Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అంత‌ర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీ యొక్క ఒకటో స‌మావేశం 2018 అక్టోబర్ 2వ తేదీ నాడు ప్రారంభమైన సందర్భం గా ఆ కార్యక్రమం లో ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం పాఠం

అంత‌ర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీ యొక్క ఒకటో స‌మావేశం 2018 అక్టోబర్ 2వ తేదీ నాడు ప్రారంభమైన సందర్భం గా ఆ కార్యక్రమం లో ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం పాఠం

అంత‌ర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీ యొక్క ఒకటో స‌మావేశం 2018 అక్టోబర్ 2వ తేదీ నాడు ప్రారంభమైన సందర్భం గా ఆ కార్యక్రమం లో ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం పాఠం

అంత‌ర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీ యొక్క ఒకటో స‌మావేశం 2018 అక్టోబర్ 2వ తేదీ నాడు ప్రారంభమైన సందర్భం గా ఆ కార్యక్రమం లో ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం పాఠం


ఐక్య‌ రాజ్య స‌మితి సెక్రటరి జనరల్, శ్రేష్ఠులు శ్రీ ఏంటోనియో గుటెరేజ్, ఇక్కడకు విచ్చేసినటువంటి ఇండియన్ ఓశన్ రిమ్ అసోసియేశన్ దేశాల‌ మంత్రులు, అంత‌ర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ) అసెంబ్లీ దేశాల‌ మంత్రులు, నా మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు, పారిశ్రామిక రంగానికి చెందిన మిత్రులు, విశిష్ట అతిథులు, విద్యార్థులు, మహిళలు మరియు సజ్జనులారా,

ఐక్య‌ రాజ్య స‌మితి సెక్రటరి జనరల్, శ్రేష్ఠులు శ్రీ ఏంటోనియో గుటెరేజ్ తో పాటు ఈ రోజున ఉద‌యం స్వ‌చ్ఛ‌త‌ కు సంబంధించిన ఒక ముఖ్య‌మైన కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొనే అవ‌కాశం నాకు దక్కింది.  మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతి ఉత్స‌వాలు దేశ‌వ్యాప్తంగాను, ప్ర‌పంచ‌వ్యాప్తంగాను ఈ రోజునే ఆరంభ‌ం అయ్యాయి.  ప‌ర్యావ‌ర‌ణ హిత‌కరమైన భ‌విష్య‌త్తు కోసం నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి, చ‌ర్చ‌లు చేయ‌డానికి ఇంత‌కంటే త‌గిన రోజు మ‌రొక‌టి ఉండ‌దు.  
అంత‌ర్జాతీయ సౌర కూటమి (ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ -ఐఎస్ఎ) అనే పదం ప్ర‌జాద‌ర‌ణ పొందాల‌ని ఐఎస్ఎ తో పాటు నేను కూడా కోరుకొంటున్నాను.  ఇదేదో ఐఎస్ఎ స‌మావేశం అన్న‌ట్టుగా ఉండ‌కూడ‌దు.  ప్ర‌పంచ నవీకరణ యోగ్య శక్తి పెట్టుబ‌డి మరియు ప్ర‌ద‌ర్శ‌న కావ‌చ్చు, లేదా పున‌ర్ పెట్టుబ‌డికి సంబంధించినటువంటి స‌మావేశం కావ‌చ్చు లేదా ఇండియ‌న్ ఓశ
న్ రిమ్‌ అసోసియేశన్ ఎనర్జీ స‌మావేశం కావ‌చ్చు.. ఈ మూడు స‌మావేశాల స‌మ‌గ్ర‌ ల‌క్ష్యం ఒక‌్కటే.   ప‌ర్యావ‌ర‌ణ హిత‌కర భ‌విష్య‌త్తు కై స్వ‌చ్ఛ‌ ప్ర‌త్యామ్నాయ శక్తి ని సిద్ధం చేసుకోవ‌డ‌మే.
 
