పిఎంఇండియా
జాతిపిత మహాత్మాగాంధీకి ప్రధాని ఘన నివాళి –
ప్రధాని శ్రీ నరేంద్రమోదీ జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని శిరసు వంచి అభివాదం చేసి ఘన నివాళి అర్పించారు. “పూజ్యబాపూజీకి శతకోటి వందనాలు” అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
ప్రధాని జార్ఖండ్ పర్యటన –
ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్‌లోని ఖుంతి జిల్లా కోర్టులో 180 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంటును ప్రారంభించారు. మహాత్మా గాంధీ జయంతి రోజున సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించడం సరైన సందర్భమని భారీ ఎత్తున హాజరైన ప్రజలనుద్దేశించి ప్రధాని అన్నారు. మహాత్మాగాంధీ తన ఆలోచనలు, చర్యలన్నింటిలోనూ ప్రకృతితో సామరస్యంగా జీవించడంతో ఎలాగో ఆచరణలో చూపారని మోదీ చెప్పారు. తాను ఇటీవల ఐక్యరాజ్యసమితిని సందర్శించారని, ఆ సదస్సుకు హాజరైన నాయకులందరూ భూతాపం గురించి, దాని వల్ల మానవాళికి ఎదురవుతున్న ముప్పు గురించి ప్రముఖంగా ప్రస్తావించారని ప్రధాని తెలిపారు. మన పూర్వీకులెవరూ ప్రకృతికి ఎలాంటి హాని కలిగించాలని ఆలోచించలేదు గనుక భూతాపం పెరిగేందుకు భారత్ ఏ విధంగాను బాధ్యురాలు కాదని ఆయన చెప్పారు. అయినా మానవాళిని ఈ ముప్పు నుంచి కాపాడేందుకు భారత్ తన వంతు పాత్ర పోషిస్తున్నదని ఆయన తెలిపారు. ఆ బాధ్యత నెరవేర్చడంలో సోలార్ ఎనర్జీ ఒకటని ఆయన అన్నారు. బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్న జార్ఖండ్ ఒక జిల్లా కోర్టు మొత్తాన్ని సౌరశక్తితో పని చేయించాలని నిర్ణయించడం ఈ దిశగా మరింత ప్రాధాన్యత సంతరించుకున్నదని ఆయన అభినందించారు. విద్యుత్ సరఫరా లేని కారణంగా కోర్టుల్లో న్యాయం అందించడం జాప్యం అయిన సంఘటనలు చాలా ఉన్నాయని ప్రధాని చెప్పారు. ఇలా సౌరశక్తితో నడిచే కోర్టు సముదాయం ఇక ముందు అలాంటి పరిస్థితి తలెత్తకుండా నిరోధించగలుగుతుందని ఆయన అన్నారు. విద్యుత్తును పొదుపు చేసి విద్యుత్ బిల్లులను తగ్గించుకునేందుకు ఎల్ఇడి బల్బులు ఉపయోగించుకోవాలని ప్రధాని ప్రజలను కోరారు.
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ప్రధాని ఆయనకు ఘన నివాళి అర్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో జరిగిన 1965 భారత-పాక్ యుద్ధంలో భారత దేశ గెలపుని పురస్కరించుకుని ఇటీవలే మనదేశం స్వర్ణోత్సవాలు నిర్వహించుకున్నదన్న విషయం ఆయన గుర్తు చేశారు. తాను ఇటీవల తాష్కెంట్ వెళ్ళిన సమయంలో శాస్త్రిజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.
ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఒక భారీ రుణ శిబిరాన్ని ప్రధాని దుంకాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదుగురు లబ్ధిదారులకు ముద్రా కార్డులు ఆయన అందచేశారు. ఖుంతిలోను, దుంకాలోను తన సభలకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చినందుకు ఆయన హర్షం ప్రకటించారు. అభివృద్ధి పట్ల జార్ఖండ్ ప్రజలకు గల ఆసక్తికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. వ్యాపార నిర్వహణ సరళం చేయడంలో చక్కని పురోగతి సాధించినందుకు జార్ఖండ్ ప్రభుత్వాన్ని, ప్రజలను ప్రధాని అభినందించారు.ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదికలో ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావించిందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద ఇప్పటి వరకు 42 లక్షల మంది ప్రజలకు 26 వేల కోట్ల రూపాయల మేరకు రుణాలందించారని ప్రధాని చెప్పారు. ఈ పథకం చిన్న తరహా వ్యాపారులు తమ వ్యాపారాలు విస్తరించుకునేందుకు, వారు వడ్డీ వ్యాపారుల ఉక్కు పిడికిలి నుంచి బయటపడేందుకు సహాయకారిగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారిలో 20 లక్షల మంది మహిళలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. తాను ప్రారంభించిన గివిట్ అప్ కార్యక్రమం కింద ఇప్పటికి 31 లక్షల మంది గ్యాస్ సబ్సిడీ వదులుకున్నారని ప్రధాని తెలిపారు. పేదరికం రేఖకు దిగువన ఉన్న మూడు కుటుంబాలకు కొత్త ఎల్‌పిజి కనెక్షన్లు అందిస్తూ ఎల్‌పిజి సబ్సిడీ వదులకున్న వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారు సబ్సిడీ వదులుకున్నందు వల్ల అవసరంలో ఉన్న పేద ప్రజలకు ఎల్‌పిజి కనెక్షన్లు అందించగలిగినట్టు ఆయన చెప్పారు.
దుంకా జిల్లాలో చరిత్రప్రసిద్ధమైన మాలుటి దేవాలయాన్ని సంరక్షించి అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ఆన్‌లైన్ కార్యక్రమాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు.
