Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అసెట్ రికవరీపై గ్లోబల్ ఫోకల్ పాయింట్ సదస్సులో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం

అసెట్ రికవరీపై గ్లోబల్ ఫోకల్ పాయింట్ సదస్సులో భారత  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం

అసెట్ రికవరీపై గ్లోబల్ ఫోకల్ పాయింట్ సదస్సులో భారత  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం

అసెట్ రికవరీపై గ్లోబల్ ఫోకల్ పాయింట్ సదస్సులో భారత  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం

అసెట్ రికవరీపై గ్లోబల్ ఫోకల్ పాయింట్ సదస్సులో భారత  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం

అసెట్ రికవరీపై గ్లోబల్ ఫోకల్ పాయింట్ సదస్సులో భారత  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం

అసెట్ రికవరీపై గ్లోబల్ ఫోకల్ పాయింట్ సదస్సులో భారత  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం

అసెట్ రికవరీపై గ్లోబల్ ఫోకల్ పాయింట్ సదస్సులో భారత  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం

అసెట్ రికవరీపై గ్లోబల్ ఫోకల్ పాయింట్ సదస్సులో భారత  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం

అసెట్ రికవరీపై గ్లోబల్ ఫోకల్ పాయింట్ సదస్సులో భారత  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం

అసెట్ రికవరీపై గ్లోబల్ ఫోకల్ పాయింట్ సదస్సులో భారత  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం


ఇంటర్పోల్ సెక్రటరీ జనరల్ జుర్గెన్ స్టాక్

నా మంత్రివర్గ సహచరుడు డాక్టర్ జితేంద్ర సింగ్

వేదికపై ఆసీనులైన ప్రముఖులు

సోదర సోదరీమణులారా

అసెట్ రికవరీపై ఆరవ గ్లోబల్ ఫోకల్ పాయింట్ సదస్సు, సిబిఐ, రాష్ర్టాల అవినీతి నిరోధక బ్యూరోల వార్షిక సదస్సులకు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించడం నాకు ఆనందంగా ఉంది. ఈ సదస్సులకు హాజరైన విదేశీ ప్రతినిధులందరికీ హార్దిక స్వాగతం పలుకుతున్నాను. మీ భారత పర్యటన ఆనందమయం, చిరస్మరణీయం కావాలని ఆశిస్తున్నాను.

విశిష్ట సేవలకు గుర్తింపుగా పతకాలు పొందిన సిబిఐ అధికారులందరికీ నా హార్దిక శుభాకాంక్షలు.

సోదర సోదరీమణులారా

ప్రపంచంలోని ప్రభుత్వాలన్నీ పేదలు, నిరాదరణకు గురవుతున్న వర్గాల జీవితాల్లో పరివర్తన తీసుకురావడానికి కృషి చేయాల్సి ఉంది. ఈ లక్ష్యసాధనకు అవినీతి పెద్ద

అవరోధంగా ఉంది.

భారత్లో మేం ప్రస్తుతం జాతి నిర్మాణ ప్రయత్నంలో ఉన్నాం. సుసంపన్నమైన భారత్ నిర్మాణం మా లక్ష్యం. ఆ భారత్లో

– మా రైతన్నలు సమర్థులు కావాలి

– మా కార్మిక సోదరులు పూర్తి సంతృప్తితో ఉండాలి

– మా మహిళలు సాధికారత పొందాలి.

– మా యువత స్వయం సమృద్ధంగా నిలవాలి.

ఇది అసాధ్యమైన లక్ష్యం ఏమీ కాదు. కాని ఈ లక్ష్యాన్ని సాధించాలి. అవినీతిపై నిరంతర పోరాటం చేయాలి. అవినీతి వ్యతిరేక పోరాటం విషయంలో భారత్ పూర్తి కట్టుబాటుతో ఉంది.

నా ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే అవినీతి నిర్మూలనకు, నల్లధనం మహమ్మారిని అదుపులోకి తేవడానికి ఎంతో విశేషమైన కృషి చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు మేం అధికారం చేపట్టిన తొలి రోజే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాం. నల్లధనాన్ని అదుపు చేసేందుకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు ఇచ్చి పుచ్చుకునేందుకు వివిధ దేశాలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం.

విదేశీ ఖాతాల పన్ను కట్టుబాటు చట్టంపై అమెరికాతో ప్రభుత్వాల మధ్య సహకారానికి ఒప్పందంపై సంతకాలు చేశాం. భారతీయుల విదేశీ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆటోమేటిక్గా అందుకునేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది.

అలాగే నల్లధనం విదేశాలకు తరలిపోవడాన్ని నిలువరించేందుకు అప్రకటిత విదేశీ ఆదాయాలు, ఆస్తులు మరియు పన్ను విధింపు చట్టం రూపొందించాం. పన్ను ఎగవేతదారులకు భారీ పెనాల్టీలు వేసేందుకు, ప్రాసిక్యూట్ చేసేందుకు ఈ ఒప్పందం సహాయకారిగా ఉంటుంది.