మిత్రులారా, 

గ‌త 150- 200 సంవ‌త్స‌రాలలో ప్ర‌పంచ‌ వ్యాప్తం గా మాన‌వాళి చాలా వ‌ర‌కు శిలాజ ఇంధ‌నాల మీద‌నే ఆధార‌ప‌డ‌డం జ‌రిగింది.  అయితే ఈ ప‌ని చేయ‌డం వ‌ల్ల ప్ర‌కృతి లో జ‌రుగుతున్న మార్పులు ఆందోళ‌న‌కరంగా ఉన్నాయి.. ఈ ప‌ని ని ప్ర‌కృతి ఒప్పుకోవ‌డం లేదు.  మ‌నమే దీనికి సాక్ష్యం.  ఇప్పుడు కూడా ప్ర‌కృతి ఈ ప‌ని ని వ్య‌తిరేకిస్తోంది.  క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌కృతి మ‌న‌కు సందేశాన్ని ఇస్తోంది.  భూమి పైన అందుబాటులో ఉన్న శక్తి.. అది సౌర విద్యుత్తు, ప‌వ‌న విద్యుత్తు కావ‌చ్చు, జ‌ల విద్యుత్తు కావ‌చ్చు.. అవే భ‌ద్ర‌మైన భ‌విష్య‌త్తు ను అందించే ప‌రిష్కారాలు. 
ప్ర‌కృతి మ‌న‌కు అందిస్తున్న ఈ సందేశాన్ని గురించి చ‌ర్చించ‌డానికి మ‌న‌మందరం ఇక్క‌డ సమావేశం కావ‌డం నాకు సంతోషంగా ఉంది.

మిత్రులారా, 

నాకు ఇంకా గుర్తుంది.. మూడు సంవ‌త్స‌రాల క్రితం పున‌ర్ పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఒకటో స‌మావేశం లో మ‌న దేశ ప్ర‌జ‌ల ముందు భార‌త‌దేశం యొక్క నిర్ణ‌యాన్ని ఉంచాను.  నవీకరణ యోగ్య శ‌క్తి రంగం లో మెగావాట్ నుండి గీగావాట్ కు కదలాలనే భార‌త‌దేశం యొక్క నిర్ణ‌యాన్ని తెలియ‌జేశాను.  ఈ విష‌యం పైన ఆ రోజునే నేను వివ‌ర‌ణ ఇచ్చాను..  సౌర శ‌క్తి నుండి, ప‌ర్యావ‌ర‌ణ హిత శ‌క్తి నుండి ప్ర‌యోజనం పొందాలంటే అవి అంద‌రికీ అందుబాటు లోకి రావాల‌ని, అందుబాటు ధ‌ర‌ల్లో ఉండాల‌ని.  సౌర శ‌క్తి వ‌న‌రులు అధికంగా ఉన్న దేశాల‌న్నింటిని కలిపి ఒక ఉమ్మ‌డి వేదిక‌ ను రూపొందించుకోవాల‌నే ప్ర‌తిపాద‌న‌ ను నేను ముందుకు తీసుకువచ్చాను.  అతి త‌క్కువ స‌మ‌యం లో ఈ ప‌థ‌కాన్ని ముందుకు తీసుకు రావ‌డం లో క‌నివిని ఎరుగ‌ని రీతి లో విజ‌యం సాధించ‌డం ప‌ట్ల నేను సంతోషంగా ఉన్నాను.

మిత్రులారా,
 
ఈ రోజున‌ ఈ ప్ర‌పంచానికి ఐఎస్ఎ ఒక అతి పెద్ద ఆశాకిర‌ణంగా ఆవిర్భ‌వించింది.  మూడు సంవ‌త్స‌రాల్లో ఈ సంస్థ ఒప్పందాల ఆధారిత అంత‌ర్ ప్ర‌భుత్వ సంస్థ‌ గా రూపొందింది.  ఐఎస్ఎ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని భార‌త‌దేశం లో ఏర్పాటు చేయడంప‌ట్ల 1.25 బిలియ‌న్ మంది భార‌తీయులు సంతోషిస్తున్నారు.  ఈ కార‌ణం గా ఈ సంస్థ ప‌ట్ల మ‌న అనుబంధం మ‌రింత పెరిగింది.

