పిఎంఇండియా
భారత్ మాతా కీ జయ్,
భారత్ మాతా కీ జయ్,
భారత్ మాతా కీ జయ్,
ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్ గారు, ప‌్రజాదరణ పొందిన, సఫలీకృతుడైన మరియు ఉత్సాహవంతుడైన ముఖ్యమంత్రి శ్రీ ఆదిత్య యోగీరాజ్ గారు, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేశ్ శర్మ గారు, పార్లమెంటు సభ్యుడు ప్రొఫెసర్ రామ్ శంకర్ కఠరియా గారు, భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు మరియు నా పార్లమెంట్ లో నా సహచరుడు డాక్టర్ మహేంద్ర పాండే గారు, చౌధరీ బాబూలాల్ గారు, అనిల్ జైన్ గారు, వేదిక మీద ఉన్న ఇతర మహానుభావులు అందరూ మరియు ఆగ్రా లోని ప్రియమైన నా సోదరీమణులు, ఇంకా సోదరులారా,
కొత్త సంవత్సరం లో ఇది ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న ఒకటో కార్యక్రమం. ఉత్తర్ ప్రదేశ్ ప్రజలందరి కీ 2019వ సంవత్సరం సందర్భంగా ఇవే నా అనేకానేక శుభాకాంక్షలు. ‘న్యూ ఇండియా’ నిర్మాణంలో పాలుపంచుకోనున్న మీ కందరికీ నేను నమస్కరిస్తున్నాను.
మిత్రులారా,
ఆగ్రా లో మీ సమక్షాని కి వచ్చినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. నేను మీ యొక్క మద్ధతు ను కోరినప్పుడల్లా యావత్తు ఉత్తర్ ప్రదేశ్ తో పాటు పూర్తి భారతదేశం నా పైన ఆశీర్వాదాల ను కురిపించింది. మీ యొక్క ఆకాంక్షల కు తుల తూగడం కోసం నేను చిత్తశుద్ధి తో నిరంతరం కృషి చేస్తుంటాను. మీతో పాటు దేశ ప్రజలందరి కీ సేవ చేసేందుకు చిత్తశుద్ధి తో కూడిన ఈ మార్గం లో పరిపూర్ణ సమర్పణ భావం తో నడవటాన్ని నేను కొనసాగించేటట్లు గా మీ అందరి ఆశీర్వాదాలు నాకు లభించు గాక.
మీ యొక్క నమ్మకంతో మరియు సహకారం తో మా ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్’ మిశన్ మరొక మైలురాయి ని చేరుకోబోతోంది. ఆగ్రా అభివృద్ధి కి సంబంధించిన 3,500 కోట్ల రూపాయల విలువైన పథకాల ను కాసేపటి క్రితం ప్రారంభించుకోవడం ఈ దిశ గా పడినటువంటి ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పుకోవాలి.
ఈ పథకాలు- ముఖ్యం గా నీరు, విద్య, వైద్యం, మురుగునీటి శుద్ధి, ఇంకా సంధానాని కి సంబంధించినవి- ఇవన్నీ కూడాను ఆగ్రా ను ఒక స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దడం తో ముడిపడినటువంటివి. ఈ విషయం లో నేను మీ అందరినీ.. నా సోదరీమణులను మరియు నా సోదరుల ను.. అభినందిస్తున్నాను.
జపాన్ ద్వారా దీనిలో అందినటువంటి మద్ధతు కు మరియు సహకారాని కి నేను జపాన్ కు కూడాను నా హృదయాంతరాళం లో నుండి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను.
