Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అక్టోబ‌ర్ 11, 2015న ప్ర‌ధాని కార్య‌క్ర‌మాలు

అక్టోబ‌ర్ 11, 2015న ప్ర‌ధాని కార్య‌క్ర‌మాలు

అక్టోబ‌ర్ 11, 2015న ప్ర‌ధాని కార్య‌క్ర‌మాలు

అక్టోబ‌ర్ 11, 2015న ప్ర‌ధాని కార్య‌క్ర‌మాలు

అక్టోబ‌ర్ 11, 2015న ప్ర‌ధాని కార్య‌క్ర‌మాలు

అక్టోబ‌ర్ 11, 2015న ప్ర‌ధాని కార్య‌క్ర‌మాలు

అక్టోబ‌ర్ 11, 2015న ప్ర‌ధాని కార్య‌క్ర‌మాలు

అక్టోబ‌ర్ 11, 2015న ప్ర‌ధాని కార్య‌క్ర‌మాలు


ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ముంబ‌యిలో ఏర్పాటైన వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఆయ‌న చైత్య‌భూమికి వెళ్లి డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్క‌ర్ కు ఘ‌న నివాళి ఘ‌టించారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఇందు మిల్స్ కాంపౌండ్‌లో డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ మెమోరియ‌ల్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించారు.

త‌ద‌నంత‌రం ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ, జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ నౌకాశ్ర‌యంలో నాలుగో కంటెయిన‌ర్ టెర్మిన‌ల్ నిర్మాణానికి ఉద్దేశించిన శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించారు. ఆ త‌ర్వాత జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో రెండు మెట్రో రెయిల్ కారిడార్ల నిర్మాణ‌ శిలాఫ‌ల‌కాల్ని కూడా ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్క‌ర్ భార‌త జాతికి చేసిన సేవ‌ల్ని కొనియాడారు. ఇందు మిల్స్ కాంపౌండ్‌లో నిర్మించ‌బోయే డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్క‌ర్ మెమోరియ‌ల్ అంత‌ర్జాతీయ‌స్థాయిలో ఉంటుంద‌ని అన్నారు. దాని నిర్మాణంలో మ‌హారాష్ట్ర‌లోని ప్ర‌తి గ్రామానికి భాగ‌స్వామ్యం ఉంటుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 26ను రాజ్యాంగ దినంగా జ‌రుపుకోబోతున్నామ‌ని దీనివ‌ల్ల డాక్ట‌ర్ అంబేద్క‌ర్ ఈ దేశానికి చేసిన సేవ‌ల‌పై నేటి త‌రానికి త‌గిన చైత‌న్యం క‌లుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

రిజ‌ర్వేష‌న్ల విధానాన్ని స‌మీక్ష చేయ‌బోతున్నార‌నే పుకార్ల‌ను ఈ సంద‌ర్భంగా తిప్పికొట్టారు. అస‌మాన‌త‌ల్ని తొల‌గించ‌డానికి డాక్ట‌ర్ అంబేద్క‌ర్ క‌ల్పించిన హ‌క్కుల్ని ఎవ‌రూ తీసేయ‌లేర‌ని అన్నారు.

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప‌ని విధానాన్ని ప్ర‌ధాని మెచ్చుకున్నారు. ప్రాథ‌మిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌లో ఆయ‌న చేస్తున్న కృషిని అభినందించారు. అంతే కాదు గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంర‌క్ష‌ణ సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ చొర‌వ‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.
కేంద్ర మంత్రులు శ్రీ సురేష్ ప్ర‌భు, శ్రీ నితిన్ గ‌డ్క‌రీలు త‌మ శాఖ‌ల ప‌రంగా చేస్తున్న కృషిని ప్ర‌శంసించారు. నౌకాశ్ర‌యాల్లో జ‌రిగే అభివృద్ధి అనేది మేకిన్ ఇండియా కార్య‌క్ర‌మంలోనూ, దేశాభివృద్ధిలోనూ పోషించే పాత్ర‌పైన ఆయ‌న ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

అంత‌కు ముందు ఆయ‌న ఉద‌య‌మే, లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ జ‌యంతి సంద‌ర్భంగా శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌యి, శ్రీ జార్జ్ ఫెర్నాండెజ్‌ల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకున్నారు.