21వ శ‌తాబ్దం లో ఏర్పాటు చేసుకున్న అత్యున్న‌త స్థాయి మాన‌వ సంక్షేమ సంస్థ‌ల‌ను గురించి చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు ఇందులో ఐఎస్ఎ గురించిన చ‌ర్చ‌ ప్ర‌ముఖంగా ఉంటుంద‌ని నేను న‌మ్ముతున్నాను.  వాతావ‌ర‌ణ‌ప‌ర‌మైన న్యాయాన్ని అందించ‌డానికిగాను మ‌నం ఒక భారీ వేదిక‌ ను ఐఎస్ఎ రూపం లో సృష్టించాం.  మ‌నమంతా క‌లసి మాన‌వత్వానికి సంబంధించిన ఒక భారీ బ‌హుమ‌తి ని రాబోయే త‌రాల‌కు అందివ్వ‌బోతున్నాం. 

మిత్రులారా,
 
ఈ రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా  శ‌క్తి  అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికిగాను ఒపిఇసి సంస్థ ఎలాంటి పాత్ర‌ ను పోషిస్తోందో అదే విధంగా ఐఎస్ఎ కూడా అటువంటి భూమిక నే పోషిస్తుంద‌ని నేను స‌దా న‌మ్ముతున్నాను.  ఈ రోజున చ‌మురు బావులు ఎటువంటి పాత్ర‌ ను పోషిస్తున్నాయో అదే విధంగా భ‌విష్య‌త్తు లో సూర్య కిర‌ణాలు కూడా అదే పాత్ర‌ ను పోషిస్తాయి.  నేను ప్ర‌త్యేకంగా ఐక్య‌ రాజ్య‌ సమితి కి నా కృత‌జ్ఞ‌త‌ను వ్యక్తం చేస్తున్నాను.  ఎందుకుంటే ఐఎస్ఎ ఈ స్థాయి కి చేరుకోవ‌డానికి  ఐరాస ఇచ్చిన మ‌ద్ద‌తే కార‌ణం.  ఐఎస్ఎ ను పారిస్ లో ప్రారంభించిన‌ప్పుడు అప్ప‌టి ఐరాస‌ సెక్రటరి జనరల్, శ్రేష్ఠులు శ్రీ బాన్ కి- మూన్ స‌మ‌క్షం లోనే ఆ కార్య‌క్ర‌మం జ‌రిగింది.  ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మం శ్రేష్ఠులు శ్రీ ఏంటోనియో గుటేరేజ్ స‌మక్షం లో జ‌రుగుతోంది.  ఈ రెండు ఉదాహ‌ర‌ణ‌లు చాలు ఈ కూటమి కి ఐరాస‌ ఎంత‌ ప్రాధాన్య‌ాన్ని ఇస్తోందో తెలుసుకోవడానికి.  ఈ సంద‌ర్భంగా ఫ్రాన్స్ అధ్య‌క్షుల‌కు, ఫ్రెంచి ప్ర‌భుత్వానికి వారు ఇచ్చినటువంటి స‌హ‌కారానికి, మ‌ద్ద‌తు కు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌ ను వ్యక్తం చేస్తున్నాను.

మిత్రులారా,
 
ఐఎస్ఎ నిర్వ‌హిస్తున్న ఈ ఒకటో సమావేశానికి 40 దేశాల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.  ఏది ఏమైన‌ప్ప‌టికీ ఇప్పుడు మ‌నం మ‌రింత ముందుకు వెళ్లవలసిన అవ‌స‌రం ఉంది.  కాప్రికార్న్ చుట్టూ వున్న నూరు, నూటా ఇర‌వై ఐదు దేశాల‌కు మాత్ర‌మే సౌర శక్తి ని అందుబాటులోకి తేవ‌డం కాకుండా యావత్తు ప్ర‌పంచ‌ం దీని నుండి ల‌బ్ధి ని పొందాలి. 

