పిఎంఇండియా
ముందు గా, మనం మన యొక్క మొబైల్ ఫోన్ లలో టార్చిలైటు ను వెలిగించడం ద్వారా మన సాహసిక జవానుల కు వందనాన్ని ఆచరిద్దాం. నాతో పాటు గొంతు కలపవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఇవి మన మాతృదేశం కోసం చేస్తున్నటువంటి నినాదాలు.
మన సాహసిక దేశం కోసం – భారత మాతా నీకు జయము కలుగుగాక.
మన విజయవంతమైన దేశం కోసం – భారత మాతా నీకు జయము కలుగుగాక.
మన సాహసిక జవానుల కోసం – భారత మాతా నీకు జయము కలుగుగాక.
మీ అందరికీ ధన్యవాదాలు.
ప్రియమైన నా సోదరీమణులు మరియు సోదరులారా,
ఈ రోజు న మీకు ఎన్నో విషయాలను చెప్పాలని నాకు అనిపిస్తోంది. అహమదాబాద్ యొక్క అభివృద్ధి పరం గా ఈ రోజు మన అందరి కీ ఒక చరిత్రాత్మకమైనటువంటి దినం. కొద్ది సేపటి క్రితం అహమదాబాద్ మెట్రో యొక్క తొలి దశ ను ప్రారంభించడమైంది. అలాగే, రెండో దశ కు శంకుస్థాపన చేయడం జరిగింది. గుజరాత్ యొక్క మరియు భారతదేశం యొక్క సంక్షేమాని కి అంకితం అయినటువంటి ఒక సంపూర్ణమైన పథకం ఇది. గుజరాత్ లో జీవన పరిస్థితుల ను మెరుగు పరచగలిగిన ఈ పథకాల ప్రారంభ వేళ లో మీ అందరి ని నేను అభినందించాలనుకొంటున్నాను.
మిత్రులారా,
మనం చాలా కాలం గా కంటున్న కల నెరవేరింది. ఇక్కడ కు రావడం కోసం నేను అహమదాబాద్ మెట్రో లో ప్రయాణించాను. ప్రజల తో కలసి ప్రయాణిస్తూ వుండగా, వారి లోని ఆనందోత్సాహాల ను నేను కూడా అనుభూతి చెందాను. నా హృదయం సంతోషం తో నిండిపోయింది.
చాలా మంది వారి సొంత మెట్రో కు స్వాగతం పలకడం కోసం- ఏ విధం గా అయితే ‘ఉత్తరాయణ’ కాలం లో గాలి పటాల ను ఎగురవేయడం కోసం వారు గుమికూడుతారో- అలాగ వారి యొక్క మిద్దెల మీద నిలబడ్డారు. నా ప్రయాణం సాగినంత మేరా మిద్దెలు అన్నీ జనం తో నిండిపోవడాన్ని నేను చూడగలిగాను. అహమదాబాద్ ప్రజల యొక్క పెద్ద స్వప్నమొకటి వాస్తవ రూపాన్ని దాల్చింది.
మిత్రులారా,
ఇప్పటికే మెట్రో యొక్క ఒకటో దశ ఆరంభమైంది. రెండో దశ కు పునాది రాయి ని వేయడమైంది. ఒకటో పని ముగిసిందో లేదో మనం రెండో దశ పనుల ను మొదలు పెట్టుకొన్నాము. ఇదీ మా ప్రభుత్వం యొక్క ప్రయోజనం. మేము మా కార్యసాధన ల అనంతరం విశ్రాంతి ని తీసుకోము; చేతి లో ఉన్నటువంటి తదుపరి పథకం కోసం మేము సన్నద్ధం అవుతాము. నేను ఈ మాటల ను ఒకే అర్థం తో అంటున్నాను, కాంగ్రెస్ కు మల్లే కాదు (చిరునవ్వులు చిందిస్తూ). ఈ పథకం 10,000 కోట్ల రూపాయల కన్నా అధిక విలువ ను కలిగినటువంటింది.
ఇది ఇక్కడి అహమదాబాద్ కు చెందిన లక్షల మంది కి ఎంతో ప్రయోజనకారి కానుంది. మరి ఇది ఇక్కడి జీవన శైలి లో ఒక మార్పు ను తీసుకు వస్తుంది. పాఠశాలల కు, కళాశాలల కు వెళ్ళే వారి, కార్యాలయాల కు వెళ్ళే వారి మరియు నవ పారిశ్రామికుల సంఖ్య ఎంత ఉంటుందో ఊహించండి. వారంతా ఇక్కట్టుల బారి నుండి బయటపడతారు. చాలా కాలం ఆదా కావడం తో పాటు, వాహన రాకపోకల కు సంబంధించిన సమస్య లు సైతం తీరుతాయి. ఇది ఒక పరిశుభ్ర పర్యావరణాని కి కూడా పూచీ పడుతుంది. మరి మీరు మా యొక్క ధ్యేయాన్ని ఎరుగుదురు – అది ‘మేము ఒక పథకాని కి శంకుస్థాపన చేశామంటే ఆ పథకాన్ని మేము తప్పక పూర్తి చేస్తాము అనేదే’. దీని కి అర్థం ఈ రోజు న మెట్రో కు వేసిన పునాది రాయి 3, 4 లేదా 5 సంవత్సరాల లో ఎప్పుడు పూర్తి అయినా, నేను ప్రారంభోత్సవాని కి హాజరు అవుతాను. ఇది అంతా మీ దీవెన ల కారణం గా సాధ్యమువుతుంది.
మిత్రులారా,
మా ప్రభుత్వపు పారదర్శకత్వాన్ని గురించి నేను చెప్పబోయే ఉదాహరణ మాదిరిగా మరి ఏదీ వెల్లడించబోదు. 2014వ సంవత్సరం వరకు అక్కడ కేవలం 250 కిలో మీటర్ల పొడవైన మెట్రో నెట్ వర్క్ ఉంది. నేను ప్రస్తుతం నడుస్తున్న మెట్రో నెట్ వర్క్ ను గురించి చెప్తున్నాను. ఇది 650 కి. మీ. మేర సాగుతుంది. ఇదంతా కూడాను 55 మాసాల వ్యవధి లో సంభవించింది.
