పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం అంతర్జాతీయ ఉగ్రవాదం మరియు దేశాంతర వ్యవస్థీకృత నేరాల పై పోరాడడంలో భారతదేశం, ఆస్ట్రేలియా లు ఒకదానితో మరొకటి సహకరించుకోవడానికి ఉద్దేశించిన ఒక అవగాహన పూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు) ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
సమాచారాన్ని, ప్రావీణ్యాన్ని, అనుభవాన్ని, సామర్థ్యాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవడం ద్వారా శాంతిని, సుస్థిరత్వాన్ని పరిరక్షిస్తూ భారతదేశం, ఆస్ట్రేలియా ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రతిపాదిత ఎమ్ఒయు తోడ్పడనుంది.
గుర్తించిన రంగాలలో పరస్పర సమన్వయ, సహకారాలు అవసరమయ్యే అన్ని అంశాలను పరిష్కరించేందుకు తగిన ఫ్రేమ్ వర్క్ ను ఈ ఎమ్ఒయు సమకూర్చగలదు.
ఉభయ దేశాల మధ్య ఏర్పడే పటిష్టమైన సహకారం సంస్థాగత ఆదాన ప్రదానాలకు వీలు కల్పిస్తుంది. ఈ ఎమ్ఒయు ఒకసారి అమలులోకి వచ్చిందంటే గనుక అంతర్జాతీయ ఉగ్రవాదం మరియు దేశాల మధ్య వ్యస్థీకృత స్థాయిలో సాగే నేరాల పైన పోరాడడం లోను, వాటిని అరికట్టడం లోను సహాయకారి కాగలదు.
***