సౌర శ‌క్తి కి సంబంధించిన అంత‌ర్జాతీయ స‌హ‌కార స్ఫూర్తి ప్ర‌కారం ఐరాస‌ లోని స‌భ్య‌త్వ దేశాలు అన్నీ ఐఎస్ఎ అసెంబ్లీ లో స‌భ్యులు కావాల‌నే ప్ర‌తిపాద‌న‌ ను భార‌త‌దేశం ముందుకు తీసుకువస్తోంది.
 
మిత్రులారా,
 
ఐఎస్ఎ లో  ముఖ్య‌మైన స‌భ్యురాలిగా వున్న భార‌తదేశం.. ఇండియ‌న్ ఓశన్ రిమ్ అసోసియేశన్ కు అధిక ప్రాధాన్య‌ాన్ని ఇస్తోంది.  శక్తి రంగం లో మాకు అవే స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి.  అందుకే .. శక్తి భ‌ద్ర‌త అవ‌స‌రాల దృష్ట్యా మ‌నంద‌రం ఉమ్మ‌డి కృషి చేస్తూ నవీకరణ యోగ్య శ‌క్తి కి ప్రాధాన్య‌ాన్ని ఇవ్వాలి. 

ఈ ప్రాంతం లో అంద‌రూ భ‌ద్ర‌త‌ ను, వృద్ధి ని సాధించ‌డానికిగాను నేను ఇప్ప‌టికే ఎస్ఎజిఎఆర్ ను అంద‌రి ముందూ ఉంచాను.  ఈ స‌మావేశం ద్వారా స‌హకారానికి సంబంధించిన నూత‌న మార్గాలు తెరుచుకుంటాయ‌ని నేను న‌మ్ముతున్నాను.
 
మిత్రులారా,
 
భార‌త‌దేశం లో నవీకరణ యోగ్య శ‌క్తి వ‌న‌రుల వినియోగం పెరుగుతోంది.  దీని ప్ర‌భావం ఇప్పుడు చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  వాతావ‌ర‌ణానికి సంబంధించిన పారిస్ ఒప్పందం లో భాగంగా నిర్దేశించుకొన్న ల‌క్ష్యాల‌ను అందుకోవ‌డానికిగాను నవీకరణ యోగ్య శ‌క్తి వినియోగాన్ని విస్తృత‌ప‌ర‌చ‌డానికిగాను ఒక కార్యాచ‌ర‌ణ‌ తో కూడిన ప్ర‌ణాళిక మీద ప‌ని చేయ‌డం ఇప్ప‌టికే మొద‌లుపెట్టాం.  2030వ సంవత్సరం కల్లా మ‌నం ఉత్ప‌త్తి చేసే విద్యుత్తు లో 40 శాతం శిలాజేత‌ర వ‌న‌రుల‌ నుండి ఉత్ప‌త్తి చేయాలని మేం నిర్ణ‌యించాం.  ఈ ల‌క్ష్యం ప్ర‌కారం గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో మ‌న నవీకరణ యోగ్య శ‌క్తి సామ‌ర్థ్యాన్ని రెట్టింపు చేసుకొని 72 గీగావాట్ లకు చేరుకున్నాం.  ఈ విష‌యంలో సౌర శ‌క్తి సామ‌ర్థ్యం తొమ్మిది రెట్లు పెరిగింది.  మ‌నం ఉత్ప‌త్తి చేస్తున్న మొత్తం విద్యుత్తు లో జ‌లేత‌ర నవీకరణ యోగ్య శ‌క్తి 20 శాతం గా ఉంది.  ఇది మాత్ర‌మే కాదు, తొంద‌ర‌ లోనే దీనికి దాదాపు 50 గీగావాట్ ల శ‌క్తి ని జతచేయబోతున్నాం.  2022వ సంవత్సరం కల్లా 175 గీగావాట్ ల ఉత్ప‌త్తి కి  చేరుకోవాల‌ని మ‌నం పెట్టుకున్నల‌క్ష్యాన్నిచాలా విజ‌య‌వంతంగా చేరుకోబోతున్నామ‌న‌డానికి ఇది స్ప‌ష్ట‌మైన సంకేతం.