భారతీయుల విదేశీ అప్రకటిత ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం ప్రవేశపెట్టాం. దీని వల్ల వివిధ కంపెనీలు ప్రవేశపెట్టే నకిలీ పోంజి స్కీమ్లలో కష్టపడి సంపాదించిన సొమ్మును ఇన్వెస్ట్ చేసిన వారు కొంత మొత్తం అయినా పరిహారంగా పొందేందుకు అవకాశం కలుగుతుంది.

అలాగే స్టోలెన్ అసెట్ రికవరీ ఇనీషియేటివ్ (ఎస్టిఏఆర్), ఇంటర్పోల్ మధ్య సహకార ఒప్పందం వల్ల దొంగ ఆస్తుల రికవరీకి అవకాశం ఏర్పడుతుందని నేను ఆశిస్తున్నాను. అవినీతితో కూడబెట్టిన ఆస్తులను పన్ను స్వర్గధామ దేశాలకు (ట్యాక్స్ హ్వేన్స్) తరలించడాన్ని నిరోధించేందుకు, నేరపూరితమైన ఆస్తులు రికవరీ చేసుకునేందుకు కావలసిన సమాచారం మార్పిడి చేసుకునేందుకు అవసరమైన వేదిక ఈ సదస్సు కల్పిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

బొగ్గు గనులు, ఎఫ్ఎం స్పెక్ర్టం వేలం వంటి చర్యలు వ్యవస్థాత్మకమైన అవినీతికి అడ్డుకట్ట పడడంతో పాటు ఎంతో విలువైన జాతీయ వనరులు వివక్షాపూర్వకంగా కేటాయించే ధోరణులను నిలువరించడానికి సహాయపడింది. వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడానికి, ప్రభుత్వంపై పౌరులకు విశ్వాస పునరుద్ధరణకు కూడా ఇది దోహదపడింది. ఈ చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయాలు సమకూరాయి. ఈ వనరులు ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడతాయి.

సోదర సోదరీమణులారా

మేం వ్యవస్థాత్మకమైన, విధానపూరితమైన పరిపాలన అందించడంపై దృష్టి సారించాం. సునిశితమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పరిపాలన అది. తేలికపాటి సాంకేతిక పరిజ్ఞానం, విధానపరమైన చర్యల ద్వారా ఎలాంటి హడావుడి లేకుండా అవినీతిని ఎంత సమర్థవంతంగా నిర్మూలించవచ్చుననడానికి ఒక అనుభవం మీతో పంచుకుంటాను.

మేం అధికారం చేపట్టిన సమయంలో వంటగ్యాస్ సిలిండర్ ఒక్కోదానిపై సుమారు 400 రూపాయల మేరకు సబ్సిడీ ఇస్తున్నట్టు నాకు తెలిసింది. సంపన్నులకు, పేదలకు కూడా సమానంగా ఈ సబ్సిడీ అందుతోంది. ఆధార్తో అనుసంధానమైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ఈ సబ్సిడీని జమ చేయాలని మేం నిర్ణయించాం. ఈ ఒక్క చొరవ వల్ల గ్యాస్ సబ్సిడీని క్లయిమ్ చేసుకుంటున్న వినియోగదారుల ఖాతాల సంఖ్య 50 మిలియన్లు తగ్గింది. ఆర్థికంగా శక్తివంతులైన వారు గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలంటూ ఆ తర్వాత ఒక ప్రచార కార్యక్రమం చేపట్టాం. దానికి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికి 4.5 మిలియన్ మందికి పైగా గ్యాస్ సబ్సిడీ వదులుకున్నారు.

మిత్రులారా

పరిపాలనాపరమైన లోటుపాట్లు తొలగించడం మన ముందున్న పెద్ద సవాలు.

– ప్రజాసేవలు సమర్థవంతంగాను, ప్రభావవంతంగాను అందించగలిగే సామర్థ్యాల లోటు

– ముందున్న సమస్యలను పరిష్కరించేందుకు విధానపరమైన మద్దతు లేకపోవడం
– ప్రాజెక్టుల అమలులో జాప్యాలు
ఇందులో ఉన్నాయి.

అధికార యంత్రాంగం మరింత బాధ్యతాయుతంగాను, సమర్థవంతమైన పనితీరు అందించేదిగాను తయారుచేసేందుకు మా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ప్రభుత్వోద్యోగులకు రక్షణ కల్పించేందుకు, ఉద్దేశపూర్వకమైన ఆరోపణల నుంచి వారిని రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అవినీతిపరులను శిక్షించే విషయంలో కూడా అంతే దృఢమైన కట్టుబాటు కలిగి ఉంది. ఉద్యోగంలో సమర్థత లోపించినందుకు వివిధ సర్వీసులకు చెందిన 45 మంది సీనియర్ అధికారులకు ఇప్పటివరకు పింఛన్లలో కోత విధించాం.

