Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో పీఎం పర్యటన


ఆగస్టు 1న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటిస్తారుఆ రోజు ఉదయం సుమారు 11 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో ఉన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని పరిశీలిస్తారుఉదయం సుమారు 11.30 గంటలకు ఆయన విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారుఅలాగే భోగాపురంలో రూ.17,900 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనప్రారంభోత్సవం చేస్తారుఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారుఅనంతరం మధ్యాహ్నం 3:30కు మైసూరులోని శ్రీ రామకృష్ణ ఆశ్రమంలో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ – వివేక స్మారకాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఅలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో పీఎం

ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారుప్రభుత్వప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీపద్ధతిలో రూ.5,640 కోట్లకు పైగా వ్యయంతో ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారుఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.

ఆధునికమైననిరాటంకమైనసమర్థమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా ప్రయాణికుల టెర్మినల్ భవనాన్ని రూపొందించారుకార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచేలాభవిష్యత్తు విమానయాన అవసరాలను తీర్చేలా అధునాతన మౌలిక వసతులుఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలుపర్యావరణహిత సౌకర్యాలను విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు.

ఈ విమానాశ్రయంలో కృత్రిమ మేధ (ఏఐ), బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (బీఐఎం), ఎయిర్‌సైడ్ 4.0 సాంకేతిక పరిజ్ఞానాలుఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్స్ సెంటర్ (ఏపీవోసీ), బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్ఆటోమేటెడ్ బ్యాగేజి హ్యాండ్లింగ్ వ్యవస్థలుఇంటిలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏర్పాటు చేశారుఈ వ్యవస్థలు కార్యాచరణ సామర్థ్యాన్నీప్రయాణికుల సౌకర్యాన్నీభద్రతను మెరుగుపరుస్తాయని అంచనా వేస్తున్నారుఅలాగే వనరుల సమర్థ వినియోగానికి దోహదపడతాయని భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో అనేక పర్యావరణహిత సౌకర్యాలను ఏర్పాటు చేశారువీటిలో తక్కువ విద్యుత్తును ఉపయోగించే హీటింగ్వెంటిలేషన్ఎయిర్ కండిషనింగ్ (హెచ్‌వీఏసీవ్యవస్థలువిద్యుత్తును ఆదా చేసే లైటింగ్, 5 మెగా వాట్ల సోలార్ విద్యుత్ కేంద్రంవర్షపు నీటి నిల్వ వ్యవస్థస్మార్ట్ బిల్డింగ్ నిర్వహణ వ్యవస్థలువ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలువిద్యుత్ వాహన ఛార్జింగ్ వసతులుపర్యావరణ పర్యవేక్షణ చర్యలు ఉన్నాయిహరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ టెర్మినల్‌ను నిర్మించారుయూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్‌జీబీసీ)లో నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారుటెర్మినల్ పై కప్పు… సంప్రదాయ చుట్టిల్లు కాటేజీలనుఅరకు లోయ ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తుందిఅలాగే ఎగిరే చేప కదలికలను గుర్తు చేసేలాప్రాంతీయ నిర్మాణ శైలిఆధునిక విమానాశ్రయ డిజైన్ మేళవింపుగా దీనిని తీర్చిదిద్ధారుఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకంవాణిజ్యంపెట్టుబడులుఉపాధి కల్పనకు ఈ విమానాశ్రయం గణనీయమైన రీతిలో ప్రోత్సహిస్తుందనీఈ ప్రాంతంలో విమానయాన అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

విశాఖపట్నంలో రూ.460 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్న ఏఎస్ఐపీ సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారుదీనిని కొరియా రిపబ్లిక్‌కు చెందిన ఏపీఏసీటీ భాగస్వామ్యంతో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోందిఇది ఆంధ్రప్రదేశ్‌లో తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రందీనికి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ పరిధిలో ఆమోదం లభించిందిఈ ప్లాంట్ ఏటా సుమారు 96 మిలియన్ల సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేయడంతో పాటు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగావకాశాలను కల్పిస్తుందిఅదే సమయంలో సెమీకండక్టర్ తయారీకి తోడ్పాటు అందించేలా పటిష్టమైన అనుబంధ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.

కర్నూల్– IV రెన్యువబుల్ ఎనర్జీ జోన్ (ఆర్ఈజడ్)- ఫేజ్– I (4.5 గిగావాట్లుఏకీకరణ కోసం ఏర్పాటు చేసే సరఫరా వ్యవస్థకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారుదీనిని స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీద్వారా రూ.5,550 కోట్ల పెట్టుబడితో పవర్ గ్రిడ్ అమలు చేస్తోంది.