మిత్రులారా,

పేద‌రికాన్ని అధిగ‌మించి అధికారాన్ని అందుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చిన విశ్వాసంతో భార‌త‌దేశం త‌న అభివృద్ధి ని వేగ‌వంతం చేసింది.  గ‌తంలో వేల సంవ‌త్స‌రాలుగా ఏ వ‌న‌ర‌యితే మాకు బ‌లాన్ని, శ‌క్తిని ఇచ్చిందో అదే వ‌న‌రును మా నూత‌న విశ్వాసానికి కావ‌ల‌సిన బ‌లాన్ని, శ‌క్తి ని పొంద‌డానికి ఎంపిక చేసుకున్నాం.  ఈ వ‌నరు ఏదో కాదు.. అది సూర్యుడు.  భార‌తీయులు సూర్య‌ భ‌గ‌వానుని వేల సంవ‌త్స‌రాలు గా ఆరాధిస్తున్నారు.

మిత్రులారా,
 
రవి మాకు తేజాన్ని, శ‌క్తి ని ఇచ్చే దేవుడు.  మొత్తం సృష్టి కే కావ‌ల‌సిన జీవాన్ని దినకరుడు అందిస్తున్నాడ‌ని మేం న‌మ్ముతాం.  ఉద‌యమే ఆదిత్య న‌మ‌స్కారాల‌తో రోజు ను ప్రారంభించ‌డం మా సాంఘిక జీవ‌నం లో ఒక స్వాభావిక సంప్ర‌దాయం.  ఉద‌య‌మే లేత భానుని కిర‌ణాల‌ను చూడ‌గానే జ‌ల త‌ర్ప‌ణ‌ం వదలి ‘ఓం సూర్యాయ్ న‌మ‌:’ అంటూ మంత్రాన్ని జ‌పిస్తాం.  భగవాన్ భాస్కరుని కి నేను ప్ర‌ణ‌మిల్లుతున్నాను అని దీని భావం. 

వేదాల‌ నుండి యోగ వరకు మా ఆలోచ‌న‌ లకు, మా ఆరాధ‌న‌ కు, మా అంత‌ర్గ‌త శ‌క్తి కి మూలాధారం దివాకరుడు.  ఈ అంత‌ర్గ‌త శ‌క్తి ని మా బాహ్య శ‌క్తి అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి వీలుగా మ‌లచుకోవ‌డానికి మేం ఇప్పుడు కృత‌నిశ్చ‌యుల‌మై వున్నాం. ఈ ప‌నిని ఆధునిక విజ్ఞానం ద్వారా చేయ‌బోతున్నాం. 

మిత్రులారా,
 
సౌర విద్యుత్తు రంగం లో భార‌త‌దేశం చాలా వేగంగా ప‌ని చేస్తోంది.  గ‌త నాలుగు సంవ‌త్స‌రాలలో సౌర విద్యుత్తు త‌క్కువ ధ‌ర‌ ల‌కు అందుబాటు లోకి వ‌స్తోంది.  త‌ద్వారా దేశం లో పేద ప్ర‌జ‌ల‌కు విద్యుత్తును అందించాల‌నే మా ల‌క్ష్యాన్ని వేగంగా చేరుకోవ‌డం సాధ్యమైంది.
 
ప్ర‌తి ఇంటికీ విద్యుత్తు ను అందించాల‌నే మా ల‌క్ష్యాన్ని అందుకోవ‌డంలో ‘పానెల్ టు ప‌వ‌ర్’, ‘మేక్ ఇన్ ఇండియా’ అనే రెండు కార్య‌క్ర‌మాలు ప్ర‌ధాన‌మైన మైలురాళ్లుగా నిలచాయి.  గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌లో ప‌్ర‌పంచ‌ వ్యాప్తంగా చూసిన‌ప్పుడు నవీకరణ యోగ్య శ‌క్తి రంగం లో అంద‌రి దృష్టి ని ఆక‌ర్షిస్తున్న‌ దేశంగా భార‌త‌దేశం రూపొందింది.  ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో 42 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులను సాధించ‌డం జ‌రిగింది.