సఫాయిగిరి సమ్మిట్, అవార్డుల సభ 2015 –
స్వచ్ఛ భారత్ ఉద్యమం చేపట్టడానికి మహాత్మాగాంధీ అతి పెద్ద స్ఫూర్తి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీ లో ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సఫాయిగురి శిఖరాగ్రం, అవార్డుల సభలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది కాలంలో స్వచ్ఛభారత్ ఉద్యమంలో ఎందరో భాగస్వాములయ్యారని, ఎంతో మంది చేయూత అందించారని అన్నారు.ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంతో ఎలక్ట్రానిక్ మీడియా ఎంతో క్రియాశీలమైన పాత్ర పోషించిందని, ఈ కార్యక్రమంలోని పాజిటివ్ అంశాలకు ప్రముఖంగా ప్రచారం కల్పించిందని ప్రధాని తెలిపారు. స్వచ్ఛత/పరిశుభ్రత అనేది రోజువారీ అలవాటు అని, ఒకసారి ఇది అలవాటుగా మారితే వ్యక్తులు చెత్తా చెదారంతో కూడిన పరిశుభ్రత లేని పరిసరాలను ఏ మాత్రం సహించలేరని ఆయన చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రత అంటే భారత సమాజానికి ఎంతో ఆసక్తి అని ప్రధాని అన్నారు. అయినప్పటికీ ఎంతో కాలంగా ఇది నిర్లక్ష్యానికి గురవుతున్న అంశమని, ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని పేర్కొన్నారు. అపరిశుభ్రత కారణంగా దేశంలో రోజూ వెయ్యి మంది పిల్లలు మృత్యువాత పడుతున్నారని ప్రధాని వెల్లడించారు. స్వచ్ఛభారత్ ను కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగానే చూడవద్దని ప్రజల్ని కోరిన ఆయన ఇది ప్రతి ఒక్కరి కార్యక్రమమని భావించాలన్నారు. భారతదేశం స్వచ్ఛంగా ఉండాలని 125 కోట్ల మంది జనాభాలో ప్రతీ ఒక్కరూ భావిస్తే భారత్ పూర్తి స్వచ్ఛత గల దేశంగా మారిపోతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. అవార్డులకు ఎంపికైన వారు స్వచ్ఛత కోసం చేసిన కృషిని ప్రధాని ప్రశంసించారు. వారు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారని ఆయన చెప్పారు. గత ఏడాది కాలంగా స్వచ్ఛభారత్ కోసం విశేషమైన కృషి చేసిన వారిని ప్రత్యేకించి యువతను ఆయన ఉదాహరణగా చూపారు.
At Raj Ghat earlier today. pic.twitter.com/Skz6qEaGTs
— Narendra Modi (@narendramodi) October 2, 2015
Why did I go to a district court, all the way to Khunti, Jharkhand? My speech on solar energy explains. http://t.co/7D5kSGq8MR
— Narendra Modi (@narendramodi) October 2, 2015
Shall join #Safaigiri Awards. Will spend time with those who made inspiring efforts for a Swachh Bharat. #MyCleanIndia @IndiaToday
— Narendra Modi (@narendramodi) October 2, 2015
PM @narendramodi in Jharkhand. Watch the programme in Khunti district. https://t.co/qYP80eEi4d
— PMO India (@PMOIndia) October 2, 2015
Today the PM has come to a programme in a district court. A lot of people would be puzzled why is this happening: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 2, 2015
Our culture never permits the exploitation of nature and natural resources: PM @narendramodi https://t.co/qYP80emGFD
— PMO India (@PMOIndia) October 2, 2015
If Guj& Raj think of solar energy people will say it is understandable, they have no coal. But when Jharkhand does so, it is noticed: PM
— PMO India (@PMOIndia) October 2, 2015
Do you want your power bills to reduce? Then think of LED bulbs: PM @narendramodi https://t.co/qYP80eEi4d
— PMO India (@PMOIndia) October 2, 2015
Fulfilling the dream of our beloved Mahatma Gandhi. #MyCleanIndia pic.twitter.com/oDlLCxH8mO
— PMO India (@PMOIndia) October 2, 2015
Devoting time for a SwachhBharat. #MyCleanIndia pic.twitter.com/3hupda7ZVx
— PMO India (@PMOIndia) October 2, 2015
The atmosphere here indicates how Jharkhand has come fully on the path of development: PM
— PMO India (@PMOIndia) October 2, 2015
PM @narendramodi takes note of the progress in Jharkhand, including the much improved 'ease of doing rankings' https://t.co/l8ZqTRNwLA
— PMO India (@PMOIndia) October 2, 2015
Today I urge you all to buy Khadi. When sales of Khadiincrease, the poor benefit: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 2, 2015
Congratulate all award winners. Their work will inspire so many: PM at #Safaigiri @IndiaToday http://t.co/Iy8hu3Nre5 #MyCleanIndia
— PMO India (@PMOIndia) October 2, 2015
SwachhBharat is one programme where many people have helped particularly media & that too electronic media: PM at #Safaigiri @IndiaToday
— PMO India (@PMOIndia) October 2, 2015
If you feel SwachhBharat Abhiyaanis a government programme it wont succeed. This has to be our programme: PM at #Safaigiri @IndiaToday
— PMO India (@PMOIndia) October 2, 2015
Now cleanliness is being discussed in Parliament. We have even been cornered on it but the fact is discussions are happening: PM #Safaigiri
— PMO India (@PMOIndia) October 2, 2015
We do not have the right to make our nation dirty: PM @narendramodi at #Safaigiri @IndiaToday
— PMO India (@PMOIndia) October 2, 2015
#Safaigiri Awards function was an enjoyable programme with a serious message & unequivocal support to Swachh Bharat Abhiyaan. #MyCleanIndia
— Narendra Modi (@narendramodi) October 2, 2015