సోదరీమణులు మరియు సోదరులారా,
ఎంతో కాలం గా ఉన్నటువంటి ఈ కోరిక నేడు తీరిందని తెలిసి మీరందరూ సంతోషిస్తారు. ఆగ్రా నుండి మధుర వరకు నీటి కొరత ఒక సమస్య గా ఉండేది. భూగర్భం లోని నీరు చాలా వరకు ఉప్ప గా ఉండి, త్రాగడాని కి అనువు గా లేదు. మనుగడ ను సాధ్యం చేసిన మాత యమున యొక్క జలాలు ఎంత గా కలుషితం అయ్యాయంటే ఆ నది నీరు ఇక ఎంత మాత్రం త్రాగడాని కి వీలు లేకుండా ఉన్నాయి. ఈ కారణం గా గంగ ఎగువ కాలువ ద్వారా ఆగ్రా యొక్క దాహార్తి ని తీర్చే ఒక పథకాన్ని రూపొందించడమైంది. ఈ రోజు న దాదాపు 3 వేల కోట్ల రూపాయల వ్యయం తో కూడిన గంగా జల్ పథకాన్ని ఆగ్రా లో నీటి సరఫరా కు పూచీ పడే విధం గా మీ అందరికీ అంకితం ఇవ్వడమైంది. ఇది యావత్తు ప్రాంతం లోని లక్షలాది కుటుంబాల కు పరిశుభ్రమైన త్రాగునీటి ని తీసుకు వస్తుంది. నమామి గంగే మిశన్ లో భాగం గా యమున శుద్ధి సహితం మా ప్రాథమ్యం గా ఉన్నదన్న విషయాన్ని మీ కు నేను వెల్లడించ దలచాను.
సోదరీమణులు మరియు సోదరులారా,
ఆగ్రా లో జల సంబంధిత సమస్యల ను నివారించడం ఒక్కటే కాకుండా నగరం లోని మురుగు పారుదల వ్యవస్థ ను ఆధునికీకరించేందుకు కూడా అనేక పథకాల పైన కసరత్తు జరుగుతోంది. మరి సోదరీమణులు మరియు సోదరులారా, మీరు గంగా జలాన్ని త్రాగునీటి రూపం లో అందుకొంటున్న భాగ్యవంతులు. అయితే, ఎవరైనా పరిశుభ్రమైన త్రాగునీటి ని పొందుతున్నారంటే అటువంటప్పుడు కేవలం నీటి సమస్య తీరడమే కాదు, ఆరోగ్య సంబంధ సమస్య లు కూడా పరిష్కరింప బడుతాయి. ఇది ప్రత్యేకించి పేదల జీవితాల కు ప్రయోజనకరం గా ఉంటుంది. గంగా నది నీళ్ళు మీ ఇళ్ళ కు చేరుకొంటున్నాయి అంటే ఒక రకం గా ఇది స్వస్థత కు చక్కటి తరుణోపాయం అని చెప్పాలి. ఇదే మాదిరి గా ఆగ్రా ను సందర్శిస్తున్న యాత్రికుల కు పరిశుభ్రమైన త్రాగునీటి సౌకర్యం ఒక ఆకర్షక బిందువు గా ఉంటుందని చెప్పాలి. నగరం అందుకొంటున్న స్వచ్ఛమైన గంగా జలాన్ని ఏ యాత్రికుడైనా/ యాత్రికురాలైనా గమనించినప్పుడు, ఆగ్రా లో మరింత కాలం పాటు బస చేయాలని వారు కోరుకొంటారు. ఈ కారణం గా, దీని ని కేవలం ఒక పొడవైన గొట్టపు మార్గం నిర్మించి, దాని ద్వారా నగరాని కి నీటి ని తేవడం కోసం చేపట్టిన ఒక ఇంజినీరింగు కార్యం గా మాత్రమే చూడకూడదు. దీనిని ఒక రకం గా ఆగ్రా కు జీవ రేఖ గా, అమృత వాహిని గా ఎంచాలి. ఇది ఆగ్రా లో జీవనాని కి ఒక ఉత్తేజాన్ని అందిస్తుంది.
