Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అమర్ నాథ్ యాత్రికులపై జమ్ము & కశ్మీర్ లో జరిగిన దాడిని ఖండించిన ప్రధాన మంత్రి; జమ్ము & కశ్మీర్ గవర్నరు తోను, ముఖ్యమంత్రితోను సంభాషించి, సాధ్యమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చిన ప్రధాన మంత్రి


అమర్ నాథ్ యాత్రికులపై జమ్ము & కశ్మీర్ లో జరిగిన దాడిని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రధాన మంత్రి జమ్ము & కశ్మీర్ గవర్నరు శ్రీ ఎన్.ఎన్. వోహ్రా తో, ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి తో కూడా సంభాషించారు. సాధ్యమైన అన్ని విధాల సహాయాన్ని అందిస్తాంటూ ప్రధాన మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

‘‘పిరికితనంతో కూడిన ఇటువంటి దాడుల వల్ల మరియు ద్వేషం వల్ల భారతదేశం ఎన్నటికీ కూరుకుపోదు.

జమ్ము & కశ్మీర్ లో జరిగిన దాడిలో ప్రాణాలు ఆప్తులను కోల్పోయిన వారి దు:ఖంలో నేను పాలుపంచుకొంటున్నాను. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలిగాక.

శాంతియుతంగా సాగుతున్న అమర్ నాథ్ యాత్రికులపై జమ్ము & కశ్మీర్ లో జరిగిన పిరికి పంద దాడి కారణంగా మాటలకు అందనంత వేదనకు లోనయ్యాను. ప్రతి ఒక్కరు అత్యంత తీవ్రంగా ఖండించదగినటువంటి దాడి ఇది.

నేను జమ్ము & కశ్మీర్ గవర్నరు తోను, ముఖ్యమంత్రితోను మాట్లాడి, సాధ్యమైన అన్ని రకాలుగానూ అవసరమైన సహాయాన్ని అందిస్తామని వారికి హామీ ఇచ్చాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.