మిత్రులారా,
 
సౌర విద్యుత్తు రంగం లో జ‌రుగుతున్న మార్పుల కార‌ణంగా విదేశీ పెట్టుబ‌డుల అవ‌కాశాలు మాత్ర‌మే లభించవు.  మ‌న దేశీయ పారిశ్రామిక వేత్త‌ ల‌కు కూడా క‌ని విని ఎరుగ‌ని రీతి లో అవ‌కాశాల‌ను క‌ల్పిస్తాయి.  దేశం లో సౌర ప‌ల‌క‌ల త‌యారీ కోసం అనువైన వాతావ‌ర‌ణాన్ని రూపొందించ‌డానికి మేం ప్ర‌య‌త్నిస్తున్నాం. 

నవీకరణ యోగ్య శ‌క్తి రంగం లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఇది అత్యంత అనువైన స‌మ‌యం. రాబోయే నాలుగు సంవత్సరాలలో దాదాపు 70 నుండి 80 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన వ్యాపారం జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి.

మిత్రులారా,
 
విద్యుత్తు ఉత్ప‌త్తి తో పాటు విద్యుత్తు ను నిలవ ఉచుకోవ‌డం కూడా చాలా ముఖ్య‌మైన విష‌యం.  ఇందుకోసం కావలసిన మౌలిక స‌దుపాయాల‌ను నేశన‌ల్ స్టోరేజ్ మిశన్ ప‌థ‌కం లో భాగం గా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.  ఈ బృహ‌త్ ప‌థ‌కం లో అవ‌స‌ర‌మైన విధాన‌ప‌ర‌మైన మ‌ద్ద‌తు కోసం దృష్టి ని కేంద్రీక‌రించాం.  స్టోరేజి డిమాండ్ కు, దేశీయంగా త‌యారీ కి, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు, ఎన‌ర్జీ స్టోరేజి సామ‌ర్థ్య పెంపుద‌ల‌కుఈ విధాన‌ప‌ర‌మైన మ‌ద్ద‌తు అవ‌స‌రం. 

గ్రామాల్లోని వ్య‌వ‌సాయ క్షేత్రాల్లో సౌర ఫల‌కాల‌ను నెల‌కొల్ప‌డానికిగాను ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింది.  కిసాన్ ఊర్జా సుర‌క్షా ఏవ‌ం ఉత్థాన్ మ‌హా అభియాన్ – కెయుఎస్ఎఎమ్ ప‌థ‌కం లో భాగంగా ఈ ప‌ల‌క‌ ల‌ను గ్రిడ్ కు జోడించడం జ‌రుగుతుంది.  రాబోయే నాలుగేళ్ల‌ లో దాదాపుగా 28 ల‌క్ష‌ల సౌర పంపు ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది.  వీటి ద్వారా ప‌ది గీగావాట్ విద్యుత్తు ను ఉత్ప‌త్తి చేయాల‌నే ల‌క్ష్యాన్ని నిర్దేశించుకోవ‌డం జ‌రిగింది.

మిత్రులారా,
 
సౌర‌ విద్యుత్తు, ప‌వ‌న విద్యుత్తు లకు తోడు గా మేము బి-3 అనే దాని మీద చాలా వేగంగా ప‌ని చేస్తున్నాం.  బి- 3 అంటే బ‌యో మాస్‌, జీవ ఇంధ‌నం, జీవ శ‌క్తి.  స్వ‌చ్ఛ‌మైన ఇంధ‌న ఆధారిత వ్య‌వ‌స్థ‌ ను భార‌త‌దేశం లో నెల‌కొల్ప‌డానికిగాను ప‌నులను చిత్త‌శుద్ధి తో చేప‌ట్టాం.  బ‌యోగ్యాస్ నుంచి జీవ ఇంధ‌నాన్ని ఉత్ప‌త్తి చేయ‌డం ద్వారా ఈ స‌వాల్‌ ను ఒక అవ‌కాశంగా మ‌ల్చుకోగ‌లిగాం.  ఇందుకోసం గోబ‌ర్ ధ‌న్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టాం.  ఇది బృహ‌త్త‌ర‌మైన ప‌థ‌కం.  ఆవు పేడ‌ ద్వారా ఆదాయాన్ని పొంద‌డానికి ఈ ప‌థ‌కం ఉప‌యోగ‌ప‌డుతుంది.  వ్య‌ర్థాల‌ను శ‌క్తిగా మార్చ‌డానికిగాను ప‌ట్టణాలలో, గ్రామాలలో అనేక వినూత్న‌ ప్ర‌యోగాల‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింది. 

