పిఎంఇండియా
అంతర్జాతీయ ఉగ్రవాదం, దేశాంతర వ్యవస్థీకృత నేరాలు, అక్రమ డ్రగ్స్ చేరవేత, నార్కోటిక్ అండ్ సైకో ట్రాపిక్ సబ్‌స్టెన్సెస్ అండ్ ప్రికర్ సర్స్ కెమికల్స్ పై పోరాటంలో సహకారం కోసం భారత్, బహ్రెయిన్ ల మధ్య కుదిరిన ఒప్పందానికి (ఎంఓయూ) కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమయింది. ఈ ఒప్పందానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది కూడా. ఒప్పంద పత్రాలను ఇరు దేశాలు మార్పిడి చేసుకున్న నాటి నుంచి ఈ ఎంఓయూ అమలులోకి రానుంది.
రెండు దేశాలలోనూ ఉగ్రవాదం, ట్రాన్స్ నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్, డ్రగ్ ట్రాఫికింగ్ లకు సంబంధించిన నేరాలతో పాటు నేరాల నిరోధం, పరిశోధన, విచారణకు, ఈ నేరాల అణచివేతకు తీసుకోవలసిన చర్యలకు మరింత పదునుపెట్టడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఉభయ దేశాల ఇంటెలిజెన్స్ అధికారులు, చట్టాన్ని అమలుచేసే ఏజెన్సీల అధికారులకు మధ్య సహకారాన్ని పెంపొందించే విధి విధానాలను కూడా ఈ ఒప్పందం ప్రకారం రూపొందిస్తారు.