దీనికి తోడు, ప్రస్తుతం సుమారు 800 కి.మీ. మెట్రో నెట్ వర్క్ మార్గాల తాలూకు పనులు జరుగుతున్నాయి. రాబోయే సంవత్సరం లో పట్టణ రవాణా గొప్ప మార్పుల కు లోనవుతుంది.
మిత్రులారా,
కొద్దిసేపటి క్రితం నేను ‘‘కామన్ మొబిలిటీ కార్డ్’’ సదుపాయాన్ని ఆరంభించి, మరి దాని ని దేశాని కి అంకితమిచ్చాను. ఇది ఒక్క అహమదాబాద్ కు మరియు గుజరాత్ కు లబ్ధి ని చేకూర్చడమే కాదు యావత్తు దేశాని కి కూడా లబ్ధి ని చేకూర్చుతుంది. ఈ కార్యక్రమం యొక్క పరిధి ని తెలుసుకొంటే మీరు సంతోషిస్తారు. ఇది ‘రూపే కార్డు’ ఉపయోగం ద్వారా సమకూరుతుంది. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇది ఉపయోగకారి గా రుజువు అవుతుంది. దేశవ్యాప్తం గా ప్రజలు బస్సు లేదా లోకల్ రైలు లేదా మెట్రో వంటి వివిధ రవాణా సాధనాల ను ఉపయోగిస్తారు. మరి వారు వేరు వేరు చోట్ల టోల్ గేట్, పార్కింగ్ తదితర సౌకర్యాల కోసం చెల్లింపులు జరపవలసి ఉంటుంది. మామూలు గా ప్రజలు వారి పర్సు నో, లేక డబ్బునో వెంట తీసుకు వెళ్తారు. మరి ఆయా చోట్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో మీకు ఎరుకే. ఎంతో కాలం వృథా అవుతూ ఉంటుంది.
ఈ ఇబ్బందుల ను అధిగమించడం కోసం మేము ఒక ‘ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్’ను అభివృద్ధిపరచాము. ఈ వ్యవస్థ ను అమలు చేయడం లోని సవాలు ఏదీ అంటే మనము సంబంధిత సాంకేతిక విజ్ఞానాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసివుంటుంది. అక్కడ చాలా కంపెనీ ల ప్రమేయం ఉండటం తో ఒక ఏకీకృత వ్యవస్థ ను మేము సృష్టించ లేకపోయాము. కాబట్టి, కార్డు ఒక ఫలానా నగరం కోసమే పని కి వస్తే మరొక నగరం కోసం అది ఉపయోగపడకపోవచ్చు. దీని నుండి బయట పడటానికి ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పరచింది. ఈ విషయం లో సంపూర్ణ స్థాయి లో కృషి చేయడం కూడా మొదలుపెట్టింది. మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు ఈ పని లో నిమగ్నం అయ్యాయి. బ్యాంకులు సైతం ఇందులో పాల్గొన్నాయి. వాటి కి ఒకే ఒక్క కార్యభారాన్ని అప్పగించడమైంది. అది అనేక కార్డులు అవసరపడకుండా ఒక వ్యవస్థ ను- దేనితో అయితే పలు కార్డుల అవసరం తలెత్తకుండా , డిజిటల్ లావాదేవీలు సాఫీగా సాగుతాయో- అటువంటి వ్యవస్థ ను అభివృద్ధి పరచడం అనే పని.
బహుళ ప్రయత్నాల అనంతరం, ఈ ‘ఒక దేశం – ఒక కార్డు’ అనే కల పండుతున్నది. ఈ ‘కామన్ మొబిలిటీ కార్డు’తో మీరు డబ్బు ను విత్ డ్రా చేసుకొని, ఇంకా శాపింగ్ చేయవచ్చు. అలాగే దీని ని దేశం అంతటా వివిధ రవాణా సాధనాల కు మీరు ఉపయోగించగలుగుతారు. సరళం గా చెప్పాలంటే, మీ యొక్క ‘రూపే కార్డు’ను ‘మొబిలిటీ కార్డు’తో మేళవించడం జరుగుతోంది.
ఈ కార్యసిద్ధి తో విదేశీ సాంకేతిక పరిజ్ఞానం పై మనం ఆధారపడవలసి రావడం అంతం అయింది. ప్రస్తుతం ఇది ‘‘మేడ్ ఇన్ ఇండియా’’గా నిలచింది. ఇక భారతదేశ రవాణా లో ‘ఒక దేశం – ఒకే కార్డు’ వ్యవస్థ ను అమలు పరచనున్న వేళ్ల మీద లెక్కపెట్టగల కొన్ని దేశాల జాబితా లో తాను కూడా చేరిపోయింది. ఈ సాంకేతికత మన దేశం లో రూపుదిద్దుకోవడం పట్ల యువత లోని ప్రతి ఒక్క ప్రతినిధి గర్విస్తారు. దీనంతటికీ గాను మిమ్మల్ని నేను అభినందించదలచాను. మెట్రో రైలు పెట్టెలు ఇక్కడి సావ్‌లీ, వడోదరా లలో తయారు కావడం, అలాగే ఇవి ప్రస్తుతం ఎగుమతి అవడం కూడా గుజరాత్ కు గర్వకారకమైనటువంటి అంశం.
నేను రవాణా రంగాన్ని పటిష్టపరచడం కోసం.. ఒక రైలు బయలుదేరేందుకు పచ్చ జెండా ను ఊపుతూ వుండటాన్ని మీరు చూసేవుంటారు. ఈ రోజు న ‘పాటన్- భీల్‌డీ’ నూతన రైలు మార్గం ప్రారంభాని కి నోచుకొంది. ‘ఆణంద్ – గోధ్ రా’ రైలు మార్గం కోసం డబుల్ ట్రాక్ రైల్వే ను నిర్మించడానికి శంకుస్థాపన చేయడమైంది. ఈ పాటన్-భీల్‌డీ రైలు మార్గాన్ని గురించి ప్రతి ఒక్క ఎంపీ ప్రస్తావిస్తూ ఉండటాన్ని నేను ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుండి వింటూ వచ్చాను. మొదటి సారి ఈ పని పూర్తి అయింది. మీరే చెప్పండి ఇదివరకు ఎలా ఉండేదో పరిస్థితి? అప్పటికీ, ఇప్పటికీ మధ్య ఎంత కాలం గడచిపోయిందో మీ ఊహ కు అందుతుంది.