మిత్రులారా,
 
ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌డానికిగాను నవీకరణ యోగ్య శక్తి రంగం లో ఇప్ప‌టికే ప‌ని మొద‌లైంది. విద్యుత్తు ప‌రిర‌క్ష‌ణ కూడా మ‌నకు ఉన్న ప్రాధాన్య‌ాల్లో ప్ర‌ధాన‌మైంది. 

ప్ర‌స్తుతం ఉజాలా పథకం లో భాగంగా భార‌త‌దేశం లోని న‌లుమూల‌లా ఎల్ఇ డి బ‌ల్బుల‌ను పంపిణీ చేశాం.  వాటితో గృహాల‌కు, వీధుల‌కు, ర‌హ‌దారుల‌కు కావల‌సిన వెలుగుల‌ను అందిస్తున్నాం.  ఈ ప‌థ‌కం లో భాగం గా దాదాపు 31 కోట్ల ఎల్ఇ డి బ‌ల్బు ల‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింది.  31 వేల బ‌ల్బులంటే.. ఇది చాలా పెద్ద సంఖ్య‌.  ఈ పని చేయ‌డం ద్వారా దాదాపు ప్రతి గంటా 40 వేల మిలియ‌న్ కిలోవాట్ విద్యుత్తు ను ఆదా చేయ‌డం జ‌రుగుతోంది.  ఈ ప‌థ‌కం ఎంత‌టి ప్ర‌భావాన్ని చూపుతుందో ఎవ‌రైనా ఊహిచంగ‌ల‌రా ?  ఇదే కాదు, ప్రతి సంవత్సరం లో విద్యుత్తు బిల్లు లకు సంబంధించి దేశ ప్ర‌జ‌ల‌కు చెందిన‌ 16 వేల కోట్ల రూపాయ‌ల డ‌బ్బు ఆదా అవుతోంది.  ఆ మేర‌కు భారీ స్థాయిలో కార్బ‌న్ డ‌యాక్సైడ్ ఉత్ప‌త్తి కాకుండా ఆప‌గ‌లిగాం.
 
ఇది ఆరంభం మాత్ర‌మే అని మ‌రో సారి నేను చెప్ప‌ద‌ల్చుకున్నాను.  భ‌విష్య‌త్తు లో మ‌రెన్నో అవ‌కాశాలు ఉన్నాయి.  భావి తరాల‌కు ఆరోగ్య‌క‌రమైన వాతావ‌ర‌ణాన్ని అంద‌జేసి ఆ విష‌యం లో న్యాయం చేయ‌డానికి ఉన్న అన్ని అవ‌కాశాల‌ను వినియోగించుకోవాలి.  వాటిని అమ‌లు చేయ‌డంలో మ‌నం త‌ప్ప‌కుండా విజ‌యం సాధించాలి.

రాబోయే మూడు రోజుల్లో మీరు ఈ అవ‌కాశాలను గురించి స‌మ‌గ్రంగా చ‌ర్చిస్తార‌ని అనుకుంటున్నాను.  మీ చ‌ర్చ‌ల‌ ద్వారా నవీకరణ యోగ్య భవిష్య‌త్తు ను మ‌రింత కాంతివంతం, శోభాయ‌మానం చేస్తార‌ని అనుకుంటున్నాను. 