సోదరీమణులు మరియు సోదరులారా,
దేశ వ్యాప్తం గా అమృత్ మిశన్ (AMRUT Mission) పేరిట ఒక పథకం అమలవుతోంది. అమృత్ మిశన్ లో భాగం గా ఈ రోజు న నగరం లోని పశ్చిమ ప్రాంతం లో మురుగు నీటి కి సంబంధించిన నెట్‌వర్క్ పథకాని కి పునాదిరాయి ని వేయడమైంది. ఈ పథకం లో సుమారు 50 వేల గృహాలు మురుగునీటి గొట్టపు మార్గాని కి ముడిపడటం జరుగుతుంది.
మిత్రులారా,
స్మార్ట్ ఫెసిలిటీస్ ను అభివృద్ధి చేస్తున్నటువంటి నగరాల లో ఆగ్రా ఒక నగరం గా ఉంది. దీని కి అనుగుణం గా ఈ రోజున ఆగ్రా లో ఒక కొత్త ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ తాలూకు పనుల ను మొదలు పెట్టడమైంది. దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ పథకం సహాయం తో నగరం చుట్టు పక్కల అన్ని సౌకర్యాల ను పర్యవేక్షించడం జరుగుతుంది. ఇక్కడి నుండి 1200 కు పైగా సిసిటివి కామెరాల తో యావత్తు నగరాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది. నగరం లోని ఏ మూల న ఏమి జరుగుతున్నప్పటికీ.. అది వాహనాల రాకపోకలు స్తంభించడం కావచ్చు, లేదా రహదారి పై చెత్త కుప్పల ను వేస్తూ ఉండటం కావచ్చు, లేదా పారిశుధ్య కార్మికులు సకాలం లో విధుల కు హాజరు అయ్యారా లేదా అన్న విషయం కావచ్చు.. ప్రతిదీ సిసిటివి కామెరా ల ద్వారా పర్యవేక్షిస్తారు. సోదరీమణులు మరియు సోదరులారా, ఆగ్రా కోసం ఉద్దేశించిన సిసిటివి కామెరా నగర భద్రత కు హామీ ని ఇచ్చేటటువంటి ఒక సదుపాయం గా ఉంటుందని చెప్పాలి. దేశ విదేశాల నుండి యాత్రికులు ఈ సిసిటివి కామెరాల ను గురించి తెలుసుకొన్నారంటే గనుక వారు ఒక భరోసా ను పొంది ఊరట చెందగలుగుతారు. ఆగ్రా యావత్తు ప్రపంచం లో ప్రజల కు ఒక తీర్థ యాత్ర స్థలం గా ఆకర్షణ ను సంతరించుకొంది. గడచిన 70 సంవత్సరాల లోని రికార్డుల ను అన్నింటినీ ఆగ్రా బద్దలుకొట్టి, తద్వారా ఆర్థిక వ్యవస్థ ఒక నూతనోత్తేజాన్ని పొందగలుగుతుందని మేము ఆశిస్తున్నాము. జలము, సిసిటివి కామెరా లు, మురుగునీటి శుద్ధి ప్లాంటు లు, మరి అలాగే స్మార్ట్ సిటీ తాలూకు సదుపాయాలు వినోద పర్యటన రంగాని కి ఒక దీవెన గా ఉంటాయి. అంతేకాక సోదరీమణులు మరియు సోదరులారా, రైల్వే వంతెన, ఇంకా హెలీపోర్టుల ప్రారంభం ఆగ్రా కు సంధానాన్ని మెరుగు పరచగలుగుతాయి.
మిత్రులారా,
పరిశుభ్రత, స్వచ్ఛమైన త్రాగునీరు, ఇంకా సిసిటివి కామెరాల తో ఆగ్రా ను ఒక స్మార్ట్ సిటీ గా పునరుద్ధరించడం జరుగుతుంది. ఇది ఇక్కడి యాత్రికుల కు ప్రేరణ ను అందించేటటువంటి ఒక వాతావరణాన్ని, శక్తి ని మరియు ఒక సంతృప్తి ని ప్రసాదించగలదు. తాజ్ మహల్ వంటి మన చరిత్రాత్మక వారసత్వం యొక్క శోభ కూడా పెంపొందుతుంది. ఇది పర్యటక పరిశ్రమ పైన ప్రత్యక్ష ప్రభావాన్ని ప్రసరింప చేస్తుంది.
