Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అందరి సంక్షేమం, సౌభాగ్యం కోసం ప్రకృతిని సంరక్షించడం, పోషించడం ముఖ్యమంటున్న సంస్కృత సుభాషితం.. ప్రస్తావించిన ప్రధానమంత్రి


అందరి సంక్షేమం, సౌభాగ్యం కోసం ప్రకృతిని సంరక్షించడం, పోషించడం ముఖ్యమని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.
‘‘పాలయన్ ప్రకృతిం రాజా సుఖీ భవతి నాన్యథా
ప్రకృతిశ్చ హితా యస్య స రాజా సర్వకామధుక్’’ అన్న సుభాషితాన్ని ఆయన పేర్కొన్నారు.
ఈ శ్లోకానికి భావం ఇదీ..
రాజు ప్రకృతిని రక్షిస్తూ, ప్రకృతి అభ్యున్నతికి పాటు పడినప్పుడు సంతోషం, సౌభాగ్యం వర్ధిల్లుతాయి. ప్రకృతి కూడా తన వంతుగా తనను రక్షించి, పోషించే వారి కోరికలను నెరవేరుస్తుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘పాలయన్ ప్రకృతిం రాజా సుఖీ భవతి నాన్యథా
ప్రకృతిశ్చ హితా యస్య స రాజా సర్వకామధుక్’’ అని పేర్కొన్నారు.