మిత్రులారా,
ఇప్పటి కి రెండు దశాబ్దాల క్రితం గుజరాత్ ఎటువంటి పరిస్థితి లో ఉన్నదీ అనేది నేటి నూతన తరానికి బహుశా తెలిసివుండదు. అనేక ప్రాంతాలు నీటి కోసం వేచి వేచి వేసారిపోయేవి. ప్రజలు వైద్య చికిత్స ల కోసం ఒక చోటు నుండి మరొక చోటు కు పోవలసి వచ్చేది. 24 గంటలు విద్యుత్తు ఉండటం అనేది ఒక కల అన్న మాటే. జీవన పరిస్థితులు ఎంత కఠినం గా ఉండేవి అంటే ప్రజల కు వలస పోక తప్పేది కాదు. ఆదివాసీల గురించి అయితే, ఎవ్వరూ పట్టించుకోనే లేదు. ఇవాళ, గుజరాత్ లోని ప్రతి ఒక్కరి కృషి ప్రస్తుత ప్రపంచం లో దీని కి ఉన్న స్థానాని కి దారి తీసింది. మీరంతా కలసి గుజరాత్ పట్ల ప్రపంచం యొక్క దృష్టి కోణాన్ని మార్చివేశారు.
సోదరీమణులు మరియు సోదరులారా,
గుజరాత్ యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం మనం అందరం రాష్ట్ర స్థాయి లో మరియు కేంద్రం స్థాయి లో కృషి చేస్తున్నాము. గడచిన 55 నెలల్లో గుజరాత్ లోని అందరి, అంటే.. ఉమర్ గాఁవ్ నుండి అంబాజీ వరకు, అంటే రాష్ట్రం లోని తూర్పు సరిహద్దు; ఆదివాసీ బాహుళ్యం నివసించేటటువంటి ప్రాంతమైన ఉమర్ గాఁవ్ నుండి జాఖోర్, అంటే మన సముద్ర తీరపు కోస్తా ప్రాంతం, ఇంకా ఆబూ నుండి దహానూ వరకు, రాజస్థాన్ నుండి మహారాష్ట్ర దాకా ఈ మన గుజరాత్ యొక్క యావత్తు మధ్య ప్రాంతం, అంటే కేంద్రీయ గుజరాత్ యొక్క ఆవశ్యకతల ను దృష్టి లో పెట్టుకొంటూ అభివృద్ధి తాలూకు అనేక పనుల ను ప్రణాళికాబద్ధ రీతి లో ఆరంభించడమైంది.
తూర్పు ప్రాంతం లోని ఆదివాసీలు, పశ్చిమ ప్రాంతం లోని మత్స్యకార కుటుంబాలు, మరి అలాగే అహమదాబాద్-బడౌదా-పాలన్ పుర్-వాప్తీ-తాప్తీ. ఈ మార్గం అంతా కూడాను, మనం గనుక ఉమర్‌గాఁవ్- అంబాజీ మార్గాన్ని పరిశీలించినట్లయితే మేము ఆదివాసీల అభివృద్ధి పట్ల శ్రద్ధ వహించాము. అన్ని పల్లెల లో అన్ని రకాల వాతావరణాని కి అనుకూలంగా ఉండేటటువంటి సంధానాన్ని ఏర్పరచడమైంది. అలాగే 2800 కోట్ల రూపాయల విలువైన నీటి సరఫరా కార్యక్రమం తాలూకు పనులు ప్రస్తుతం నడుస్తున్నాయి.
నర్మద జలాలపై ఆధారపడ్డ దాహోద్-ఛోటా ఉదయ్ పుర్ నీటి సరఫరా పథకం కావచ్చు, నర్మద ఇంకా తాపీ జిల్లా కోసం త్రాగునీటి పథకం కావచ్చు, మయ్ సాగర్ జిల్లా కోసం కడానా ఆనకట్ట పై ఆధారపడ్డ నీటి సరఫరా పథకం కావచ్చు, అదేవిధంగా సంఖేడా – పావీజీత్ పుర్ ప్రాంతీయ నీటి సరఫరా పథకం కావచ్చు.. వీటి తాలూకు ప్రయోజనాలు ఉమర్‌గాఁవ్ నుండి అంబాజీ ప్రాంతం వరకు లక్షలాది ప్రజల కు అందుతున్నాయి. ఈ క్షేత్రం లో పాడి పరిశ్రమ ను ప్రోత్సహించే ప్రయాస కూడా సాగుతోంది. సాబర్‌కాంఠా లో ఇజ్రాయల్ సహకారం తో ఆధునిక వ్యవసాయ మెళకువల కేంద్రాన్ని అభివృద్ధి పరచే పని కూడా సాగుతోంది.
మిత్రులారా,
ప్రభుత్వం చేసిన ప్రయత్నాల తో మేము ఆదివాసీ ప్రజానీకం లో ‘సికల్ సెల్ ఎనీమియా’ను గుర్తించడం కోసం స్క్రీనింగ్ జరిగింది. దీని తో ఆదివాసీ లు సవాళ్ళు అన్నింటి ని ఒక మెరుగైన రీతి లో ఎదుర్కోవడానికి తోడ్పాటు లభించింది. ఆదివాసీ బాలల విద్య పట్ల కూడా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోంది. ఏ ఆదివాసీ ప్రాంతం లో గాని, లేదా తహసీల్ లో గాని పన్నెండో తరగతి విజ్ఞాన శాస్త్ర పాఠశాల ఒక్కటైనా లేదన్న సంగతి తెలిస్తే మీరు కలత చెందుతారు. ప్రస్తుతం ఒక వైద్య కళాశాల నిర్మాణ దశ లో ఉంది. అలాగే, అక్కడ అనేక విశ్వవిద్యాలయాల ను కూడా నిర్మించడం జరుగుతోంది. సంకల్ప శక్తి తో పనుల ను ఎలా పూర్తి చేయవచ్చో చాటడం లో గుజరాత్ ఒక అధ్యయన బిందువు వంటిదే.