రూ.3,550 కోట్ల వ్యయంతో నిర్మించే కర్నూలు పవన విద్యుత్ జోన్/సౌర విద్యుత్ జోన్ (ఆంధ్రప్రదేశ్)- పార్ట్ ఏపార్ట్ బీ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఅలాగే రూ.820 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురం (2,500 మెగావాట్లు), కర్నూలు (1,000 మెగావాట్లుసౌర విద్యుత్ జోన్ల ట్రాన్స్‌మిషన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారుదీనిని పవర్ గ్రిడ్ ద్వారా అమలు చేస్తున్నారు.

ఈ సరఫరా ప్రాజెక్టులు… కర్నూలుఅనంతపురంలో ఉన్న పునరుత్పాదక ఇంధన జోన్ల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ తరలింపును సులభతరం చేస్తాయితద్వారా జాతీయ గ్రిడ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు విద్యుత్ సరఫరా చేస్తాయిఅలాగే భారీ పరిమాణంలో పునరుత్పాదక విద్యుత్తును అనుసంధానించడాన్ని కూడా సులభతరం చేస్తాయిడిమాండ్ ఉన్న ప్రాంతాలకు స్వచ్ఛ విద్యుత్‌  సరఫరాను మెరుగుపరుస్తాయిశిలాజ ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా భారతదేశ ఇంధన పరివర్తనడీకార్బనైజేషన్ ప్రయత్నాలకు తోడ్పాటునందిస్తాయి.

రూ.1,880 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారుజాతికి అంకితమిస్తారుఎన్‌హెచ్-365బీజీలో రేచర్ల నుంచి గుర్వాయిగూడెం వరకు ఉన్న సెక్షన్లో నాలుగు లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారినీఎన్‌హెచ్-365బీజీలో గుర్వాయిగూడెం నుంచి దేవరపల్లి వరకు ఉన్న సెక్షన్లో నాలుగు లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారినీఎన్‌హెచ్-67పై నాలుగు లేన్ల తాడిపత్రి బైపాస్‌నూ జాతికి అంకితమిస్తారుఎన్‌హెచ్-565లోని పెంచలకోనయేర్పేడు విభాగంలో లింగసముద్రం వద్ద హైలెవెల్ వంతెనకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారుఈ ప్రాజెక్టులన్నీ విజయవాడఇతర నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయిరోడ్డు భద్రతను పెంపొందిస్తాయివిశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ మధ్య ప్రయాణ దూరాన్నిప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయిప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందిస్తాయి.

కర్ణాటకలో పీఎం

కర్ణాటకలోని స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ –వివేక స్మారకను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభిస్తారు.

భారతదేశ  వ్యాప్తంగా చేపట్టిన పర్యటనలో భాగంగా 1892 నవంబర్‌లో స్వామి వివేకానంద మైసూరును సందర్శించారుఆ చారిత్రక సందర్భానికి గుర్తుగా వివేక స్మారకాన్ని నిర్మించారుఈ ప్రాంతంలో ఆయన బస చేసిప్రసంగాలు చేశారుపండితులుభక్తులతో సంభాషించారుఅలాగే మహారాజా శ్రీ చామరాజేంద్ర వడియార్-X ఆదరణను పొందారుఆయన అందించిన సహకారంతోనే 1893లో షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద పాల్గొన్నారు.

చరిత్రాత్మక నిరంజన మఠంలో 81,000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో వివేక స్మారక ఏర్పాటయిందిదీనిలో ఒక ప్రధాన భవనంఅనుబంధ భవనం ఉన్నాయిఇందులో 4-డీ ఎక్స్పీరియన్స్ సెంటర్ఎగ్జిబిషన్ హాల్, 700 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న యాంఫీ థియేటర్తరగతి గదులుసమావేశ గదులుగ్రంథాలయంరీడింగ్ రూంధ్యానంయోగా హాలుబుక్ స్టాల్ ఉన్నాయిపోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఈ కేంద్రంలో ఉన్నాయి.

స్వామి వివేకానంద జీవితంసందేశంఆదర్శాలకు అంకితమైన ఈ సాంస్కృతిక యువజన కేంద్రం… విలువ ఆధారిత విద్యకూనాయకత్వ అభివృద్ధికీవ్యక్తిత్వ వికాసానికీ తోడ్పడే చైతన్య కేంద్రంగా పనిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుందిదీనివల్ల సమీపంలోని విద్యాసంస్థల్లో చదువుతున్న 10,000 మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారుజాతి నిర్మాణంవ్యక్తిత్వ అభివృద్ధి దిశగా– స్వామి వివేకానంద తాత్వికత స్ఫూర్తిగా– ఇక్కడ నిర్వహించే ఉపన్యాసాలువర్కుషాపులుస్వల్పకాల వ్యవధి కోర్సులుసామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు… గ్రామీణపట్టణ ప్రాంత యువతకు ప్రయోజనం చేకూరుస్తాయి.

 

***