సోదరీమణులు మరియు సోదరులారా,
ఏ దేశం గాని లేదా ఏ నగరం గాని ఆరోగ్యవంతం గా ఉండనిదే స్మార్ట్ గా రూపుదిద్దుకో జాలదు. ఈ విషయాన్ని దృష్టి లో పెట్టుకొని కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం దేశమంతటా చౌకైన మరియు సమర్ధమైన ప్రాంతాలు ఆవిష్కారం అయ్యేటట్లు గా శ్రద్ధ ను వహించనుంది. ఆరోగ్యాని కి సంబంధించిన మౌలిక సదుపాయల ను ఇదివరకు ఎరుగని రీతి లో అభివృద్ధి పరచడం జరుగుతుంది.
ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన లో భాగం గా ఆగ్రా లోని ఎస్ఎన్ వైద్య కళాశాల ను విస్తరించడం జరుగుతుంది. ఈ ఆసుపత్రి కి 250 పడకల ను నూతనం గా జోడించడం తో పాటు సూపర్ స్పెశాలిటీ సౌకర్యాన్ని కూడా పెంపొందించడం జరుగుతుంది. అలాగే మహిళల ఆసుపత్రి లో ఒక 100 పడకల ప్రసూతి విభాగాన్ని మరియు 2 కమ్యూనిటీ సెంటర్ లను అంకితం చేసే అవకాశం కూడా నాకు దక్కింది.
మిత్రులారా,
రానున్న రోజుల లో దేశం లో ఆసుపత్రుల తో కూడిన ఒక భారీ నెట్ వర్క్ ను నిర్మించడం జరుగుతుంది. ఇది చిన్న పట్టణాలలో మరియు నగరాల లో ఆరోగ్య సంరక్షణ సేవల ను విస్తరించడం ఒక్కటే కాకుండా యువజనుల కు నూతన ఉద్యోగ అవకాశాల ను కూడా కల్పిస్తుంది. ‘ఆయుష్మాన్ భారత్’ ఆ తరహా ప్రధాన పథకాల లో ఒకటి గా ఉంది. కొంత మంది దీనిని మోదీ కేర్ అని కూడా పిలుస్తున్నారు. ప్రతి రోజూ దాదాపు 10 వేల మంది పేదలు ఈ పథకం లో భాగం గా చికిత్స ను పొందుతున్న వాస్తవాన్ని పట్టి చూస్తే ఇది సఫలం అయిందని భావించవచ్చు. మరి ఈ ప్రజలు గడచిన 4- 5 ఏళ్ళు గా వ్యాధుల బారిన పడి అవస్థల పాలైన వారే. వారు చేతి లో డబ్బు లేని కారణం గా నొప్పి ని అంతటినీ పళ్ళ బిగువున భరిస్తూ మృత్యువు రాక కై ఎదురుచూస్తూ వస్తున్నారు.
సోదరీమణులు మరియు సోదరులారా,
పేదలు ఎక్కడికని వెళతారు ? అయితే, ఎంతో మంది నిస్పృహ కు లోనైన వ్యక్తుల కు ఆయుష్మాన్ భారత్ ఒక స్వల్ప కాలం లో సహాయకారి గా నిలచింది. ఒక కుటుంబం లో ఒక వ్యక్తి అస్వస్థుడు అయితే దాని ప్రభావం యావత్తు కుటుంబం పైన వుంటుంది. పిల్లల చదువు ఆగి పోతుంది. మరి ఆ డబ్బు ను ఆహారం అవసరాల ను తీర్చుకోవడం కోసం మళ్ళిస్తారు. ఇంటి లో ప్రతి పనీ కూడాను స్తంభించి పోతుంది. ఆయుష్మాన్ భారత్ పథకం- దేనినైతే మోదీ కేర్ లని కూడా అంటున్నారో- అది ఈ ప్రజలందరినీ కాపాడింది. 100 రోజుల్లోనే 7 లక్షల మంది బీద సోదరీమణులు మరియు బీద సోదరుల కు ఆసుపత్రుల లో చికిత్స చేసి పంపివేయడమో లేదా చికిత్స ను కొనసాగించడమో జరుగుతోంది.
