పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లిస్ బన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఇండియా పోర్చుగల్ స్పేస్ అలయెన్స్ ఏర్పాటుకు మరియు పరస్పర సమన్వయపూర్వక పరిశోధనను ముందుకు తీసుకుపోవడానికిగాను ఎమ్ఒయు లపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలు పోర్చుగల్ తో శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞాన రంగాలలో భారతదేశ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించగలవు. ఫలితంగా అజోరెస్ ఆర్చి పెలగో లో అట్లాంటిక్ ఇంటర్ నేషనల్ రిసర్చ్ సెంటర్ ఏర్పాటు కానుంది.
ఈ కేంద్రం ట్రాన్స్- అట్లాంటిక్ మరియు నార్త్ -సౌత్ కోఆపరేషన్ కోసం పరిశోధన, నవ కల్పన మరియు విజ్ఞాన కేంద్ర బిందువుగా వ్యవహరించగలదు. ఇందులో భాగంగా పరిశోధన మరియు విద్యా సంబంధ సంస్థల అంతర్జాతీయ నెట్ వర్క్ ను ఏర్పాటు చేస్తారు. నూతన జల వాయు స్థితిగతులను పెంచి పోషించడం, అంతరిక్ష సంబంధమైన మరియు సముద్ర సంబంధమైన పరిశోధనలను ప్రోత్సహించడం కోసం ఉభయ పక్షాల కృషి ఇమిడివుండే కార్యక్రమాలు చేపట్టడమే దీని ధ్యేయంగా ఉంటుంది.
ఇక అంతరిక్షానికి సంబంధించినంతవరకు పరిశీలిస్తే, తదుపరి తరం నానో శాటిలైట్ లు మరియు మైక్రో శాటిలైట్ లను అభివృద్ధిపరచడంలో ఇరు పక్షాలు సహకరించుకొనే అవకాశం ఉంది. అలాగే సముద్ర శాస్త్ర విజ్ఞానం విషయానికి వస్తే, ఈ ప్రాజెక్టు అట్లాంటిక్ మహాసముద్ర ప్రవర్తన, అక్కడి వాతావరణం తీరు తెన్నులు, వర్షాకాలంతో పాటు వాతావరణ నిర్మాణక్రమంతో అట్లాంటిక్ కు ఉన్న అనుసంధానాన్ని గురించి అధ్యయనం చేసే ఆస్కారాన్ని భారతదేశానికి కల్పిస్తుంది.
*****