Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అక్టోబర్ 9న మహిళలు, బాలల సంక్షేమంపై శిఖరాగ్ర సదస్సు ముగింపు కార్యక్రమానికి ప్రధాని


మహిళలు, బాలల సంక్షేమంపై విభాగ శిఖరాగ్ర సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని రేపు, అంటే 2026 అక్టోబరు 9న సాయంత్రం సుమారు 4:30 గంటలకు న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవనంలో నిర్వహిస్తారు.

 

రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఆరంభించారు. రాష్ట్రాల్లో మహిళా, శిశు సంక్షేమ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న అధికారులతో పాటు రాజకీయ నాయకులు దీనిలో పాలుపంచుకుంటున్నారు. సహకార ప్రధాన సమాఖ్యవాదాన్ని పటిష్ఠపరచడం, జాతీయ ప్రాధాన్యాల విషయంలో సామూహిక యాజమాన్యాన్ని ప్రోత్సహించడంతో పాటు కేంద్రానికీ, రాష్ట్రాలకీ మధ్య సన్నిహిత సహకారాన్ని నెలకొల్పి సత్వర ఫలితాలు రాబట్టాలన్న ప్రధానమంత్రి సంకల్పానికి అనుగుణంగా నిర్వహిస్తున్న విభాగాల వారీ శిఖరాగ్ర సదస్సుల్లో ఇది రెండో శిఖరాగ్ర సదస్సు.

 

ఈ కింద పేర్కొన్న నాలుగు విషయాలపై శిఖరాగ్ర సదస్సులో చర్చిస్తున్నారు:

 

1. మెరుగైన పోషణ, ప్రాథమిక విద్య బోధన లక్ష్యాలతో అంగన్‌వాడీ కేంద్రాలకు సరికొత్తగా మార్గదర్శనం చేయడం.

 

2. అపాయకర పరిస్థితులు ఎదురు కాగల బాలలకు భద్రత వ్యవస్థను బలోపేతం చేయడం.

 

3. సంస్థాగత, శాసన ప్రాథమిక ప్రణాళికలను పక్కాగా అమలుచేస్తూ మహిళలకు భద్రతను నిర్ధారించడం.

 

4. మహిళల విషయంలో కీలక పథకాలను ప్రభావవంతంగా అమలుచేసి, ఫలితాలను పెంపొందింప చేయడం ద్వారా వారికి సాధికారతను కల్పించడం.

 

విభాగ సంబంధిత శిఖరాగ్ర సదస్సులో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల ఆసక్తిదారులు పాల్గొని, రంగాల వారీ ప్రాధాన్యాలపై చర్చిస్తున్నారు. మంచి పద్ధతులను పరస్పరం పంచుకొంటూ, కార్యాచరణలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంపై ఆలోచనలు చేస్తున్నారు. మెరుగైన పాలన, సేవల అందజేతకు నిర్ణీత కాల ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన పనులపై ఏకాభిప్రాయాన్ని సాధించడానికి ఈ సదస్సు ఉపయోగపడనుంది.

 

***