‘వన బంధు కళ్యాణ్ యోజన’ సహాయం తో మేము అనేక ఆదర్శ ఆవాసీయ పాఠశాల లు, ఆశ్రమ పాఠశాల లు, ఏకలవ్య పాఠశాల ల వంటి వాటి ని అభివృద్ధి చేయగలిగాం. 1100 లకు పైగా వసతి గృహాలను సైతం నిర్మించడం జరిగింది. వీటి ప్రయోజనాలు 2 లక్షల కు పైగా ఆదివాసీ బాలల కు లభిస్తున్నాయి. అంతే కాదు, నర్మద జిల్లా లో 300 కోట్ల రూపాయల వ్యయం తో బిర్సా ముండా ఆదివాసీ విశ్వవిద్యాలయాన్ని నిర్మించడమైంది. ప్రభుత్వం ద్వారా ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతుల ను కూడా నిర్వహించడం జరుగుతోంది. ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రత్యేకించినటువంటి మెడికల్ సీట్లు ఖాళీ గా ఉండిపోయేవి. అయితే, ఇప్పడు దాదాపుగా అవన్నీ నిండిపోతున్నాయి.
దాహోద్- పాలన్ పుర్ లో నిర్మించిన వైద్య కళాశాల ఆ ప్రాంతం లో వైద్య సౌకర్యాల ను కూడా అభివృద్ధి పరచింది. దాహోద్ రైల్వే వర్క్‌శాపు ను ప్రస్తుతం విస్తరించే పనులు సాగుతున్నాయి. మీరు టివి లో చూసే ఉంటారు.. మన జస్వంత్ జీ భాబోర్ అక్కడ రైల్వే యార్డు లో ఉండటాన్ని, నేను రిమోట్ కంట్రోల్ సహాయం తో దాని ని ప్రారంభిస్తూ ఉన్న దృశ్యాల ను. దాహోద్ లో పరెల్ అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ గల రైల్వేల సదుపాయం పనిపాటు లేకుండా ఖాళీ గా ఉండేవి. దాదాపు 30-40 సంవత్సరాల క్రితం ఆ అడవుల లో నేను పని చేసే వాడిని.
దాని ని మేము ఇప్పుడు మరొక్కమారు పని చేసేటట్టు చూశాము. ఆ వర్క్ శాపు సామర్ధ్యాన్ని నాలుగు రెట్లు పెంచడమైంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. ఇంతవరకు ఒక సంవత్సరం లో కేవలం 450 సరకు రవాణా రైలు బోగీ లు మరమ్మత్తు కు నోచుకొనేవి. ఈ సంఖ్య ను 1800 బోగీల కు పెంచడమైంది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఏ మేరకు పెరుగుతాయో మీరు అంచనా వేయగలుగుతారు.
ప్రభుత్వం పర్యటన రంగం పైన కూడా శ్రద్ధ తీసుకొంటోంది. కేవడియా లో ‘స్టాచూ ఆఫ్ యూనిటీ’ ని నిర్మించడమైంది. ఇది ప్రపంచం లో అతి ఎత్తయినటువంటి విగ్రహం గా ఉంది. ‘స్టాచూ ఆఫ్ లిబర్టీ’ ఎత్తు కు ఇది రెండింతలు. దీని ని సందర్శించాలని దేశవ్యాప్తం గా ప్రజలు ఎంతటి ఉత్సాహం తో ఉన్నారో మీకు తెలుసును. అంబాజీ లో అనేక అభివృద్ధి పనులు పురోగమనం లో ఉన్నాయి. రాజ్‌పిప్ లా లో ప్రస్తుతం ఒక ఆదివాసీ మ్యూజియమ్ రూపుదిద్దుకొంటోంది.
సోదరీమణులు మరియు సోదరులారా,
మన స్వాతంత్య్ర ఉద్యమ కాలం లో త్యాగాలు చేసిన ఆదివాసీల కు వారి కి లభించవలసినటువంటి గౌరవాన్ని, మరియు గుర్తింపు ను ఇవ్వడం జరుగలేదు. ఆదివాసీ మ్యూజియమ్ మన స్వాతంత్య్ర పోరాటం లో ఆదివాసీ ల పాత్ర ను కళ్ళ కు కడుతుంది.
మిత్రులారా,
గుజరాత్ కు ఉన్న ‘సముద్ర సంబంధిత శక్తి’ సుపరిచితమే. ఉమర్ గాఁవ్ నుండి కచ్ఛ్ వరకు విస్తరించిన సువిశాలమైన కోస్తా తీరం మన దేశం లో అతి పెద్దది. ఇది గుజరాత్ లో ఒక భాగం. దీని ని అభివృద్ధి పరచడం కోసం అనేక పథకాలు రూపుదిద్దుకొంటున్నాయి. గోగా నుండి దహేజ్ మధ్య రో రో ఫెరీ సర్వీసు ను నడపడం వల్ల ప్రజల కు రాక పోక లు జరపడం సులువు అయింది. మరి వారి కి కాలం, ధనం ఆదా అవుతున్నాయి కూడా.
సౌరాష్ట్ర నర్మద అవతరణ్ ఇరిగేషన్ (ఎస్ఎయుఎన్ఐ.. ‘సౌని’) యోజన సహాయం తో అనేక నీటిపారుదల మరియు త్రాగునీటి పథకాలు ఇక్కడి జల సమస్య ను పరిష్కరించి వేశాయి. ప్రభుత్వం సముద్ర జలం నుండి పరిశుద్ధ జలాన్ని తీసుకు వచ్చే పథకాల పై కృషి చేస్తోంది. జోడియా తో సహా మరో ఆరు ప్రాంతాల లో డిస్టిలేషన్ పనులు ప్రారంభం అవుతున్నాయి. కోస్తా ప్రాంతం లో సంధానాన్ని పెంచేందుకు ‘సాగర్‌మాల యోజన’ లో భాగం గా ఒక్క గుజరాత్ లోనే 75,000 కోట్ల రూపాయల కు పైగా విలువైన పథకాలు ఆమోదింపబడ్డాయి. ద్వారక లో ప్రభుత్వం ఒక మరీన్ పోలీస్ అకాడమీ ని ఏర్పాటు చేసింది.
సోదరీమణులు మరియు సోదరులారా,
21వ శతాబ్దం లో చోటుచేసుకొన్న పురోగతి కి తోడు మేము మన వారసత్వాన్ని పదిలపరచేందుకు కూడా చర్యలు తీసుకొంటున్నాము. దాండీ లో కొన్ని వారాల క్రితం గాంధీ గారి ‘సత్యాగ్రహ’ స్మారకాన్ని ప్రారంభించే అవకాశం దక్కినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని అని చెప్పాలి. ఈ రోజు నిజం గా ప్రత్యేకమైనటువంటి మరియు ప్రధానమైనటువంటి ఒక పని కి శంకుస్థాపన చేయడమైంది. ఇది ప్రపంచం యొక్క దృష్టి ని మన వైపున కు ఆకర్షిస్తుంది.
