Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విశ్వ మహమ్మారి కోవిడ్ -19 వ్యాప్తి తో పల్లెల కు తిరిగి వస్తున్న వలస కార్మికుల కు జీవనోపాధి ని మరియు ఉద్యోగాల ను పెంచడం కోసం 2020 వ సంవత్సరం జూన్ 20 వ తేదీ న ‘గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోద


ప్రపంచ దేశాల ను అతలాకుతలం చేసిన కోవిడ్ -19 ప్రభావితులై సొంత ఊళ్లకు తిరిగి వస్తున్న గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాల ను,  వలస కార్మికుల కు జీవిక ను భారీ ఎత్తు న పెంచడానికి ప్రధాన మంత్రి  శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ‘గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్’ పేరిట ఓ ఉద్యమం స్థాయి లో  ఉద్యోగ కల్పన మరియు గ్రామీణ ప్రజా పనుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.  స్వగ్రామాల కు తిరిగి వచ్చిన గ్రామీణ వలస కార్మికుల కు సాధికారిత ను కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం గా ఉంది.  ఈ కార్యక్రమాన్ని జూన్ 20వ తేదీ (శనివారం) నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా బిహార్ లోని ఖగడియా జిల్లా బేల్ దౌర్ బ్లాకు కు చెందిన తెలిహార్ గ్రామం లో ప్రారంభించడమైంది.  ఈ కార్యక్రమం అమలయ్యే 6 రాష్ట్రాల కు చెందిన ముఖ్య మంత్రులు, ప్రతినిధులు,  అనేక మంది కేంద్ర మంత్రులు మరియు ఇతరులు ప్రారంభోత్సవాని కి హాజరయ్యారు.

‘గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్’ ను  లాంఛనం గా ప్రారంభించిన ఖగడియా జిల్లా తెలిహార్ గ్రామస్థుల తో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ముచ్చటించారు.  
ఇప్పుడు ఏం చేస్తున్నారు, పని దొరికిందా అంటూ తిరిగి వచ్చిన  వలస కార్మికుల లో కొందరి ని ప్రధాన మంత్రి ప్రశ్నించారు.  లాక్ డౌన్ కాలం లో ప్రారంభించిన సంక్షేమ పథకాలు అందుబాటు లోకి వచ్చాయా అని కూడా వారిని అడిగి తెలుసుకున్నారు.  

కోవిడ్ -19 పై పోరాటం లో గ్రామీణ భారతం నిబ్బరం గా నిలిచిందని,  వారి తో మాట్లాడిన తరువాత తనకు ఎంతో సంతృప్తి కలిగిందని,  ఈ సంక్షోభ కాలం లో గ్రామీణ ప్రాంతాలు యావత్తు దేశాని కి మరియు ప్రపంచాని కి స్ఫూర్తిదాయకం గా నిలుస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.  

పేద లు, వలస కార్మికుల సంక్షేమం విషయం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ పట్టించుకుంటున్నాయని ఆయన అన్నారు.  

పిఎమ్ గరీబ్ కళ్యాణ్ యోజన లో భాగం గా 1.75 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ద్వారా అనేక ప్రోత్సాహకాల తో  ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారోద్యమాన్ని ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి చెప్పారు.  

సొంత ఊరి కి వెళ్ళ దలచిన వలస కార్మికుల కోసం కేంద్రం,  రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రామిక స్పెషల్ రైళ్ల ను నడిపాయని కూడా ఆయన అన్నారు.  

పేద ల సంక్షేమాని కి, వారి ఉపాధి కి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ రోజు చరిత్రాత్మకమైన రోజు అని ప్రధాన మంత్రి అభివర్ణించారు.  

ఈ బృహత్తర కార్యక్రమం మన కూలీ సోదరులు, సోదరీమణులు,  గ్రామీణ ప్రాంతాల లో నివసిస్తున్న యువత,  అక్కలు, చెల్లెళ్లు మరియు ఆడబిడ్డల కు అంకితం అని ఆయన అన్నారు.  

గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ లో భాగం గా గ్రామీణ ప్రాంతాల లో దృఢమైన మౌలిక సదుపాయాల ను నిర్మించడానికి 50,000 కోట్ల రూపాయల ను ఖర్చు చేయనున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు.  

