Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అందరి శ్రేయస్సు, విశ్వ క్షేమం కోసం ఆశీస్సులను కోరుతూ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని


వికాసం, సమృద్ధి, సమస్త మానవాళి సంక్షేమం కోసం ఆశీస్సులను కోరుతూ.. ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

‘‘వనస్పతే శతవల్శో వి రోహ సహస్రవల్శ వి వయం రుహేమ్

యం త్వామయం స్వాధితిస్తేజమానః ప్రాణినాయ మహతే సౌభగాయ’’

ఓ వృక్షమా! వందలాది, వేలాది శాఖలతో నువ్వు పెరిగి వర్ధిల్లు. నీతోపాటు మేమూ వర్ధిల్లుదము గాక. గొప్ప సమృద్ధి, సౌభాగ్యం దిశగా మీకు ప్రేరణనిచ్చిన ఆ తేజోశక్తి.. మనందరికీ కూడా సంక్షేమాన్ని ప్రసాదించాలని ఆశిస్తున్నాను.

 

****