ఇక్కడి లోథల్ లో 500 సంవత్సరాల నాటి నౌకాశ్రయం ఉంది. ఇది ప్రపంచం లోనే అతి పురాతనమైనటువంటి నౌకాశ్రయం. ఇంతటి విశిష్టమైనటువంటి ప్రదేశం మరొకటి ఈ భూ ప్రపంచం లోనే లేదు.
ఇప్పుడు, ప్రభుత్వం లో ఒక భాగం గా నేను ఇక చిన్న పని ని చేసే అవకాశం దక్కించుకున్నాను. అది ఏమిటంటే, లోథల్ లో ‘నేశనల్ మేరీటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్’కు పునాది రాయి ని వేయడం. భారతదేశ సముద్ర సంబంధ శక్తి ని నిరూపించే ఒక చరిత్రాత్మక మ్యూజియాన్ని నిర్మించడం జరుగుతోంది. మనకు సముద్ర జీవితం తో 5000 ఏళ్ళ నుండి సంబంధం ఉంది మరి. ఇది లోథల్ లో గ్లోబల్ టూరిజమ్ కు నాంది పలుకుతుంది. ఎన్నో ఉపాధి అవకాశాలు కూడా సృష్టింపబడతాయి.
మిత్రులారా,
మన సముద్ర సంబంధ ప్రావీణ్యాని కి లోథల్ ఒక దారి దీపం గా ఉంది. దీని కి సమీపంలో వెలసిన ‘వల్లభీ’ అనే పురాతన విశ్వవిద్యాలయం మొదలు, వేరు వేరు దేశాల విద్యార్థుల ను తన వైపునకు తిప్పుకొనేది. ఒక నౌకాశ్రయం ఎన్నెన్ని విధాలు గా కార్యకలాపాల ను నిర్వహిస్తుందో, మరి అక్కడ వ్యాపారం ఎలా జరుగుతుందో ఈ విద్యార్థులు అధ్యయనం చేసే వారు. అక్కడ వేరు వేరు దేశాల కు చెందిన అనేక పతాకాలు రెప రెపలాడిన కాలం అంటూ ఒకటి ఉండేదని చరిత్ర చెబుతుంది. ఆ స్థితిగతుల ను ‘నేశనల్ మేరీటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్’ మరొక్కమారు మన సమక్షం లో నిలుపుతుంది. నేను ఈ రోజున దీని కి శంకుస్థాపన చేశాను. మరి మీ అందరి ఆశీస్సుల తో దీని ని నేను ప్రారంభిస్తానని నమ్ముతున్నాను.
‘నేశనల్ మేరీటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్’లో భారతదేశం యొక్క సుసంపన్నమైన సముద్ర సంబంధి వారసత్వాన్ని ప్రపంచాని కి ప్రదర్శించడం కోసం మ్యూజియమ్ లు, థీమ్ పార్కులు, ఒక పరిశోధక కేంద్రం, హోటళ్ళు, ఇంకా రిసోర్టులు కొలువుదీరనున్నాయి. ఇది కూడా అనేక ఉపాధి అవకాశాల ను కల్పించనుంది. ఇది మన విశిష్ట వారసత్వాన్ని భారతదేశాని కి మరియు ప్రపంచాని కి పరిచయం చేస్తుంది.
మిత్రులారా,
మా ప్రభుత్వం ద్వారా నేను ఏదైతే మధ్య గుజరాత్ అని అనే వాడినో, ఒకటి పూర్వ పట్టీ, ఒకటి పశ్చిమ పట్టీ మరొకటి పూర్తి రాజస్తాన్ ఇంకా మహారాష్ట్ర ను కలిపే మన మధ్య ప్రాంతం దేనినైతే మనం సెంట్రల్ విస్టా అనవచ్చు. ఈ మధ్య భాగం యొక్క అభివృద్ధి తాలూకు అవసరాలను దృష్టి లో పెట్టుకొని అనేక పథకాలపై పని జరుగుతోంది. వాటి లో అహమదాబాద్ ను మరియు ముంబయి ని కలిపే ఒక బులెట్ ట్రేన్ యొక్క పని వేగం గా సాగుతున్నది. ఈ రైలు గుజరాత్ కు ఒక కొత్త గుర్తింపు ను ఇస్తుంది. భారతదేశం యొక్క గౌరవాన్ని కూడా ఇనుమడింప చేస్తుంది. ఇక్కడి యువ నవ పారిశ్రామికుల కు ముంబయి తో సంధానాన్ని ఇది మరింత సులభం చేస్తుంది.
ఈ రోజు న అహమదాబాద్ లో మెట్రో పరుగులు తీయడాన్ని మనం చూశాము. మధ్య గుజరాత్ తాలూకు ఉద్యోగులు దీని ద్వారా లాభపడనున్నారు. సాణంద్ ను ఒక ‘ఆటో మొబైల్ హబ్’గా తీర్చిదిద్దే పనులు సాగుతూ ఉన్నాయి. ధోలేరా ను ఒక ‘వరల్డ్ క్లాస్ కమర్షియల్ హబ్’గా అభివృద్ధి పరచడం జరుగుతోంది. ఇప్పటికే, ఒక విమానాశ్రయం ఉంది. మరొక విమానాశ్రయం రాజ్ కోట్ లో నిర్మాణాధీనం లో ఉంది.
సోదరీమణులు మరియు సోదరులారా,
మధ్య గుజరాత్ యొక్క నీటి అవసరాల ను దృష్టి లో పెట్టుకొని, నర్మద ఆనకట్ట ను ఉపయోగం లోకి తీసుకొని రావడమైంది. మరి అలాగే, సంబంధిత సేద్యపు నీటి పారుదల పథకాల పైన శ్రద్ధ వహించడం జరుగుతోంది. ‘సుజలాం-సుఫలాం’ పథకం ద్వారా బోలెడన్ని ప్రాజెక్టు లు ఉపయోగం లోకి రాబోతున్నాయి. నర్మద జలాల కు సంబంధించిన ఈ పథకం ద్వారా ఉత్తర గుజరాత్ మరియు మధ్య గుజరాత్ లబ్ధి ని పొందుతున్నాయి.