వివిధ రకాల అభివృద్ధి పనుల ను నిర్వహించేందుకు గ్రామీణ ప్రాంతాల లో ఉపాధి కల్పన కు 25 పని ప్రాంతాల ను గుర్తించారు.  ఈ 25 పనుల లో గ్రామీణ గృహ నిర్మాణం, మొక్కల పెంపకం, జల జీవన్ మిశన్ ద్వారా మంచి నీటి సరఫరా, పంచాయతి భవనాల నిర్మాణం, సామూహిక మరుగుదొడ్లు, పశువుల కోసం షెడ్ల వంటి మౌలిక వసతులు, అంగన్ వాడీ భవనాలు వంటి గ్రామాల అవసరాల కు సంబంధించినవి ఉన్నాయి.  

గ్రామీణ ప్రాంతాల లో ఆధునిక సౌకర్యాల ను కూడా ఈ అభియాన్ ఆధునికీకరిస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు.  యువత కు, పిల్లల కు సహాయ పడేందుకు గ్రామీణ కుటుంబాల కు వేగవంతమైన ఇంటర్ నెట్ ను తక్కువ ఖర్చు లో అందించవలసిన  అవసరం ఉందని అన్నారు.   మున్నెన్నడూ లేని విధం గా ఇప్పుడు పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువ గా పల్లెల లో ఇంటర్ నెట్ ను వాడుతున్నారని ప్రధాన మంత్రి అన్నారు.  అందువల్ల ఫైబర్ కేబుల్స్ ను వేయడాన్ని,  ఇంటర్ నెట్ సౌకర్యాన్ని కల్పించడాన్ని అభియాన్ లో  భాగం చేశామన్నారు.  

ఈ పనుల ను గ్రామీణులు వారి సొంత ఊళ్ళో ఉంటూ,  వారి పరివార సభ్యుల తో గడుపుతూనే పూర్తి చేసేందుకు వీలు ఉంది.  

స్వయంసమృద్ధియుత (ఆత్మ నిర్భర్) భారత్ కోసం స్వయంసమృద్ధియుత రైతులు అంతే అవసరం అని ప్రధాన మంత్రి అన్నారు.   రైతు లు వారి పంట ను నచ్చిన చోట, మెచ్చిన ధర కు విక్రయించే విధం గా వ్యాపారుల తో సంబంధాల ను ఏర్పాటు చేసుకొనేందుకు అన్ని నియంత్రణల అడ్డంకుల ను తొలగించి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకొందని, తద్ద్వారా రైతుల కు మార్గం సుగమం అయిందని ప్రధాన మంత్రి అన్నారు.   

రైతుల కు విపణుల తో నేరు గా సంబంధాలు ఏర్పడటమే కాక వ్యవసాయ క్షేత్రాని కి,  విపణి కి మధ్య సంధాన సౌకర్యం కూడా ఏర్పడుతుందన్నారు.  కోల్డ్ స్టోరేజీ ల వంటి సంధానాల కల్పన కు ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి ని సమకూర్చింది.    

ఉద్యమ సరళి లో 125 రోజు ల పాటు సాగే ఈ అభియాన్ ఉద్యమ తరహా లో పని చేస్తుంది.  వలస కార్మికులు ఎక్కువ గా తిరిగి వచ్చిన  ఆరు రాష్ట్రాల లోని 116 జిల్లాల లో 25 రకాల పనుల ను అమలు చేస్తారు.  ఆ ఆరు రాష్ట్రాలు బిహార్, ఉత్తర్ ప్రదేశ్,  మధ్య ప్రదేశ్,  రాజస్థాన్, ఝార్ ఖండ్ మరియు ఒడిశా.   ఈ అభియాన్ లో చేపట్టే పనుల కోసం రూ. 0,000 కోట్ల రూపాయల నిధుల ను ప్రభుత్వం సమకూరుస్తుంది.   

ఈ అభియాన్ 12 వివిధ మంత్రిత్వ శాఖ లు / శాఖ లు ఏకాభిముఖం గా పనిచేసే కార్యక్రమం.  గ్రామీణాభివృద్ధి, పంచాయతి రాజ్, రోడ్డు రవాణా మరియు రహదారులు,  గనులు, మంచి నీటి సరఫరా & పారిశుద్ధ్యం, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం &  సహజ వాయువు,  కొత్త మరియు అక్షయ ఇంధనం,  సరిహద్దు రోడ్లు,  టెలికమ్ & వ్యవసాయం శాఖ లు 25 ప్రజా మౌలిక సదుపాయాల పనుల ను మరియు  జీవనోపాధి పెంచే అవకాశాల ను పెంచే పనుల ను చేపడుతాయి.  