సోదర సోదరీమణులారా

వ్యవస్థీకృత నేరాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలకు ముప్పుగా పరిణమించింది. దీని వల్ల పెట్టుబడులు, ఆర్థిక వృద్ధి స్తంభించిపోతాయి. ఆర్థిక రంగంలోని ప్రధాన రంగాలన్నింటికీ అవినీతి మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. అక్రమ మార్గాల్లో నిధుల కల్పన వల్ల మాదక ద్రవ్యాల/ మానవుల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటి నేరాలు విస్తరిస్తాయి.

కొద్ది రోజుల క్రితం పారిస్లో జరిగిన పాశవికమైన దాడులు ఉగ్రవాదులు వారి కార్యకలాపాల విస్తరణకు అవసరమైన నిధులు తేలిగ్గా అందుకోగులుగుతున్నారనేందుకు సజీవ సాక్ష్యం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, బ్యాంకు దోపిడీలు, వాహనాల చోరీ, నకిలీ కరెన్సీ, ఇతర ప్రభుత్వ ప్రేరేపిత కార్యకలాపాల ద్వారా వారికి నిధులు అందుతున్నాయి.

ఇలాంటి నిధులను నిలువరించినట్టయితే ఉగ్రవాదుల సామర్థ్యాలు తగ్గుతాయి. దాడులు చేసే వారి సమర్థతకు అడ్డుకట్ట పడుతుంది. వ్యవస్థాత్మకమైన రక్షణలు కల్పించడం, విశ్వసనీయమైన ఉగ్రవాద నిరోధక గూఢచర్య సమాచారం ఆధారంగా ఆర్థిక ఆంక్షలు విధించడం ఇలాంటి కార్యకలాపాలు నిలువరించేందుకు చక్కని మార్గం.

నేరపూరితమైన చర్యలను నిలువరించేందుకు కృషి చేయడం ఈ పోరాటంలో ప్రధానాంశం. నేరాలు, అవినీతి, ఉగ్రవాద చర్యలపై పోరాటంలో అసెట్ రికవరీకి సంబంధించి అంతర్జాతీయ సహకారం విస్తరించుకోవడం అత్యంత ప్రధానం.

నేరస్థుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ఒక శిక్షగా ఉపయోగపడుతుంది. నేరపూరితమైన చర్యలను నిరుత్సాహపరుస్తుంది. అక్రమార్జనను స్వాధీనం చేసుకోవడం అవినీతి అధికారులకు సరైన శిక్ష అని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో సూచించాడు.

అవినీతి ద్వారా ఆర్జించిన అక్రమ సంపాదనను ట్రాక్ చేసే విధివిధానాలపై రాష్ర్టాల అవినీతి నిరోధక శాఖలు, సిబిఐ ఉన్నతాధికారులు చర్చిస్తారని నేను ఆశిస్తున్నాను. రెండు దశాబ్దాల చరిత్ర గల ఈ వేదిక నేరస్థులను ప్రాసిక్యూట్ చేసే చర్యల పైనే కాకుండా అవినీతి మార్గాల ద్వారా ఆర్జించిన అక్రమ సంపాదన స్వాధీనం చేసుకునేందుకు ప్రమాణాత్మకమైన నిర్వహణ విధానాలను మరింత పదును పెట్టడంపై దృష్టి సారిస్తుందని ఆశిస్తున్నాను.

సోదర సోదరీమణులారా

నేరస్థులు అక్రమ మార్గాల్లో ఆర్జించిన సొమ్మును ప్రపంచంలో ఎక్కడైనా దాచుకునే అవకాశాన్ని ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణలు అందుబాటులోకి తెచ్చాయి. సెకన్ల వ్యవధిలోనే ఇలాంటి నిధులు డజన్ల కొద్దీ దేశాల సరిహద్దులు దాటిపోతున్నాయి. ఇలా చేయడం వల్ల వారు దర్యాప్తును తప్పించుకోగలుగుతున్నారు. దర్యాప్తు సంస్థలు జాతీయ హద్దులకు పరిమితమైపోతున్నాయి. ఇలాంటి అక్రమ సంపదకు సంబంధించిన సమాచారం ఆటోమేటిక్గా ఇచ్చిపుచ్చుకునేందుకు అందరికీ వర్తించే అంతర్జాతీయ ప్రమాణాలు అమలుపరిచేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. విదేశాల్లోని ఆర్థిక కేందాలలోను, పన్ను స్వర్గధామాల్లోను అక్రమ సంపదను దాచిన వారికి సంబంధించిన సమాచారం తేలిగ్గా ఇచ్చిపుచ్చుకునేందుకు ఇది సహాయపడుతుంది.