మిత్రులారా,
ఈ రోజు మరొక ముఖ్యమైన కారణం రీత్యా నాకు ప్రత్యేకమైనటువంటిది మెడ్-సిటీ ని విస్తరించే పనులు జరుగుతున్నాయి. మరి అన్ని విధాలైన ఆరోగ్య సదుపాయాల ను ఒకే కప్పు కిందకు తీసుకు వచ్చే స్వప్నం నేడు సాకారమైంది. ఇక్కడ ఒకే సారి నాలుగు ఆసుపత్రుల ను ప్రారంభించడమైంది. ఒక ప్రత్యేకమైన మాతా శిశు సంరక్షణ వైద్యశాల, ఒక కేన్సర్ వైద్య శాల, నేత్ర మరియు దంత వైద్య శాలలు.. మీకు సేవలు అందించడం కోసం సిద్ధం గా ఉన్నాయి.
మిత్రులారా,
దశాబ్దాల నాటి ‘సివిల్ హాస్పిటల్’ ను ఒక ‘మెడ్-సిటీ’ గా మార్చే ప్రాజెక్టు 2008వ సంవత్సరం మొదలైంది. ఒక దశాబ్ద కాలం లోపల దేశం లో కెల్లా అతి పెద్దదైనటువంటి స్వాస్థ్య సంరక్షణ సదుపాయం మెడ్-సిటీ సేవల కు సిద్ధం అయింది అని ప్రకటించడాని కి నేను ఎంతో ఆనందిస్తున్నాను. దీని యొక్క పరిమాణం చూసి ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 10000 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు, పారా మెడికల్ స్టాఫ్, క్రీడా సిబ్బంది తో కూడిన ఒక ప్రాంగణం ఇక్కడ ఒక్క రోజు లో 10000 మంది రోగుల కు చికిత్స ను అందించనున్నారు.
అంటే ఇది 20000 మంది జనాభాతో కూడిన ఒక చిన్న గ్రామం గా ఇది మారిపోతుందని మీరు ఊహించవచ్చు. పడకల సంఖ్య ను ప్రస్తుతం 5500కు పెంచడమైంది. దీని ని మరింత గా పెంచే యోచన కూడా ఉంది. ప్రస్తుతం నిర్మాణాధీనం లో ఉన్న ఆసుపత్రులు కూడా త్వరలోనే సిద్ధం అవుతాయని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
ప్రజల ఆరోగ్యానికి మా ప్రభుత్వాని కి ఎప్పటికీ ప్రాథమ్యాన్ని కట్టబెడుతోంది.
ఇవాళ ఉదయం పూట నేను జామ్ నగర్ లో ఉన్నాను, అక్కడ కూడా 700 పడకల తో కూడిన ఒక వైద్య శాల ను ఆరంభించడమైంది. అది ఉత్తరం కావచ్చు లేదా తూర్పు కావచ్చు లేదా పశ్చిమం లేదా దక్షిణం కావచ్చు. భారతదేశం ఆరోగ్య రంగం లో పురోగతిని అందుకొంటోంది. దేశం లో మొత్తం మీద 22 ఎఐఐఎంఎస్ లు ఉన్నాయి. కొన్ని ఇప్పటికే పని చేస్తుండ గా, మరికొన్ని నిర్మాణ దశ లో ఉన్నాయి.
వీటి లో 15 ఎఐఐఎమ్ఎస్ లలో పనులు కేవలం గత 5 సంవత్సరాల లో జరిగాయి. చిన్న ప్రదేశాలు మరియు సుదూర ప్రాంతాల కు సైతం ఆరోగ్య సదుపాయాల ను సమకూర్చాలన్నది మా లక్ష్యం. అందుకని మేము వెల్‌నెస్ సెంటర్స్ మొదలుకొని వైద్య కళాశాల ల వరకు వివిధ సంస్థల వలయాన్ని ఏర్పాటు చేశాము.
మిత్రులారా,
పేదలు మరియు దిగువ మధ్యతరగతి ప్రజానీకాన్ని వారి భాగ్యపు భరోసా కు వదలివేసిన కాలం అంటూ ఒకటి ఉండేది. వారికి సహాయం గా ఉండేందుకు తగినన్ని వైద్యశాలలు గాని, పథకాలు గాని లేవు. డబ్బు లేనందువల్ల కోట్ల మంది పేద ప్రజలు వైద్య శాలల లోకి అడుగు పెట్టలేకపోయే వారు. ‘ఆయుష్మాన్ భారత్’ మరియు ‘పిఎం -జెఎవై పథకం’ రావడం తో చాలా మంది లాభపడుతున్నారు. కొంత మంది దీని ని ‘మోదీ-కేర్’ అని కూడా పిలుస్తున్నారు.
ఆ లబ్ధిదారుల తో నేను భేటీ అవుతూ ఉంటాను. వారి తో మాట్లాడుతూ ఉంటాను. ఈ పథకం వారి కి నిజం గా ఒక వరం వంటిది గా ఉంది.
మిత్రులారా,
ఈ పథకం ఆరంభమై అయిదు నెలలు కన్నా కొద్ది కాలమే అయింది. అయితే, ఇప్పటికే దీని ద్వారా 14 లక్షల మంది పేదలు లబ్ధి ని పొందారు. పేదల లో కెల్లా పేదలైన వారు సైతం ఉత్తమమైన చికిత్స ను పొందుతున్నారు. ఇది ఎలా సాధ్యపడింది? దీని ని సాధ్యపడేటట్లు చేసింది మీరు. 2014వ సంవత్సరం లో ఒక బలమైన ప్రభుత్వాని కి మీరు వోటు వేయడం ద్వారా సరి అయిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రతి ఒక్కరి కి లబ్ధి ని చేకూర్చుతోంది.
సోదరీమణులు మరియు సోదరులారా,
మన దేశ రాజకీయాల లో మా ప్రభుత్వం మౌలికమైన మార్పుల ను తీసుకు వచ్చింది. అతి పెద్దదైన మరియు అతి దృఢమైన నిర్ణయాల ను తీసుకోవలసి వచ్చినప్పుడైనా సరే మేము వెనుకంజ వేయబోము. అవినీతి తో లేదా ఉగ్రవాదం తో పోరాడాల్సి వస్తే మా వైఖరి ఏమిటన్నది మీరు చూస్తారు.
