పిఎంఇండియా
దిల్లీ లో మంటలు రేగినందువల్ల జరిగిన హృదయవిదారక దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
దిల్లీ లో అగ్ని ప్రమాద దుర్ఘటన లో ప్రాణాలను కోల్పోయిన వారి దగ్గరి సంబంధికుల కు ఒక్కొక్కరి కి 2 లక్షల రూపాయల వంతున మరియు ఈ ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘దిల్లీ లో మంటలు రేగినందువల్ల జరిగిన హృదయవిదారక దుర్ఘటన లో వాటిల్లిన ప్రాణనష్టం పట్ల తీవ్రం గా దు:ఖిస్తున్నాను. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలని నేను ఆశిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –
‘‘ దిల్లీ లో అగ్నిప్రమాద దుర్ఘటన వల్ల ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ఒక్కొక్కరి కి 2 లక్షల రూపాయల వంతున పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి : @narendramodi’’ అని తెలిపింది.
Extremely saddened by the loss of lives due to a tragic fire in Delhi. My thoughts are with the bereaved families. I wish the injured a speedy recovery.
— Narendra Modi (@narendramodi) May 13, 2022
Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives in the fire in Delhi. The injured would be given Rs. 50,000 : PM @narendramodi
— PMO India (@PMOIndia) May 13, 2022