పిఎంఇండియా
ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో మృతి చెందిన వారిపట్ల ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. ప్రియమైన కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అందిస్తాం“.
***