సోదరీమణులు మరియు సోదరులారా,
అభివృద్ధి తాలూకు 5 కోణాల లో బిజెపి ప్రభుత్వం ముందుకు పోవడాని కి కట్టుబడి ఉంది. అవి ఏమిటంటే- బాలల కు విద్య, యువత కు ఆదాయం, వృద్ధుల కు మందులు, రైతుల కు త్రాగు నీరు మరియు ప్రజల యొక్క ఇక్కట్ల ను తీర్చడం అనేవే.
ఉద్యోగ కల్పన పరం గా చూస్తే యుపి లోని దాదాపు ప్రతి ఒక్క జిల్లా కూడా- ఆగ్రా తో సహా- చిన్న, మధ్యతరహా పరిశ్రమల కు ప్రసిద్ధి చెందింది. ఆగ్రా లోని పేఠా .. ఇది అయితే ఇక్కడి ఓ గుర్తింపు గా మారిపోయింది. మరెన్నో సాంప్రదాయక కార్యాలు కూడా ఆగ్రా లో సాగుతూ వున్నాయి. ఈ చిన్న పరిశ్రమల కు మరింత జోరు ను సంతరించడం లో కేంద్ర ప్రభుత్వం, యుపి ప్రభుత్వం తలమునకలయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం యొక్క ‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’ పథకం స్థానిక లఘు పరిశ్రమల ను మరియు సాంప్రదాయక పరిశ్రమల ను ప్రోత్సహించడం లో ఒక మైలురాయి లా నిలువబోతోంది. అంతే కాదు మా యొక్క మేక్ ఇన్ ఇండియా అభియాన్ కు కూడాను దీని ద్వారా ఒక ఉత్తేజం లభిస్తోంది.
మిత్రులారా,
మా ప్రభుత్వం సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా సంస్థల కు సాధికారిత ను కల్పించడం కోసం నిరంతరం చర్యల ను తీసుకొంటోంది. చిన్న, నవ పారిశ్రామికుల కు బ్యాంకు ల నుండి రుల ను అందించేందుకు ఆన్ లైన్ లోన్స్ వంటి ఒక ఆధునిక వ్యవస్థ ను తీసుకొనిరావడం జరిగింది. మరి ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు, ఆగ్రా ప్రజలు దీని తాలూకు ప్రయోజనాన్ని పొందుతున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్య చకితులు అవుతారు. ఒక కోటి రూపాయల వరకు రుణాన్ని కేవలం 59 నిమిషాల లో మంజూరు చేసేందుకు ఒక సాంకేతిక విజ్ఞాన ఆధారితమైన వ్యవస్థ ను నెలకొల్పడమైంది. 59 నిమిషాలు అంటే కనీసం ఒక గంట లోపే అన్న మాట.
దీనికి తోడు, పెద్ద సంస్థలలో మరియు బడా కంపెనీల లో చిన్న పారిశ్రామికుల డబ్బు చిక్కుబడి పోకుండాను, నగదు ప్రవాహం కొనసాగేటట్లు గాను చూడటాని కి సైతం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎగుమతిదారు సంస్థ లకు రుణాల పై వడ్డీ లో 2 శాతం తగ్గింపు ను అందించడం జరిగింది. అదే విధం గా పర్యావరణ పరమైన ఆమోదాల మొదలు ఇన్స్ పెక్శన్ వరకు వున్న నియమ నిబంధనలను పలు విధాల సడలింపుల కు లోను చేయడమైంది. ఈ ప్రయత్నాలన్నింటి తో సమీప భవిష్యత్తు లో చిన్న మరియు మధ్యతరగతి నవ పారిశ్రామికులకు ఒక గతి దొరకనుంది. అలాగే, ఆగ్రా మరియు పరిసర ప్రాంతాల యువతీ యువకుల కు ఉద్యోగం సంబంధిత నూతనావకాశాలూ అందుబాటు లోకి రాగలవు.