ఆస్తుల రికవరీలో ఇంటర్పోల్ కీలక పాత్ర నానాటికీ పెరుగుతోంది. చట్టాలను అమలుపరిచే సంస్థలు, అవినీతి నిర్మూలన కోసం కృషి చేస్తున్న సంస్థలు అవినీతి కార్యకలాపాలకు సంబంధించిన గణాంకాలు, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో 2009 నుంచి గ్లోబల్ ఫోకల్ పాయింట్ ఫోరమ్ చురుగ్గా పని చేస్తోంది. అవినీతిపరులకు సంబంధించిన సునిశితమైన సమాచారాన్ని వెబ్ ఆధారంగా అందించుకునేందుకు ఇంటర్పోల్ తీసుకున్న ఐ-సెకామ్ చొరవను ఈ సందర్భంగా ప్రస్తావించాల్సి ఉంది. కొత్త ఇంటర్పోల్ నోటీసు సంక్లిష్టమైన కేసుల్లో ఇలాంటి సమాచారం వాస్తవికంగా అందించుకునేందుకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటర్పోల్ భాగస్వాములు-ప్రపంచబ్యాంకు, యుఎన్ఓడిసి- రెండింటినీ నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.

ఇంటర్పోల్కు, భారత దర్యాప్తు సంస్థలకు మధ్య అద్భుతమైన సహకారం వల్ల అజ్ఞాతంలోని ఎందరో నేరస్థులు పట్టుబడేందుకు, వారిని భారత్కు తిరిగి తీసుకువచ్చేందుకు సహాయకారి అయిందని నాకు తెలిసింది. ఈ సహకారం మరింత లోతుగా పాతుకుపోవాలని నేను ఆశిస్తున్నాను. దర్యాప్తు సమాచారం మార్పిడికి గల అవరోధాలు అధిగమించడంలో భారత దర్యాప్తు సంస్థలు, విదేశీ భాగస్వాములకు సిబిఐ సమర్థవంతంగా సహకరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చట్ట సంస్థల మధ్య సహకారాన్ని విస్తరింపచేసుకునేందుకు ఇంటర్పోల్కు చెందిన సాధనాలు, గణాంకాలను సిబిఐ చక్కగా ఉపయోగించుకుంటున్నట్టు కూడా నా దృష్టికి వచ్చింది. సామర్థ్య నిర్మాణ కార్యకలాపాల్లో కూడా ఇంటర్పోల్తో సిబిఐ భాగస్వామి అవుతోంది.

మేం ఘజియాబాద్లో ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం. సైబర్ నేరాలతో సహా వివిధ రకాల నేరాలను నిలువరించేందుకు అవసరమైన అర్హతల సాధనకు సర్టిఫైడ్ కోర్సులను ఈ సంస్థ అందిస్తుంది. కొత్త తరానికి చెందిన సైబర్ నేరాలపై పోరాటానికి ఒక కేంద్రీయ టెక్నాలజీ విభాగం ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది.

ఫోరెన్సిక్ నిపుణుల అభిప్రాయంతో ఎన్నో సంక్లిష్టమైన కేసులు పరిష్కరించిన చరిత్ర భారత న్యాయవ్యవస్థకు ఉంది. ఫోరెన్సిక్ అభిప్రాయంతో పరిష్కరించగల ఎన్నో పెండింగ్ కేసులు ప్రస్తుతం భారత్ ముందున్నాయి.

నేరాలు, అవినీతి ద్వారా ఆర్జించిన సంపద చోరీ సొత్తు. ఏ దేశంలో అయితే ఆ సొత్తు దాచి ఉందో ఆ సొత్తు ఆ దేశానికి చెందదు. ఏ దేశం నుంచి వస్తే ఆ దేశానికి చెందిన పౌరుల న్యాయబద్ధమైన సంపద అది. దొంగసొత్తు రికవరీకి గల విధానపరమైన అవరోధాలు, ఆధారాలకు సంబంధించిన లోటుపాట్లు నాకు బాగా తెలుసు. ఈ అవరోధాలను అధిగమించేందుకు పోలీసులు, చట్టాలను అమలుపరిచే సంస్థలు లాంఛనప్రాయమైన, ఐచ్ఛికమైన బంధాలను ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి అవకాశం ఈ సదస్సు మీ అందరికీ కల్పిస్తుందని నేను ఆశిస్తున్నాను. దొంగసొత్తును పసిగట్టి, గుర్తించి, నిలువరించి, స్వాధీనం చేసుకుని, ఆయా దేశాలకు తిప్పి పంపేందుకు అనుసరించాల్సిన మార్గాలపై ప్రతినిధులు గట్టిగా చర్చిస్తారని నేను ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు

జైహింద్