పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ”సత్యభామ-శాట్” ఉపగ్రహాన్ని నిర్మించిన విద్యార్థుల బృందం ఈ రోజు న్యూ ఢిల్లీ లో కలుసుకొంది. సత్యభామ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్స్ లర్ డాక్టర్ బి. శీలా రాణి కూడా ఈ విద్యార్థుల వెంట ఉన్నారు.
గ్రీన్ హౌస్ గ్యాసెస్ కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఒక ఉపగ్రహాన్ని నిర్మించేందుకు విద్యార్థుల బృందం చేసిన ప్రయత్నాలను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐ ఎస్ ఆర్ ఒ – ఇస్రో) 2016 సంవత్సరం జూన్ 22న పి ఎస్ ఎల్ వి- సి34 వాహక నౌకను ఉపయోగించి ప్రయోగించిన ఇరవై ఉపగ్రహాలలో ”సత్యభామ-శాట్” కూడా ఉంది.
A riveting interaction to remember…with students involved in building satellite Sathyabamasat. pic.twitter.com/vHeQsgZtO0
— Narendra Modi (@narendramodi) July 19, 2016
You will recall that Sathyabamasat was one of the twenty satellites launched by @isro using launch vehicle PSLV-C34 on 22nd June, 2016.
— Narendra Modi (@narendramodi) July 19, 2016