నియమ నిబంధనలు సులభతరం అయ్యాయి అంటే వ్యాపారం మరియు కార్యకలాపాలు ఇట్టే పుష్పించి, ఫలిస్తాయి. వ్యాపారులు మరియు వినియోగదారుల నడుమ పరస్పర విశ్వాసాన్ని బలపరచడం కోసం జిఎస్‌టి వ్యవస్థ ను తీసుకొనిరావడం జరిగింది. ఈ కొత్త వ్యవస్థ ఏర్పడి, కేవలం ఒకటిన్నరేళ్లే అయింది. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను మరియు అర్జీల ను పరిశీలిస్తూ నియమాల లో మార్పు చేర్పుల ను చేయడం, ఎప్పటికప్పుడు మెరుగుదలలకు తావు ఇవ్వడం జరుగుతోంది. ఈ బృహత్ కార్యం ప్రపంచ వ్యాప్తం గా ప్రజల ను అబ్బురపరుస్తోంది.
సోదరీమణులు మరియు సోదరులారా,
జిఎస్‌టి ప్రస్తుతం ఉన్న పన్నుల కు తోడు ఒక కొత్త పన్ను అంటూ కొందరు భ్రమ ను వ్యాపింపజేస్తున్నారు. ఇది ఒక అబద్ధం. ఇది ఒక వదంతి మాత్రమే. జిఎస్‌టి అనేది ఒక క్రొత్త పన్ను కాదు. ఇదివరకటి పన్నులు ఏవైతే 25 శాతం, 30 శాతం, 18 శాతం, 20 శాతం, లేదా 22 శాతం పన్ను వంటివి దాచిపెట్టబడిన పన్నులు. వాటిని ఎవరూ చూడలేరు. కానీ, వాటిని చెల్లించి తీరవలసిందే. ఆ పన్నులు అన్నింటి కీ మేము స్వస్తి పలికాము. 40 శాతం, 25 శాతం, 30 శాతం, 35 శాతం లేదా 28 శాతం పన్నుల ను తగ్గించడమైంది. మరి అలాగే, వస్తువుల లో 99 శాతం వస్తువుల ను 18 శాతం పన్ను పరిధి లోకి తీసుకు రావడం జరిగింది. కొన్ని వస్తువుల పై 12 శాతం పన్ను ఉండ గా, ఇతర వస్తువుల పై 5 శాతం, లేదా సున్నా శాతం పన్ను ఉంది. దీని తాలూకు ప్రయోజనాన్ని వినియోగదారులు పొందుతున్నారు. ఈ కారణం గా సోదరీమణులు మరియు సోదరులారా, వ్యాపారస్తుల కోసమూ, వినియోగదారుల కోసమూ జిఎస్‌టి ని సరళతరం చేసే ప్రక్రియ నిరంతర ప్రాతిపదిక న సాగుతోంది.
