పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూరు సమీపంలోని మంగళగిరి, పశ్చిమ బెంగాల్ లోని కల్యాణి, మహారాష్ట్ర లోని నాగ్ పుర్ లలో మూడు కొత్త ఎఐఐఎమ్ఎస్ లకు మూడు డైరెక్టర్ పదవుల ఏర్పాటును ఆమోదించింది. ఈ డైరెక్టర్ లకు సవరణకు ముందు వేతన స్కేల్ రూ.80,000 (స్థిరం) {అదనంగా ఎన్ పిఎ గరిష్ఠ పరిమితి 85,000} ఉంటుంది.
1956 ఎఐఐఎమ్ఎస్ చట్టం తో పాటు సవరించిన 2012 ఎఐఐఎమ్ఎస్ (సవరణ) చట్టం ప్రకారం- ఈ సంస్థకు ఒక ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఉంటారు. అతనికి సంస్థ డైరెక్టర్ గా హోదా ఇస్తారు. అతనిని సంస్థ నియమిస్తుంది. అయితే ఆ సంస్థ మొదటి డైరక్టర్ కేంద్ర ప్రభుత్వంచే నియమించబడి ఉండాలి. ఆ డైరెక్టర్, పరిపాలన అధిపతి గానూ, సంస్థ కార్యదర్శి గానూ వ్యవహరిస్తారు. మూడు ఎఐఐఎమ్ఎస్ లు సక్రమంగా పనిచేయడంలో, పరిపాలనలో సహాయపడతారు.
అవసరమైన పద్దతులను పాటిస్తూ, ఈ ఖాళీని వెంటనే భర్తీ చేస్తారు. ఈ డైరెక్టర్ ఉద్యోగం సవరణకు ముందు వేతన స్కేలు రూ.80,000 (స్థిరం) {అదనంగా ఎన్ పిఎ గరిష్ట పరిమితి 85,000} లో ఉంటుంది. 6వ సి పి సి ప్రకారం, ప్రతి డైరెక్టర్ ఉద్యోగానికీ వార్షిక ఆర్ధిక భారం సుమారు 25 లక్షల రూపాయలుగా ఉంటుంది.
పూర్వరంగం
నాలుగు కొత్త ఎఐఐఎమ్ఎస్ లను ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ లలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి తన 2014-15 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూరు సమీపంలోని మంగళగిరి, పశ్చిమ బెంగాల్ లోని కల్యాణి, మహారాష్ట్ర లోని నాగ్ పుర్ లలో 4949 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయడానికి 2015 అక్టోబర్ 7వ తేదీన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మూడు ఎఐఐఎమ్ఎస్ లను ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్షా యోజన (పిఎమ్ఎస్ఎస్ వై) లో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు.
తక్కువ వ్యయంతో/విశ్వసనీయమైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రాంతీయ అసమానతలను తొలగించాలని, దేశంలో వైద్య విద్య నాణ్యతకు సౌకర్యాలను పెంపొందించాలనే ఉద్దేశాలతో ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్షా యోజన (పిఎమ్ఎస్ఎస్ వై) పథకాన్ని 2003 లో ప్రకటించారు. పిఎమ్ఎస్ఎస్ వై లో రెండు భాగాలుంటాయి : (i) ఎఐఐఎమ్ఎస్ తరహా సంస్థలను నెలకొల్పడం, (ii) ప్రభుత్వ వైద్య కళాశాలలు / సంస్థలను ఆధునీకరించడం. ఈ పథకం కింద భువనేశ్వర్, భోపాల్, రాయపూర్, జోధ్ పుర్, రుషికేశ్, పట్నా లలో ఎఐఐఎమ్ఎస్ లను నెలకొల్పగా, ఎఐఐఎమ్ఎస్ రాయబరేలి పని పురోగతిలో ఉంది. వీటితో పాటు, నాగ్ పుర్ (మహారాష్ట్ర) , కళ్యాణి (పశ్చిమ బెంగాల్ ), (ఆంధ్ర ప్రదేశ్) గుంటూరు లోని మంగళగిరి లలో మూడు ఎఐఐఎమ్ఎస్ లను 2015 లో మంజూరు చేశారు. భటిండా, గోరఖ్ పుర్ లలో రెండు ఎఐఐఎమ్ఎస్ లను 2016 లో మంజూరు చేశారు. 2017 లో అస్సామ్ లో మంజూరు చేశారు. నాగ్ పుర్ (మహారాష్ట్ర) , కళ్యాణి (పశ్చిమ బెంగాల్ ), గుంటూరు లోని మంగళగిరి (ఆంధ్ర ప్రదేశ్) లలో మూడు ఎఐఐఎమ్ఎస్ లు పనిచేయడానికి అవసరమైన భౌతిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి, బోధన సిబ్బందితో పాటు బోధనేతర సిబ్బంది నియామకానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోంది. మంత్రివర్గానికి అత్యవసరమైన అంతర్జాతీయ బిడ్ నిబంధన ప్రకారం ఈ మూడు ఎఐఐఎమ్ఎస్ ల డిజైన్ కన్సల్టెంట్ ను నియమించడం జరిగింది. ఈ మూడు ఎఐఐఎమ్ఎస్ లకు మాస్టర్ ప్లాన్ ను కూడా ఖరారు చేయడం జరిగింది. సవివరమైన డిజైన్ లు తయారు అవుతున్నాయి. బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది ఏర్పాటు ప్రతిపాదన వ్యయ విభాగం పరిశీలన/చర్చలలో ఉంది.