Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అభివృద్ధి పథకాల అమలు కోసం బాంగ్లాదేశ్ కు 4.5 బిలియన్ యుఎస్ డాలర్ల మేర థర్డ్ లైన్ ఆఫ్ క్రెడిట్ కు సంబంధించిన ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


అభివృద్ధి పథకాల అమలు కోసం బాంగ్లాదేశ్ కు 4.5 బిలియన్ యుఎస్ డాలర్ల మేర థర్డ్ లైన్ ఆఫ్ క్రెడిట్ కు (ఎల్ఒసి కి) సంబంధించిన ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

బాంగ్లాదేశ్ ప్రధాని 2017 ఏప్రిల్ లో భారతదేశంలో పర్యటించిన సందర్భంలో ఈ ఎమ్ఒయు పైన సంతకాలయ్యాయి.

ఈ ఎమ్ఒయు బాంగ్లాదేశ్ లో అవస్థాపన అభివృద్ధికి, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం కావడానికి, భారతదేశం మరియు బాంగ్లాదేశ్ ల మధ్య అనుసంధానం మెరుగవడానికి తోడ్పడుతుంది. తద్వారా మన దేశంలోని ఈశాన్య ప్రాంతానికి చేరుకొనే అవకాశాలు కూడా పెంపొందుతాయి. అంతే కాక, బాంగ్లాదేశ్ లో భారతదేశ కంపెనీలకు కొత్త వ్యాపారావకాశాలు అందివస్తాయి.

బాంగ్లాదేశ్ కు రాయితీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందించే వ్యవస్థ కారణంగా భారతదేశం మరియు బాంగ్లాదేశ్ ల మధ్య అభివృద్ధి సంబంధ సహకారం తో పాటు ద్వైపాక్షిక సంబంధాలు కూడా బలపడతాయి.

రాయితీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందించే వ్యవస్థలో భాగంగా చేపట్టే పథకాల జాబితాను ఎమ్ఒయు విశదీకరిస్తుంది. ఇది భారతదేశం ప్రయోజనాలు ముడిపడిన పథకాలను ఈ ఎల్ఒసి లో భాగంగా చేపట్టే అవకాశాన్ని ప్రసాదిస్తుంది.

చేపట్టే పథకాలలో కొన్ని పథకాలు భారతదేశంలోని ఈశాన్య ప్రాంతానికి ప్రధాన భూభాగంతోను, బయటి ప్రపంచంతోను మెరుగైన మరియు వేగవంతమైన అనుసంధానాన్ని కల్పించడంపైన దృష్టి సారిస్తాయి. అవి భారతదేశ భద్రతకు పూచీపడతాయి. దానితో పాటే భారతదేశ కంపెనీలకు వ్యాపారావకాశాలను కూడా కల్పిస్తాయి.