ప్రజల భాగస్వామ్యం తో నడిచే ఈ ప్రభుత్వం మీ అందరి వద్ద నుండి అందినటువంటి సూచనల లో చాలా వరకు సూచనల ను అమలుపరుస్తోంది. అందుకనే మేము ఇప్పుడు నవ పారిశ్రామికుల ఆదాయపు పరిమితి ని ఏదైతే జిఎస్‌టి పరిధి లోకి వస్తోందో, దాని ని 20 లక్షల నుండి 75 లక్షల కు పెంచాలని జిఎస్‌టి కౌన్సిల్ ను కోరాము. నేను ఎన్నో అభ్యర్థనల ను ప్రతిపాదించాను. నిర్ణయం నా చేతుల్లో ఏమీ లేదు. అది జిఎస్‌టి కౌన్సిల్ చేతుల లో ఉంది. జిఎస్‌టి కౌన్సిల్ లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల కు మరియు అన్ని రాజకీయ పక్షాల కు స్థానం ఉంది. మరి వారు అందరూ కలసి నిర్ణయాన్ని తీసుకోవలసివుంటుంది. అయినప్పటికీ కూడాను వారి కి నేను మనవి చేశాను.
దీని కి అదనం గా, మధ్యతరగతి కోసం నిర్మించినటువంటి గృహాల ను కూడా 5 శాతం బ్రాకెట్ లోకి తీసుకొని రావలసివుంది. ఈ అంశాల ను గురించి జిఎస్‌టి కౌన్సిల్ ను నేను అభ్యర్ధించాను. కిందటి సారి కూడా నేను ఇదే విషయమై అభ్యర్ధించాను. అయితే, దీని ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. మేము ఒక ఏకాభిప్రాయాని కి రాలేకపోయాము. రానున్న రోజుల లో జిఎస్‌టి కౌన్సిల్ సమావేశమైనప్పుడు అది ప్రజల కు సంబంధించిన ఈ అంశం పై శ్రద్ధ ను తీసుకొంటుందని నేను ఆశిస్తున్నాను.
మిత్రులారా,
‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ ఇది కేవలం ఒక నినాదం కాదు. అది సుపరిపాలన యొక్క ఆత్మ గా ఉంది. సమాజం లోని ఏ వర్గం, ఏ వ్యక్తి లేదా దేశం లోని ఏ ప్రాంతం అవకాశాల ను అందుకోకుండా మిగిలిపోకూడదు; ఇందుకే మా ప్రభుత్వం పాటు పడుతోంది.
సోదరీమణులు మరియు సోదరులారా,
నిన్నటి రోజు న ఒక చరిత్రాత్మకమైనటువంటి బిల్లు ఏ విధం గా లోక్ సభ లో ఆమోదం పొందిందీ యావత్తు దేశ ప్రజలు గమనించారు.
స్వాతంత్య్రం సిద్ధించిన ఇన్ని దశాబ్దాల అనంతరం పేదరికం కారణం గా తలెత్తిన సమానత్వ రాహిత్య స్థితిగతుల కు తొలుత ఆ సమస్య ను ఆమోదించడం ద్వారా ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నం అంటూ జరిగింది.
జనరల్ కేటగిరీ కి చెందిన పేద కుటుంబాలు విద్యా సంస్థల లో మరియు ప్రభుత్వ సర్వీసుల లో రిజర్వేశన్ ను అందుకొనేందుకు ఆ కుటుంబాల కు తోడ్పడం కోసం ఈ అంశం పై ఒక కీలకమైనటువంటి పెద్ద అడుగును వేయడం జరిగింది.