ఈ యత్నం ద్వారా సాధించనున్న ప్రధాన లక్ష్యాలు:   

•  సొంత ఊళ్ల కు తిరిగి వస్తున్న వలస కార్మికుల కు మరియు గ్రామీణుల కు  జీవనోపాధి అవకాశాల ను కల్పించడం;  
•  రోడ్లు, గృహాలు, అంగన్ వాడీ లు, పంచాయతి భవనాలు, జీవనోపాధి కి తోడ్పడే వివిధ రకాల ఆస్తులు మరియు సామాజిక భవనాల నిర్మాణం ద్వారా గ్రామాల లో ప్రజా మౌలిక సదుపాయాల ను కల్పించడం.

•  వివిధ రకాల పనుల ను ఒకే సారి ప్రారంభించడం వల్ల రానున్న 125 రోజుల లో ప్రతి వలస కార్మికునికి/ ప్రతి వలస కార్మికురాలి కి వారి వారి నైపుణ్యాని కి సరిపడే పని దొరికే అవకాశం ఉంటుంది.  దీర్ఘ కాలం లో జీవనోపాధి విస్తరణ కు మరియు అభివృద్ధి కి సైతం ఈ  కార్యక్రమం మార్గాన్ని సుగమం చేస్తుంది.

ఈ కార్యక్రమాని కి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేంద్రకం గా ఉంటుంది.   ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాల తో కలసి సమన్వయం తో  నిర్వహిస్తారు.  ఎంపిక చేసిన జిల్లాల లో ఈ కార్యక్రమం అమలు తీరు ను పర్యవేక్షించడం కోసం సంయుక్త కార్యదర్శి  స్థాయి అధికారి ని సెంట్రల్ నోడల్ ఆఫీసర్ గా నియమిస్తారు.  

గ్రామీణ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్  (జికెఆర్ ఎ) ను అమలు చేసే రాష్ట్రాల జాబితా ఈ కింది విధం గా ఉంది:

—————————————————————————————
S.No.   State Name   #Districts   Aspirational Districts

క్ర. సం.    రాష్ట్రం పేరు        #జిల్లా లు          ఆకాంక్షభరిత జిల్లా లు
—————————————————————————————
1                            బిహార్           32            12

2                          ఉత్తర్ ప్రదేశ్    31              5  

3                          మధ్య ప్రదేశ్    24              4

4                          రాజస్థాన్         22              2

5                          ఒడిశా               4              1                                          

6                          ఝార్ ఖండ్         3               3
—————————————————————————————
                     మొత్తం జిల్లా లు    116            27  
—————————————————————————————

ఈ కార్యక్రమం కింద ప్రాధాన్య క్రమం లో చేపట్టే 25  పనులు, కార్యకలాపాల జాబితా దిగువ విధం గా ఉంది:

 ————————————————————————————–
S.No.   Work/ Activity
క్ర. సం.   పని / కార్యకలాపం
————————————————————————————–
1   సామాజిక పారిశుద్ధ్య కేంద్రం  (సి ఎస్ సి)  

2   గ్రామ పంచాయత్ భవనాల నిర్మాణం

3  14వ ఆర్ధిక కమిషన్ నిధుల కింద చేపట్టే పనులు

4   జాతీయ రహదారి పనుల నిర్మాణం

5   జల సంరక్షణ మరియు  సంగ్రహణ పనులు

6   బావుల నిర్మాణం

7   మొక్కల పెంపకం సంబంధిత పనులు

8   ఉద్యాన వనాల పెంపకం

9   అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం

10  గ్రామీణ గృహ నిర్మాణ పనులు

11  గ్రామీణ సంధాయకత పనులు

12  ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ పనులు

13  వ్యవసాయ క్షేత్రాలలో కుంటల నిర్మాణం

14 పశువుల కొట్టాల నిర్మాణం

15  కోళ్ల ఫారాల నిర్మాణం

16  మేక ల షెడ్ ల నిర్మాణం

17  వర్మి-కంపోస్ట్ సంబంధి నిర్మాణాల ఏర్పాటు

18  రైల్వేలు

19  రూర్బన్

20  పి ఎం కుసుమ్

21  భారత్ నెట్

22  కంపా ప్లాంటేషన్

23  పి ఎమ్ ఊర్జా గంగ ప్రాజెక్టు

24  జీవిక కోసం కృషి విజ్ఞాన కేంద్రాల శిక్షణ

25  డిస్ట్రిక్ర్ట్ మినరల్ ఫౌండేశన్ ట్రస్ట్ (డిఎమ్ఎఫ్ టి) పనులు

————————————————————————————

 

 

***