పిఎంఇండియా
ప్రధానమంత్రి: మీరు ఒక కొత్త రంగంలో సాహసంతో ముందడుగు వేశారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ప్రభుత్వ హామీపై విశ్వాసం ఉంచారు. మనం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, వాటిని పదేపదే మార్చకూడదన్నదే నా అభిప్రాయం. అప్పుడే కొత్త ప్రయోగాలకు సాహసించే వారికి ఒక నమ్మకం కలుగుతుంది. ఏదైనా తప్పు జరిగితే అది నా పొరపాటు వల్లే జరిగిందని భావించవచ్చు. కానీ ప్రభుత్వం తనను మధ్యలో వదిలిపెట్టదనే భరోసా ఉంటుంది. ఆ విశ్వాసాన్ని కల్పించడమే మా ప్రయత్నం.
సీఈఓ: మాది భారత తొలి స్పేస్‌టెక్ యూనికార్న్. జూలై 18న భారత తొలి ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మేం చెప్పుకునేది ఏమిటంటే.. స్కైరూట్‌కు ఇది కేవలం సన్నాహం మాత్రమే. అసలు ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. వచ్చే ఏడాది మధ్య నాటికి నెలకు ఒక రాకెట్ చొప్పున ప్రయోగించే స్థాయికి చేరుకుంటాం. అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరిచినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సర్. ఇప్పటికే మూడు కేంద్రాలు ఏర్పాటు చేశాం. నెలకు ఒక రాకెట్‌ను తయారు చేసే సామర్థ్యం మాకు ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో వారానికి ఒక ప్రయోగం, రోజుకు అనేక ప్రయోగాలు నిర్వహించాలన్నది మా కల.
సీఈఓ: ప్రపంచంలోనే అత్యంత ఆధునిక ఇంజిన్‌లలో ఒకదాన్ని మేం తయారు చేశాం. సర్, మేం తయారు చేసిన ఈ ఇంజిన్ ప్రస్తుతం పరీక్షించే దశలో ఉంది.
ప్రధానమంత్రి: పెట్టుబడిదారులకు మీపై నమ్మకం ఉందా?
సీఈఓ: సర్, స్కైరూట్ తొలి ప్రయోగం విజయవంతమైన తర్వాత వారి విశ్వాసం మరింత పెరిగింది.
ప్రధానమంత్రి: మంచిది. ఆ మార్గం మీకు ఉపయోగపడుతోందా?
సీఈఓ: చాలా బాగా ఉపయోగపడుతోంది సర్.
ప్రధానమంత్రి: ఇప్పుడు ప్రపంచం భారత్‌కు చెందిన అంకుర సంస్థల గురించి అన్వేషిస్తూ, ఇంతటి విజయానికి వెనుక ఎవరున్నదీ తెలుసుకోవడంపై ఆసక్తి చూపుతూ ఉండాలి. ఎందుకంటే ఏదైనా కీలక విజయం సాధించినప్పుడు, వెంటనే అందరి దృష్టి ఆవైపే మళ్లుతుంది.
సీఈఓ: అంతరిక్ష రంగం ప్రైవేట్ సంస్థలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంచి పరిణామాన్ని చూస్తున్నామని నేను భావిస్తున్నాను. అమెరికా, ఐరోపాలో ఉన్న మన దేశీయులు తిరిగి భారత్‌కు వచ్చి మాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రధానమంత్రి: మనం ఎంతో మందిని అనుసంధానం చేయాలి. మెహతా చెప్పినట్లుగా, గతంలో విదేశాలకు వెళ్లిన వారు ఇప్పుడు తిరిగి భారత్‌కు వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఒక నమ్మకం కలిగించే వాతావరణాన్ని మనం సృష్టించాలి. వారు తమ భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటే “ హిందుస్తాన్‌కు వెళ్ళాలి. ఏదైనా భారతీయ అంకుర సంస్థలో చేరాలి… ఏదైనా భారతీయ అంతరిక్ష సంస్థతో కలిసి పనిచేయాలి” అనే భావన కలగాలి. మీ సంస్థల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను అయస్కాంతంలా భారత్ వైపు ఆకర్షించగలమని నేను బలంగా నమ్ముతున్నా. భవిష్యత్తులో అదే మనకు ఎంతో గొప్ప బలంగా మారుతుంది.
