Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని లోని కొన్ని ప్రాంతాల లో పిడుగుల‌ కార‌ణం గా ప్రాణన‌ష్టం సంభ‌వించినందుకు సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని కొన్ని ప్రాంతాల లో పిడుగు లు పడ్డ కార‌ణం గా ప్రాణన‌ష్టం జ‌రిగినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేసి, బాధితుల కు పరిహారాన్ని ప్రకటించారు.

 

‘‘ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో అనేక చోట్ల పిడుగు లు పడటం తో ప్రాణ నష్టం జరగడం హృద‌య‌విదారకం గా ఉంది. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల తాలూకు దగ్గరి బంధువుల కు నేను సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈశ్వరుడు వారి కి కలిగిన ఈ దు:ఖాన్ని ఓర్చుకొనేటటువంటి శక్తి ని ఇవ్వుగాక : ప్రధాన మంత్రి @narendramodi

 

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో కొన్ని ప్రాంతాల లో పిడుగు పాటు కార‌ణం గా ప్రాణ న‌ష్టం, ఇతరత్రా న‌ష్టాలు సంభవించినట్లు ప్ర‌ధాన మంత్రి కి వివరించడం జరిగింది. మృతుల ద‌గ్గ‌రి సంబంధికుల కు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వంతు న‌, గాయ‌ప‌డ్డ‌ వారికి 50,000 రూపాయ‌ల వంతు న ప‌రిహారాన్ని పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఇవ్వ‌డం జరుగుతుంది అని ప్రధాన మంత్రి @narendramodi ప్ర‌క‌టించారు ’’ అని పిఎమ్ఒ ఒక ట్వీట్ లో తెలిపింది.

 

***

DS/SH