Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అన్ని ప్రాణులనూ పెంచి పోషించే తల్లి భూమియేనని చెబుతున్న సంస్కృత సుభాషితం


పృథ్వితో సామరస్యాన్ని కలిగి ఉంటూ మానవాళి మనుగడ సాగించాలని, అన్ని ప్రాణులనూ పెంచి పోషిస్తున్నది భూమియేనని, భూమిని సంరక్షిస్తున్న నైతిక వ్యవస్థను ఆదరించాలని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
‘‘విశ్వస్వం మాతరమోషధీనాం ధ్రువాం భూమిం పృథివీం ధర్మణా ధ్రుతామ్, శివాం స్యోనామను చరేమ విశ్వహా’’ అనే సంస్కృత శ్లోకాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘విశ్వస్వం మాతరమోషధీనాం ధ్రువాం భూమిం పృథివీం ధర్మణా ధ్రుతామ్, శివాం స్యోనామను చరేమ్ విశ్వహా’ అని పేర్కొన్నారు.

 

***