Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి సందేశం


ప్రతి సంవత్సరం అక్టోబరు 11 నాడు నిర్వహించే అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేసిన ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు :-

“ఆడపిల్లలు ప్రతి రంగంలో.. చదువుల మొదలుకొని ఆటల దాకా.. వారిదైన ముద్రను వేస్తున్నారు. వారు సాధించిన విజయాలకు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఇదే నా వందనం.

లైంగికపరమైన వివక్షకు తావు లేని, బాలికలు రాణించడానికి అన్ని అవకాశాలు లభించగల భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం మనం అందరం సమష్టిగా కృషి చేద్దాం.”