాలు. సాంకేతిక విజ్ఞానంలో సామర్ధ్యం కలిగివుండే మానవ వనరుల కొరతను, మౌలిక సదుపాయాల లోటును అధిగమించడంలో ఈ విశ్వ విద్యాలయం తోడ్పడనుంది. అంతేకాక, ఆ ప్రాంతంలో వ్యవసాయం, పశుపాలన, ఉద్యాన పంటల పెంపకం, మత్స్య పోషణ.. వీటి వికాసానికి ఈ సంస్థ దోహదపడనుంది. ఇప్పటికే విద్యా బోధన చేస్తున్న కళాశాలలు వ్యవసాయదారులకు ఆధునిక విజ్ఞానాన్నిపరిచయం చేయడంలో చేదోడు వాదోడుగా ఉండగలవు. ఇది అంతా కలుపుకొంటే, మొత్తం మీద ఆ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పాదకత మెరుగు పడేందుకు మార్గం ఏర్పడగలదు.