Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ బాలాసాహెబ్ విఖే పాటిల్ ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం


మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమాన్ ఉద్ధవ్ ఠాక్రే జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ జీ, శ్రీ చంద్రకాంత్ పాటిల్ జీ, శ్రీ రాధాకృష్ణ పాటిల్ జీ, సుజయ్ విఖే పాటిల్ జీ, కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, నా రైతు సోదరులు, సోదర సోదరీమణులారా.. ఛత్రపతి శివాజీ మహరాజ్ వంటి వీరులు, మరెందరో వీరమాతలు పుట్టిన మహారాష్ట్ర గడ్డకు మన:పూర్వక నమస్కారాలు చేస్తున్నాను.

ఇంతమంచి సందర్భంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన రాధాకృష్ణ విఖే పాటిల్ జీ, వారి కుటుంబసభ్యలకు, అహ్మద్ నగర్ లోని మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. నేను ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. కానీ కరోనా మహమ్మారి కారణంగా వర్చువల్ వేదిక ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చింది.

మిత్రులారా, డాక్టర్ బాలాసాహెబ్ విఖేపాటిల్ ఆత్మకథ ఇవాళ ఆవిష్కరణ అయిది. కానీ వారి జీవితకథలు మహారాష్ట్రలో అందరికీ సుపరిచితమే. డాక్టర్ విఠల్ రావ్ విఖే పాటిల్ గారి అడుగుజాడల్లో పయనిస్తూ డాక్టర్ బాలాసాహెబ్ విఖేపాటిల్ మహారాష్ట్ర అభివృద్ధికోసం తన జీవితాన్ని సమర్పించిన విషయాన్ని నేను దగ్గరుండి గమనించాను. గ్రామాలు, పేదలు, రైతుల జీవితాలను మరింత సులభతరం, సౌకర్యవతం చేయడమే మూలమంత్రంగా వారి జీవితం కొనసాగింది. ‘నేను అధికారం నుంచి రాజకీయాలనుంచి దూరంగా లేను. కానీ సమాజం కోసమే అధికారం, రాజకీయం జరగాలనే నియమాన్ని పాటిస్తూనే ఉన్నాను. రాజకీయాలు చేస్తున్నప్పుడు కూడా అది సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందనే విషయం మాత్రమే ఆలోచిస్తాను’ అన్న శ్రీ బాలాసాహెబ్ విఖే పాటిల్.. అధికారాన్ని, రాజకీయాన్ని ప్రతిక్షణం సమాజ శ్రేయస్సుకే వినియోగించారు.

సమాజ ఉద్ధారణకు చేసేందుకు రాజకీయాలను ఎలా వినియోగించాలి, గ్రామాలు, పేదల సమస్యలకు ఎలా పరిష్కారం కనుగొనాలి అనేదానిపైనే వారు నిరంతరం కృషిచేశారు. ఈ గొప్ప ఆలోచనే మిగిలిని వారితో వారిని విభిన్నంగా చూసేందుకు వీలుకల్పించింది. ఈ కారణంతోనే ప్రతి పార్టీలో వారికి విశేషమైన గౌరవం ఉంది. గ్రామాలు, పేదల శ్రేయస్సు కోసం, మంచి విద్యనందించేందుకు మహారాష్ట్రలో సహకార పద్ధతిలో విజయవంతం చేసేందుకు వారు చేసిన కృషి.. భవిష్యత్ తరాలకు ప్రేరణాత్మకంగా నిలుస్తుంది. బాలాసాహెబ్ విఖే పాటిల్ గారి ఈ ఆత్మకథ మనందరికీ ఓ విలువైన పుస్తకం.

మిత్రులారా, డాక్టర్ బాలాసాహెబ్ విఖేపాటిల్ గారు గ్రామాలు, పేదలు, రైతుల సమస్యలను, బాధలను చాలా దగ్గర్నుంచి చూశారు, అర్థం చేసుకున్నారు. అందుకే రైతులందరికీ ఒకచోట చేర్చి సహకార వ్యవస్థతో వారిని అనుసంధానం చేశారు. వీరి కృషి కారణంగా లేమితో బాధపడుతున్న ప్రాంతం ముఖచిత్రమే మారిపోయింది. సహకార వ్యవస్థ గొప్పదనంపై వారు ‘సహకార ఉద్యమమే.. అందరినీ కలుపుకుని పోయే ఉద్యమం. ఇది ఏ జాతి, వర్గం, మతానితో సంబంధం లేనిది. ఇప్పటివరకు మన సమాజానికి ఏ మతం ప్రాతినిధ్యం వహించలేదు’ అని పేర్కొన్నారు. సహకారం అనే పదానికి నిష్పక్షం అనే అర్థముంది. దీనికి ఏ వర్గం, ఏ పార్టీతో సంబంధం లేదు. ఇందులో సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందుకోసం వారి దృష్టిలో సహకార వ్యవస్థ అందరితోపాటు, అందరి అభివృద్ధికి మార్గంగా నిలిచింది. కేవలం మహారాష్ట్రలోనే కాదు.. అటల్ జీ మంత్రిమండలిలో సభ్యులుగా ఉన్న సమయంలో దేశమంతా సహకార వ్యవస్థ బలోపేతానికి వారు కృషిచేశారు. అంతటి మహనీయుడి ఆత్మకథకు ‘మన జీవితానికో అర్థం ఉండాలి’ అనే భావంతో కూడిన శీర్షిక చక్కగా సరిపోయింది. సందర్భోచితం, యోగ్యం కూడా. సంత్ తుకారామ్ మహరాజ్ గారి ఈ సుభాషితాల ప్రభావాన్ని బాలాసాహెబ్ విఖే పాటిల్ గారి జీవితంలో గమనించవచ్చు.

మిత్రులారా, దేశంలో విద్య గురించి పెద్దగా చర్చ జరగని సమయంలోనే.. ప్రవర రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో వారు గ్రామాల్లో విద్యాభివృద్ధికి కృషిచేశారు. ఈ సొసైటీ ద్వారా గ్రామాల్లో యువకులకు విద్యనందించడంతోపాటు వారి నైపుణ్యాభివృద్ధికి పాటుపడ్డారు. గ్రామాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అందుకే నేడు ప్రవర రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ తోపాటు శ్రీ బాలాసాహెబ్ గారి పేరు జోడించడం సందర్భోచితం అవుతుంది. వారికి గ్రామాల్లో, పొలాల్లో శిక్ష అవసరాన్ని వారు గుర్తించారు. వారు తన ఆత్మకథలో ‘వ్యవసాయ నైపుణ్యం లేకపోతే మనుషులు కూడా సహజమైన వ్యవసాయాన్ని చేయలేరు. అలాంటప్పుడు వ్యవసాయాన్ని ఎంటర్ ప్రైజ్ అని ఎందుకు అనము?’ అని రాసుకున్నారు. మనిషి ఎంత చదువుకున్నవాడయినా.. అతనికి వ్యవసాయంలో అనుభవం, నైపుణ్యం లేకపోతే వారు వ్యవసాయం చేయలేరు. అలాంటప్పుడు మనం వ్యవసాయాన్ని ఎంటర్ ప్రైజ్ అని ఎందుకు అనకూడదు?    

***