సీఈఓ: వచ్చే 18 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రౌండ్ స్టేషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం.
సీఈఓ: అంతరిక్షంలో ఉపగ్రహాలు ఒక కక్ష్య నుంచి మరో కక్ష్యకు మారేందుకు ఉపయోగించే ఇంజిన్లను మేం తయారు చేస్తున్నాం. ఇవి ఐదేళ్లు లేదా 15 ఏళ్లపాటు పని చేసేలా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మా ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. సర్, ఇందులో మీ కృషి కూడా ఎంతో కీలకం. ప్రస్తుతం భారత కంపెనీలు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ మద్దతును పొందుతున్నాయి.
ప్రధానమంత్రి: ధరల పరంగా మనం ఇతరులకు పోటీ ఇవ్వగలం. ప్రతిభ విషయంలో మనకు అసలు కొరతే లేదు. అలాగే, సాహసించి కొత్త ప్రయోగాలు చేపట్టే సామర్థ్యం మన ప్రజల్లో ఎప్పటినుంచో ఎక్కువగానే ఉంది. అందువల్ల మనం చాలా తక్కువ సమయంలోనే ప్రపంచంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోగలం.
సీఈఓ: ఈ రోబోటిక్ అంతరిక్ష నౌక అంతరిక్షంలోకి వెళ్లి, చెడిపోయిన ఉపగ్రహాన్ని భౌతికంగా పట్టుకుని, దానిని కక్ష్య నుంచి తొలగిస్తుంది.
సీఈఓ: డాకింగ్, ఇంధనం నింపే సాంకేతికతలపై పనిచేస్తున్న తొలి భారతీయ సంస్థ మాదే. భవిష్యత్తులో అంతరిక్షంలోనే ఇంధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మా లక్ష్యం.
సీఈఓ: నా పేరు అంతరిక్ష్. నా సహ వ్యవస్థాపకురాలు మోనికా కూడా ఇక్కడే ఉన్నారు. సర్, మాది భారత తొలి అంతరిక్ష ఫార్మా స్టార్టప్. అంతరిక్షంలోకి వెళ్లి అక్కడే ఔషధాలను తయారు చేసి, తిరిగి వాటిని భూమికి తీసుకురాగల ఉపగ్రహాలను మేము రూపొందిస్తున్నాం.
ప్రధానమంత్రి: మీ పేరు అంతరిక్ష్ అంటున్నారు .. మీ కుటుంబం ఇప్పటికే ఈ రంగంలో ఉందా?
సీఈఓ: లేదు సర్. మా అమ్మ నాకు ఈ పేరు పెట్టారు.
సీఈఓ: ఒక్క ప్రయోగం విజయవంతం కావడంతో గత నెలలో మాకు ఎనిమిది ప్రయోగ ఒప్పందాలు లభించాయి.
ప్రధానమంత్రి: మంచిది… చాలా బాగుంది..
సీఈఓ: వాటిలో ఎక్కువగా అంతర్జాతీయ ఒప్పందాలే ఉన్నాయి.
సీఈఓ: సర్, ప్రస్తుతం ఈ ఆవిష్కరణను 10 లక్షల మంది రైతులకు అందుబాటులోకి తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించాం.
సీఈఓ: సర్, ఇది మీ కోసం. ఈ జ్ఞాపకం ఎప్పటికీ నిలిచిపోయేలా ఉండేందుకు.
ప్రధానమంత్రి: అద్భుతం.
సీఈఓ: మీరు ప్రైవేట్ రంగానికి అంతరిక్ష ద్వారాలు తెరిచిన ఫలితంగా ఇప్పుడు ప్రైవేట్ ఉపగ్రహాలు భారతదేశ ఆందాలను ప్రపంచం ముందు ఆవిష్కరిస్తున్నాయి.
***
Met India’s brightest space StartUps.
— Narendra Modi (@narendramodi) August 23, 2026
As always, came away impressed by their energy and ambition.
You would love their insights and optimism.
Do tell me...what excites you most about India’s space journey? #NationalSpaceDay pic.twitter.com/d1pDC0UZ6p