Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా లఖ్ నవూ లో సామూహిక యోగ ప్రదర్శనకు హాజరైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లఖ్ నవూ లో సామూహిక యోగ ప్రదర్శనలో పాలుపంచుకొన్నారు.

రమాబాయ్ అంబేడ్కర్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలో ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నప్పటికీ కూడా వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

ఉత్సాహం నిండి, గట్టిగా నినాదాలు చేస్తున్న సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం అంతటా యోగా దిన వేడుకలలో పాలుపంచుకొంటున్న వారందరికీ లఖ్ నవూ నుండి తాను అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

ఇవాళ యోగా అనేది ఎంతో మంది ప్రజల జీవనాలలో ఒక భాగంగా మారిపోయిందని ఆయన అన్నారు. భారతదేశం వెలుపల సైతం యోగా కు అధిక ఆదరణ ఉందని, యోగా ప్రపంచాన్ని భారతదేశంతో పెనవేసిందని ఆయన చెప్పారు.

గత మూడు సంవత్సరాలుగా అనేక యోగా సంస్థలు రూపుదిద్దుకోవడం తనకు సంతోషాన్నిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. యోగా గురువులకు గిరాకీ పెరుగుతుండటాన్ని తాను గమనించినట్లు కూడా ఆయన వెల్లడించారు. యోగ్యతకు తోడు స్వస్థత కూడా ముఖ్యమేనని, స్వస్థతను సంపాదించుకోవడానికి యోగా ఒక మార్గమని ఆయన చెప్పారు.

యోగాను వారి జీవితాలలో ఒక భాగంగా మార్చుకొమ్మని ప్రతి ఒక్కరికీ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేస్తూ యోగా అనేది ఆరోగ్యానికి హామీ ఏర్పరచుకోవడం వంటిదని, దీనిని అభ్యసించటం అంత ఖరీదైందేమీ కాదు కూడా అని ఆయన వివరించారు.

అంతక్రితం, ప్రధాన మంత్రి ని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ లఖ్ నవూ కు ఆహ్వానించారు. యోగా మన సంప్రదాయంలో ఒక భాగం, మనలను యోగా కలిపి ఉంచుతోందని శ్రీ యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

***