Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అఖిల భార‌తీయ ప్రాచార్య స‌మ్మేళ‌నంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

అఖిల భార‌తీయ ప్రాచార్య స‌మ్మేళ‌నంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

అఖిల భార‌తీయ ప్రాచార్య స‌మ్మేళ‌నంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో జ‌రిగిన అఖిల భార‌తీయ ప్రాచార్య స‌మ్మేళ‌నాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విద్యా భార‌తి శిక్షా సంస్థాన్ ఏర్పాటు చేసింది.

”విలువ‌ల‌తో కూడిన విద్య” కు క‌ట్టుబ‌డిన సంస్థ‌గా విద్యా భార‌తికి ఉన్న ప్ర‌తిష్ట‌ను మ‌రింత ప‌టిష్టం చేసే దిశ‌గా కృషి చేయాల‌ని స‌భికుల‌కు ప్ర‌ధాన మంత్రి ఉద్బోధించారు. విద్యార్థుల జీవ‌నంలోని ప్ర‌తి ఒక్క అంశంలోనూ శ్రేష్ఠ‌త కోసం పాటు ప‌డాల‌ని క‌ళాశాల ప్ర‌ధాన అధ్యాప‌కుల‌కు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఉదాహ‌ర‌ణ‌కు, వారిని 2020 ఒలింపిక్స్ లో స్వ‌ర్ణ ప‌త‌కాలు గెలువ‌గ‌లిగేలా క్రీడాకారులను త‌యారు చేసే విధంగా తీర్చిదిద్దాల‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

స‌మాజంలో స‌కారాత్మ‌క మార్పుల‌ను తీసుకురావ‌డానికి విద్యా భార‌తి పాఠ‌శాల‌ల విద్యార్థులు సైతం ప‌నిచేయ‌వ‌చ్చ‌ని, ప‌రిశుభ్ర‌త (స్వ‌చ్ఛ భార‌త్), ఇంధ‌నం ఆదా (బిజ్ లీ బ‌చావో) వంటి రంగాల‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. ఎల్ ఇ డి బ‌ల్బుల ఉప‌యోగం ద్వారా విద్యుత్తును ఆదా చేయ‌వ‌చ్చ‌ని వివ‌రించారు. విద్యా భార‌తి పాఠ‌శాల‌లు వీటిని గ‌రిష్ఠ స్థాయిలో వినియోగించుకోవాల‌ని సూచించారు.

విద్య‌కు సంబంధించిన అన్ని కోణాల‌లో సాంకేతిక విజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకొని త‌ద్వారా ల‌భించే ప్ర‌యోజ‌నాలు పొందాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి నొక్కిచెప్పారు. సాంకేతిక విజ్ఞానాన్ని ఉప‌యోగించుకొన్న వేరు వేరు పాఠ‌శాల‌ల గురించిన స్ఫూర్తిదాయ‌క‌మైన గాథ‌ల‌ను విద్యా భార‌తి పాఠ‌శాల‌లు త‌మ‌లో తాము ఒక‌రి నుంచి మ‌రొక‌రు సుల‌భంగా పంచుకోవ‌చ్చ‌ని ఆయ‌న ఒక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పారు.

ఇక్క‌డ గుమికూడిన ప్రాచార్యులు స‌కారాత్మ‌క‌త‌కు, సానుకూల శ‌క్తికి క‌ర‌దీపిక‌లుగా అవ్వాలి అని ప్ర‌ధాన మంత్రి కోరారు.

కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమ‌తి స్మృతి ఇరానీ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.