Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అయోధ్య లోక్రొత్త గా నిర్మించిన శ్రీ రామ జన్మభూమి మందిర్ లో శ్రీ రామ్ లలా యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

అయోధ్య లోక్రొత్త గా నిర్మించిన శ్రీ రామ జన్మభూమి మందిర్ లో శ్రీ రామ్ లలా యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి


ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య లో క్రొత్త గా నిర్మించిన శ్రీ రామ్ జన్మభూమి మందిర్ లో ఈ రోజు న జరిగినటువంటి శ్రీ రామ్ లలా యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. శ్రీ రామ జన్మభూమి మందిరం నిర్మాణం లో తోడ్పాటు ను అందించిన శ్రమ జీవుల తో శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, వేల సంవత్సరాల అనంతరం ఎట్టకేలకు మన రాముడు విచ్చేశాడు అంటూ భావాతిశయం తో పలికారు. ‘‘శతాబ్దాల తరబడి పట్టిన ఓరిమి, లెక్క లేనన్ని త్యాగాలు, తపస్సు ల అనంతరం మన ప్రభువు రాముల వారు ఇక్కడ కు విచ్చేశారు.’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్తూ ఈ సందర్భం లో పౌరుల కు అభినందనల ను వ్యక్తం చేశారు. గర్భ గుడి లోపల దైవీయ చేతనత్వాన్ని అనుభూతి చెందాలే తప్ప దానిని మాటల లో వెల్లడి చేయలేం అని ప్రధాన మంత్రి అంటూ, తన దేహం లో శక్తి ప్రసారం అయిందని, తన మనస్సు ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి క్షణానికి సమర్పితం అయిందన్నారు. ‘‘మన రామ్ లలా ఇక మీదట గుడారం లో ఉండబోరు. ఈ దివ్యమైన మందిరం ఇప్పుడు ఆయన కు నివాసం అవుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న సంభవించిన పరిణామాల తాలూకు భక్తి శ్రద్ధల ను శం అంతటా మరియు ప్రపంచ వ్యాప్తం గా రామ భక్తులు వారి యొక్క అనుభవం లోకి తెచ్చుకొని ఉండి ఉంటారన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ‘‘ఈ ఘట్టం ప్రకృతి కి అతీతమైంది, పవిత్రమైందీనూ. ఇక్కడి వాతావరణం, పరిసరాలు మరియు శక్తి ప్రభువు రాముని యొక్క దీవెన లు మన కు దక్కాయి అని చెబుతున్నాయి’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 22 వ తేదీ నాటి వేకువ తో సూర్యుడు ఒక నూతన ప్రకాశాన్ని తీసుకు వచ్చినట్లు ఆయన స్పష్టంచేశారు. ‘‘2024వ సంవత్సరం లో జనవరి 22 వ తేదీ కేలండరు లో ఒక తేదీ ఎంతమాత్రం కాదు, అది ఒక నూతన కాల చక్రం యొక్క పుట్టక అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. రాం జన్మభూమి దేవాలయం యొక్క భూమి పూజ కార్యక్రమం జరిగిన నాటి నుండి యావత్తు దేశం లో ఒక ఆనందోత్సవం తాలూకు భావన నిరంతరం గా వర్ధిల్లుతూ వచ్చిందని, ఆలయ రూపకల్పన పనులు పౌరుల లో ఒక క్రొత్త శక్తి ని నింపాయని ఆయన ఉద్ఘాటించారు. ‘‘ఈ రోజు న, మనం శతాబ్దుల సహనం తాలూకు వారసత్వాన్ని అందుకొన్నాం, ఈ రోజు న మనం శ్రీ రాముని ఆలయాన్ని ప్రాప్తింపచేసుకొన్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. బానిస మనస్తత్వం యొక్క సంకెళ్ల ను దేశ ప్రజలు ఛేదించుకొన్నారు మరి గతం తాలూకు అనుభవాల నుండి ప్రేరణ ను పొందారు ఆ దేశ ప్రజలు చరిత్ర ను లిఖిస్తారు అని ఆయన అన్నారు. నేటి తేదీ ని ఇప్పటి నుండి ఒక వేయి సంతవ్సరాల తరువాత చర్చించుకోవడం జరుగుతుంది, ఇంకా ప్రభువు రాముని యొక్క ఆశీస్సుల తో మనం ఈ యొక్క మహత్తరమైనటువంటి సందర్భం తనంతట తాను వెలుగు లోకి రావడాన్ని చూస్తున్నాం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘రోజులు, దిక్కులు, నింగి, ఇంకా ప్రతిదీ ఇవాళ దివ్యత్వం తో పొంగి పొరలుతున్నది అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ఇది ఏదో సాధారణమైన కాల ఖండం కాదని, కాలం లో ముద్ర ను వేస్తున్నటువంటి చెరపరాని జ్ఞాపక పథం అని ఆయన పేర్కొన్నారు.

 

 

ప్రతి ఒక్క శ్రీ రామ కార్యం లో శ్రీ హనుమాన్ యొక్క ఉనికి ఉంటుందని ప్రధాన మంత్రి చెప్తూ, శ్రీ హనుమాన్ కు మరియు హనుమాన్ గఢీ కి ప్రణమిల్లారు. లక్ష్మణ స్వామి కి, భరతుని కి, శత్రుఘ్నుని కి మరియు సీతా మాత కు కూడా ఆయన ప్రణామాలను ఆచరించారు. ఈ కార్యక్రమాని కి దైవీయ శక్తులు తరలివచ్చాయి అని ఆయన అన్నారు. ఈ రోజు ను అనుభూతించడం లో జరిగిన జాప్యానికి గాను ప్రభువు శ్రీ రాముడి ని ప్రధాన మంత్రి క్షమాపణ లు వేడుకొన్నారు. ఆ యొక్క శూన్యం భర్తీ అయినందువల్ల తప్పక శ్రీ రాముడు మనల పై దయచూపుతాడు అని అని ఆయన అన్నారు.