Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అంత‌ర్జాతీయ సౌర‌ కూటమి ప్ర‌ధాన కార్యాల‌యం శంకుస్థాప‌న‌ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు మెట్రోలో గుర్గావ్‌కు ప్ర‌యాణించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్య‌క్షుడు శ్రీ ఫ్రాంకోయిస్ హోలాండే

అంత‌ర్జాతీయ సౌర‌ కూట‌మి ( ఇంట‌ర్ నేష‌న‌ల్ సోలార్ అల‌యెన్స్ ) ప్ర‌ధాన కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేసే కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్య‌క్షుడు శ్రీ ఫ్రాంకోయిస్ హోలాండే లు నేడు మెట్రో రైలులో ఢిల్లీ నుంచి గుర్గావ్‌కు ప్ర‌యాణించారు.

ఈ సంద‌ర్భంగా శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడుతూ,

శీతోష్ణ స్థితుల‌లో చోటు చేసుకుంటున్న‌ మార్పుల‌ రీత్యా త‌లెత్తుతున్న‌ స‌వాళ్ళను త‌ట్టుకొని నిల‌బ‌డ‌టం గురించి ప్ర‌పంచం ఎలా ఆలోచిస్తోందో గుర్తు చేశారు. పారిస్‌లో జ‌రిగిన సీఓపీ 21 స‌ద‌స్సులో రెండు ప్ర‌ధాన‌మైన కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని తీసుకున్న నిర్ణ‌యాన్ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. వాటిలో ఒక‌టి- “మిష‌న్‌ ఇన్నొవేష‌న్”. సాంకేతిక‌త‌లో వినూత్న‌ ప‌ద్ధ‌తుల ద్వారా శుద్ధ శ‌క్తిని ప్ర‌జ‌ల‌కు మ‌రింత సుల‌భంగా అందించ‌టం దీని ల‌క్ష్యం.

రెండోది “ఇంట‌ర్ నేష‌న‌ల్ సోలార్ అల‌యెన్స్”. సూర్య ప్ర‌తాపాన్ని వినియోగించుకొనేందుకు సూర్య‌ర‌శ్మి అధికంగా క‌లిగిన‌ దేశాల‌న్నింటినీ ఒక్క‌తాటి పైకి చేర్చ‌డం ఈ కార్య‌క్ర‌మ లక్ష్యం.

శీతోష్ణ స్థితుల‌లో చోటు చేసుకుంటున్న‌ మార్పుల‌ రీత్యా తీవ్ర దాడుల‌కు గుర‌వుతున్న‌ ప్ర‌జ‌ల‌కు ఈ ఇంట‌ర్ నేష‌న‌ల్ సోలార్ అల‌యెన్స్ ప్రాణ‌ర‌క్ష‌కంగా ప‌నిచేస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చెప్పారు. స‌ముద్ర మ‌ట్టాలు పెరుగుతుండ‌టం చిన్న‌ ద్వీప దేశాలకు బెడ‌ద‌గా ప‌రిణ‌మిస్తోంద‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలిపారు.

ఐక్య‌రాజ్య‌స‌మితిలాగే ఈ ఇంట‌ర్ నేష‌న‌ల్ సోలార్ అల‌యెన్స్ కూడా స్వ‌తంత్ర సంస్థ‌గా ప‌నిచేస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.