పిఎంఇండియా
అంతరిక్ష పరిశోధన, విజ్ఞాన శాస్త్రం ఇంకా అప్లికేశన్స్ రంగం లో సహకారం తో పాటు ఉపగ్రహం కోసం మరియు వాహక నౌక ల కోసం టెలిమెట్రి ట్రాకింగ్ అండ్ టెలికమాండ్ స్టేశన్ ల నిర్వహణ లో సహకారం అంశాల పై భారతదేశానికి, బ్రునేయ్ దారుస్సలామ్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు) తాలూకు వివరాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గం దృష్టి కి తీసుకు రావడమైంది. ఈ ఎంఒయు పై 2018వ సంవత్సరం జులై 19వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లో సంతకాలయ్యాయి.
ప్రయోజనాలు:
ఈ ఎంఒయు భారతదేశ ఉపగ్రహ కార్యక్రమాలకు మరియు వాహక నౌక లకు తోడ్పాటు ను అందించే భూతల స్థావరాన్ని పని చేయించడాన్ని, నిర్వహించడాన్ని మరియు వృద్ధి పరచడాన్ని కొనసాగించేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది. అలాగే, ఇది అంతరిక్ష కార్యకలాపాలలో భారతదేశం తనకు ఉన్న అనుభవాన్ని, ప్రావీణ్యాన్ని బ్రునేయ్ దారుస్సలామ్ కు చెందిన అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం వినియోగాలకు సంబంధించిన అధికారులకు మరియు విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కూడా దోహదపడుతుంది.
ఈ ఎంఒయు ద్వారా బ్రూనేయ్ దారుస్సలామ్ తో కలసి పని చేయడం, భారతదేశానికి చెందిన వాహక నౌక మరియు ఉపగ్రహ కార్యక్రమాలకు మద్దతు ను అందించే ఇండియన్ గ్రౌండ్ స్టేశన్ కార్యకలాపాలకు, నిర్వహణ కు మరియు కార్యకలాపాల పెంపునకు తోడ్పడగలుగుతుంది. తద్వారా దేశం లోని అన్ని ప్రాంతాలు, వర్గాలు ప్రయోజనం పొందగలుగుతాయి.
భూతల కేంద్రం కార్యకలాపాలకు, ఇంకా అంతరిక్ష సాంకేతిక విజ్ఞానపరమైన సేవల లో శిక్షణ ను ఇవ్వడానికి సంబంధించిన కొత్త కొత్త పరిశోధన కార్యక్రమాలను అన్వేషించే ప్రక్రియ కు ఈ ఎంఒయు ఊతంగా నిలుస్తుంది.