ఈ సివిల్ హాస్పిటల్ లో ఏదైతే ప్రాణాన్ని పోస్తుందో.. ఏం జరిగిందనేది మన యొక్క జ్ఞాపకాల ను ఒకసారి మనం నెమరువేసుకున్నామా అంటే గనుక ఇది బాంబు పేలుళ్ళ కు మౌన సాక్షి గా ఉంది అని గుర్తకువస్తుంది. ఆ సందర్భం లో ఎన్నో ప్రాణాలు పోయాయి. మీకు జ్ఞాపకం ఉందా? సరిహద్దు లో ఉగ్రవాదుల దాడులు జరుగుతూ ఉండేవి. దీని కి చెల్లు చేయవలసిన బాధ్యత అప్పుడు అధికారం లో ఉన్న వారి ది కాదా?
సోదరీమణులు మరియు సోదరులారా,
నా మనస్సు లో ఇటువంటివి అన్నీ నిండి వున్నాయి. మరి ‘పుల్‌వామా’ అనంతరం నేను బహిరంగం గా అన్నాను ఏమనంటే నా దేశవాసుల కు మల్లేనే నేను కూడా హృదయం గాయపడిన వ్యక్తి ని అయ్యాను అని. అప్పటి ప్రభుత్వాని కి శక్తి ఉండి వుంటే, వారు సరిహద్దులు దాటి ఉగ్రవాదుల పీచం అణచి ఉండే వారు.
ముంబయి లో 26/11 ఘటన దరిమిలా ఎంతో మంది అమాయకులు హతులయ్యారు. కొద్ది రోజుల లో ప్రతి ఒక్కరూ దాని సంగతి మరచిపోయారు. మీరు నాకు చెప్పండి, మనం ఉగ్రవాదం తో పోరాడుదామా?, వద్దా? దాని ని వేళ్ళ నుండి పెకలించవద్దా?, పెకలించకూడదా? దీని ని ఎవరు చేస్తారని మీ ఉద్దేశం? నిజాయితీ గా చెప్పండి? మేము ఒక పక్క చెడు చేసే వారి ని శిక్షిస్తాము. మరి అలాగే, నిజాయతీ తో శ్రమించే వారి ని గౌరవించి, సమ్మానిస్తాము. నేను ఇక్కడ కు వచ్చినప్పుడు ఆ సంఘటన తాలూకు సన్నివేశాల ను మరువజాలను. చెడు చేసేటటువంటి ఆ వ్యక్తుల ను శిక్షించకుండా నేను వదలివేయను. కొద్ది మంది ఈ విధం గా చేయకపోవడం దురదృష్టకరం. ఈ రాజకీయ వాదుల మాటల ను పాకిస్తాన్ యొక్క పార్లమెంటు లో, వార్తా పత్రికల లో చర్చించుకోవడం జరుగుతున్నది.
ఇది దేశ ప్రజల యొక్క సద్భావన ఇదేనా? పాకిస్తాన్ మెచ్చుకొనే అంశాల ను మీరు పలుకుతారా? మన సైన్యం ఒక సాహస కార్యాన్ని సాధించింది. ఇటువంటి విషయాల లో నేను దీర్ఘకాలం పాటు నిరీక్షించబోను. దెబ్బ కు దెబ్బ తీయడం నా స్వభావం లో ఇమిడిపోయివుంది. మన అమాయక ప్రజల ప్రాణాల ను ఎంతవరకని మనం ఆహుతి చేస్తాం?. మిత్రులారా, మీరే నాకు చెప్పండి.. మీరు మన సైన్యాన్ని నమ్ముతున్నారా? వారి మాటలపై మీకు నమ్మకం ఉందా? వారి ని నేను నమ్మాలా, లేక నమ్మవద్దా? కొంత మంది ఉన్నారు, వారు మన సైన్యం మాటల ను పట్టించుకోరు.
మన సైన్యాన్ని ఎవరూ వేలెత్తి చూపకూడదు. వారు వారి ప్రాణాల ను పణం పెట్టి మన కోసం పోరాడారు. మరి గెలిచారు. ఈ విషయం లో కొంత మంది ఎందుకని వారి నిద్ర ను భంగం చేసుకొంటారు? ఒక ఉదాహరణే తీసుకుంటే, మన సైన్యం విఫలం అయింది అని అనుకొందాం. ప్రతిపక్షం ఎవరిని తప్పు పడుతుంది? ఇప్పుడు మన సైన్యం గెలిచింది. దీని ని వారు రాజకీయం చేస్తున్నారు. మనం మన జవానుల ను గౌరవించ కూడదా? ఈ విషయాన్ని కొంత మంది సహించ లేకపోతున్నారు.
ఇదంతా ఎన్నికల కోసం ఆడుతున్న ఒక రాజకీయ నాటకం అని కొందరు అంటున్నారు. మేము సర్జికల్ దాడుల కు దిగినప్పుడు, ఆ కాలం లో ఏ ఎన్నికలు లేవు. ఉగ్రవాదాని కి బుద్ధి చెప్పాలన్నది మా సిద్ధాంతం. ఏ దేశం అసహాయం గా ఉండిపోకూడదు. 40 సంవత్సరాల తరబడి ఉగ్రవాదం భారతదేశాన్ని దెబ్బ లు కొడుతూ వచ్చింది. బాంబు పేలుళ్ళ లో నిర్దోషులు చనిపోయే వారు. వోటు బ్యాంకు రాజకీయాల వైపు మొగ్గే వారు దీని ని అడ్డుకోవడానికి ఒక్క అడుగు నూ వేయలేదు. నేను రాజకీయాలు మరియు పదవుల వెంట పడే వాడి ని కాదు. నాకు నా దేశ వాసులు మరియు వారి భద్రత ఇవీ ముఖ్యం. మనం ప్రతి ఒక్క దాని నీ రాజకీయం చేయకూడదు. మీరు వివాదాన్ని ఎత్తుకోవాలనిపిస్తే నా పథకాల ను లేదా ప్రాజెక్టుల ను తీసుకోండి. మన సైన్యం ఒక వివాదాంశం కాకూడదు.