మీరు ఇచ్చే ప్ర‌తి స‌ల‌హా, ప్ర‌తి వినూత్న‌మైన ఆలోచ‌న మ‌న‌కు చాలా ముఖ్యమ‌ని నేను న‌మ్మ‌తున్నాను.  అందుకే మ‌నం ఈ అంశాల‌న్నిటినీ ముందుకు తెస్తున్నాం.  మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కావ‌చ్చు, సాంకేతిక‌త‌ ను ఆధునీక‌రించ‌డం కావ‌చ్చు, లేదా ప్ర‌పంచ వ్యాప్తంగా నూత‌న దేశాల్లోని సామాన్య ప్ర‌జ‌లు చేసే ప్ర‌యోగాలు కావ‌చ్చు.. వాటి సహాయం తో మ‌నం ఈ బృహ‌త్త‌ర‌మైన కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేస్తామ‌ని నాకు న‌మ్మ‌కం ఉంది.  ప్ర‌పంచ ఆర్ధిక రంగం లో ప్ర‌పంచీక‌ర‌ణ స‌మ‌స్య ను గురించి విస్తృతంగా చ‌ర్చించ‌డం జ‌రిగింది.  సాంకేతిక కార‌ణం గా దేశాల‌న్నీ ఒక‌దాని తో మ‌రొక‌టి చాలా ద‌గ్గ‌ర‌య్యాయి.  మేం కూడా ఒక క‌ల‌ తో ప్రారంభించాం- అది- ఒకే ప్ర‌పంచం, ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్ అనేదే. 

ఈ బృహ‌త్త‌ర‌మైన కార్య‌క్ర‌మం ఆచ‌ర‌ణ‌ లోకి వ‌స్తే  ఎలా ఉంటుందో మీరు ఊహించ‌వ‌చ్చు.  సూర్యోద‌య స‌మ‌యం లో ఈ గ్రిడ్ ప‌ని చేయ‌డం మొద‌లై సూర్యాస్త‌మ‌యం దాకా  ప‌ని చేస్తే ఇక మ‌నం 24 గంట‌లూ విద్యుత్తు ను ఉత్ప‌త్తి చేసుకోవ‌డం జ‌రుగుతుంది.  మ‌న దేశం లో ప‌గటిపూట మ‌న‌కు ల‌భించే సూర్య‌ర‌శ్మి ని గురించే ఇప్పుడు మ‌నం ఆలోచిస్తున్నాం.  అలా కాకుండా ఒకే ప్ర‌పంచం, ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్ అనే స్వప్నం దిశ‌ గా ఆలోచన చేస్తే 24 గంట‌లూ విద్యుత్తు ఉత్ప‌త్తి సాధ్య‌పడుతుంది.  ఎందుకంటే ప్రపంచ‌ వ్యాప్తంగా చూసిన‌ప్పుడు సూర్యాస్త‌మ‌యం అనేది ఉండ‌దు.  ప్ర‌పంచంలో ఎక్క‌డో ఒక‌చోట.. రోజు లో ప్ర‌తి స‌మ‌యం లోనూ సూర్యుడు వెలుగులీనుతూనే ఉంటాడు. 

వినూత్న‌ ప‌ద్ధ‌తి లో ఆలోచించవలసిన అవ‌స‌రం ఉంది.  ఐఎస్ఎ కు సంబంధించిన ఈ కార్య‌క్ర‌మం సందర్భంగా నూత‌న విశ్వాసం తో, నూత‌న ఆలోచ‌న‌ ల‌తో, నూత‌న శ‌క్తి తో , నూత‌న నిర్ణ‌యాల‌ తో మ‌నం త‌ప్ప‌కుండా పురోగ‌తి కి మళ్లి ప్ర‌ధాన‌ పాత్ర‌ ను పోషిస్తాం అని నేను విశ్వసిస్తున్నాను.
 
భార‌త‌దేశాన్ని మీరు సందర్శించినందుకు, ప్ర‌పంచానికి తేజోవంత‌మైన భ‌విష్య‌త్తు ను అందించ‌డానికిగాను ఎంతో ముఖ్య‌మైన కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నందుకు మ‌రోసారి మీకు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. 

మీకు అంద‌రికీ అనేకానేక ధన్యవాదాలు.

**