వారు తలచుకొంటే నా యొక్క పని ని వేలెత్తి చూపవచ్చు. నాకు సమస్య ఏమీ లేదు. అయితే, మన సైన్య దళాలు ఒక వివాదాంశం కాకూడదు. సోదరీమణులు మరియు సోదరులారా, నేను మరొక్కమారు చెబుతున్నాను. నేను మృత దేహాల ను, గాయపడినటువంటి వైద్యుల ను, రక్తసిక్తమైన నర్సుల ను చూసినటువంటి అదే ప్రదేశాని కి వచ్చాను. నేను దీని పై మనసు విప్పి మాట్లాడుతాను.
మిత్రులారా,
మా ప్రభుత్వం తన ప్రజల ను కాపాడుకొనేటువంటి మరియు వారి అవసరాల ను ఒక ప్రాధమ్యం గా పరిగణించేటటువంటి విధానాని కి కట్టుబడి ఉన్నది. మీరు గనుక ఈ మధ్యంతర బడ్జెటు లో చూసి ఉన్నట్లయితే, మేము మధ్య తరగతి కోసం కొన్ని గొప్ప మార్పుల ను చేపట్టాం. మేము పన్ను విధించదగిన ఆదాయం పరిమితి ని 5 లక్షల కు పెంచాము. దీనివల్ల మూడు కోట్ల మంది ప్రజలు లాభపడ్డారు.
మిత్రులారా,
గడచిన 5 సంవత్సరాల లో మేము ఒక ఆధునిక భారతదేశం దిశ గా పునాది ని వేశాము. మేము ఒక పని సంస్కృతి ని నెలకొల్పాము. దీని లో ప్రతి ఒక్కరు మన దేశం యొక్క విశాల హితం దిశ గా చిత్తశుద్ధి తో మరియు విధేయత తో కృషి చేస్తారు. ఇప్పుడు రానున్న అయిదు సంవత్సరాల లో మేము ఒక ఉన్నతమైన మరియు శక్తియుతమైన భారతదేశాన్ని ఇదే పునాదుల పై నిర్మించబోతున్నాము. మేము ఈ దిశ గా కృషి చేయడాన్ని కొనసాగిస్తాము. ఈ సదుపాయాలు మరియు ప్రాజెక్టులు పూర్తి అయిన సందర్భం లో మీ అందరి కీ హృదయ పూర్వక అభినందనల ను తెలియ జేయదలచుకున్నాను. నా పట్ల మీరు కనబరచిన ప్రేమ ద్వారా నేను సత్కరించబడ్డాను. దయ చేసి నేను ఆడిన మాటల ను మీరు కూడా పలకండి.
భారత మాతా, నీకు జయము కలుగుగాక.
భారత మాతా, నీకు జయము కలుగుగాక.
భారత మాతా, నీకు జయము కలుగుగాక.
నా మాతృభూమి కి వందనములు.
నా మాతృభూమి కి వందనములు.
నా మాతృభూమి కి వందనములు.
మీకు అనేకానేక ధన్యవాదాలు.
यहां आने से पहले मैंने अहमदाबाद मेट्रो में सफर किया।
— PMO India (@PMOIndia) March 4, 2019
उस दौरान लोगों का उत्साह और उनकी खुशी को अनुभव किया, सच में मन आनंद से भर गया।
उत्तरायन में जैसे लोग छत पर खड़े होकर पतंग उड़ाते हैं, वैसे ही आज छत पर खड़े होकर लोग अपनी मेट्रो का स्वागत कर रहे थे: PM
कुछ देर पहले मैंने कॉमन-मोबिलिटी कार्ड की सुविधा का भी शुभारंभ किया है।
— PMO India (@PMOIndia) March 4, 2019
ये कार्ड यात्रा करते समय आपकी तमाम दिक्कतों को दूर करने जा रहा है।
इस दिक्कत को दूर करने के लिए ही ऑटोमेटिक फेयर कलेक्शन सिस्टम की व्यवस्था विकसित की गई थी: PM
अलग-अलग कंपनियों द्वारा बनाए गए इस सिस्टम की वजह से देश में एक इंटीग्रेटेड व्यवस्था विकसित नहीं हो पा रही थी।
— PMO India (@PMOIndia) March 4, 2019
एक शहर का कार्ड दूसरे शहर में बेकार हो जाता था।
इस चुनौती को दूर करने के लिए एक व्यापक स्तर पर काम शुरू किया,
अनेक मंत्रालयों और विभागों को इस काम में लगाया गया: PM
तमाम प्रयासों के बाद अब देश में
— PMO India (@PMOIndia) March 4, 2019
One Nation-One Card का सपना सच होने जा रहा है।
कॉमन-मोबिलिटी कार्ड से आप पैसे भी निकाल पाएंगे, शॉपिंग कर पाएंगे और किसी भी मेट्रो या ट्रांसपोर्ट के अन्य साधन में भी वही कार्ड इस्तेमाल हो जाएगा: PM
बीते 55 महीनों में सरकार ने
— PMO India (@PMOIndia) March 4, 2019
उमर गांव से अंबाजी यानि राज्य के आदिवासी बाहुल्य इलाके,
उमरगांव से जखौ यानि राज्य के तटीय इलाके और
आबू से दहानू यानि केंद्रीय गुजरात की आवश्यकताओं को ध्यान में रखते हुए विकास के अनेक कार्य शुरू करवाए हैं और अनेक पर काम कर रही है: PM
आज लोथल में नेशनल मेरिटाइम हेरिटेज कॉम्प्लेक्स का शिलान्यास किया गया है।
— PMO India (@PMOIndia) March 4, 2019
अनेक देशों के लोग वहां अध्ययन करने के लिए पहुंचते थे कि, ये पोर्ट काम कर रहा है और इस क्षेत्र के व्यापार को बढ़ाने में मदद कर रहा है।
कहते हैं, एक समय था जब दर्जनों देशों के झंडे वहां फहराया करते थे: PM
It’s a memorable day in Ahmedabad’s history.
— Narendra Modi (@narendramodi) March 4, 2019
Our beloved Ahmedabad gets a Metro!
Inaugurated Phase-1, travelled on the metro and laid the foundation stone for Phase-2.
We want to provide convenient, and cost effective transportation in our cities. pic.twitter.com/ybJEtdsJCV
Here is how the dream of ‘One Nation, One Card’ was fulfilled today, furthering ‘Ease of Living’ for several citizens. pic.twitter.com/Aw5AV3pQvQ
— Narendra Modi (@narendramodi) March 4, 2019