మరి ఇంతకు ముందు కూడాను నినాదాలు ఎలుగెత్తడం, అలాగే ఎన్నికల వేళల్లో పలు ప్రకటనలు రావడం నాకు ఎరుకే. ఆ కాలం లో ఆ పని ఎన్నికల కు లాభదాయకం గా ఉంటుందా, ఉండదా ? అన్నది నేను ఎన్నటికీ పట్టించుకోబోనని ప్రతి ఒక్కరితో బాహాటం గా చెప్పే వాడి ని. 50 శాతాని కి మించి రిజర్వేశన్ కల్పిస్తామని ఎవరైనా వాగ్ధానాలు చేస్తే గనుక అది మోసం చేయడమే అని ప్రతి ఒక్కరి తో నేను అనే వాడి ని. దీని కి కారణం ఏమిటంటే, 50 శాతాని కి మించి రిజర్వేశన్ లను కల్పించాలని ఎవరైనా కోరుకుంటే అటువంటప్పుడు రాజ్యాంగాని కి సవరణ చేయవలసివుంటుంది. ఈ విషయాన్ని లెక్క లోకి తీసుకోకుండా ఎవరైనా ఆ విధమైన వాగ్ధానాలు చేస్తే గనుక అప్పుడు అది దళితులు, షెడ్యూల్డు తెగలు, ఇంకా ఒబిసి ల వంటి ఇతర కేటగిరీల కు ప్రత్యేకించిన దాని లో నుండి కొంత భాగాన్ని దొంగిలించడం కిందకు వస్తుంది. ఇది వోటు బ్యాంకు జోలె నింపుకోవడం కోసం ఉద్దేశించింది. అందుకని మేము అన్నాము దీని కన్నా ముందు, రాజ్యాంగ సవరణ అవసరం అని.
మరి ముఖ్యమంత్రి పదవి లో ఉండి నేను ఇచ్చిన వాగ్ధానాల ను ఈ రోజు న ప్రధాన మంత్రి పదవి లో నేను అమలు చేయడం చూస్తే నాకు సంతోషం గా ఉంది. రాజ్యాంగాన్ని సవరించే దిశగా ముందుకు పోయాము. మరి దళితులు, ఎస్‌టి లు, ఇంకా ఒబిసి ల వాటా ను దొంగిలించకుండానే; పేద పిల్లల ను గురించి ఆలోచిస్తూ.. అగ్రకులాల కు చెందిన ఆర్థికం గా బలహీనులైన వర్గాల వారి ని కూడా నేను ఇందులో కి చేర్చాను.
ఎన్నికల కు ముందు ఈ ఏర్పాటు ను మోదీ గారు ఉద్దేశ పూర్వకం గా తీసుకొని వచ్చారని కొంత మంది అంటున్నారు. ప్రతి ఆరు నెలల కు దేశం లో ఏదో ఒక ప్రాంతం లో ఎన్నికలు జరుగుతున్నాయా, లేదా ? నేను గనుక మూడు నెలల కిందట దీని ని తీసుకు వచ్చి వుంటే, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మరియు రాజస్థాన్ ఎన్నికల ను దృష్టి లో పెట్టుకొనే అలా చేశానని మీరు అనే వారు. అంతకన్నా ముందు చేస్తే కర్నాటక ఎన్నికల ను దృష్టి లో ఉంచుకొని ఈ పని ని చేశానని మీరు అనే వారు. అంటే, దేశం లో ప్రతి సంవత్సరంలో ఎన్నికలు రెండు రెండు సార్లు అవుతూ ఉంటాయి. ఎన్నికలు ఏదో ఒక చోట జరుగుతుంటాయి. అందువల్ల లోక్ సభ మరియు విధాన సభ ఎన్నికల ను ఏక కాలం లో నిర్వహించాలి అని నేను చెప్తూ వుంటాను. అయిదు సంవత్సరాల లో ఒక సారే ఎన్నికలు ఉండాలి. నాతో మీరు ఏకీభవిస్తారా, లేక ఏకీభవించారా? ఈ వ్యయాల ను అరికట్టకూడదా ? ఎన్నికల కు సంబంధించిన పనుల లో రాత్రింబవళ్ళు నిమగ్నం కావడాన్ని ఆపాలా, లేక ఆపకూడదా ? ప్రభుత్వం పూర్తి గా అయిదు సంవత్సరాల కాలం పని చేయాలా, లేక పని చేయకూడదా ? ఈ విధం గా ఎన్నికల తో అదే పని గా తలమునకలు కావడం అనేది కొనసాగుతూ ఉండవలసిందేనా ? పోలీసులు శాంతి, భద్రతల పరిస్థితి ని పర్యవేక్షించాలా, లేక ఎన్నికల కు సంబంధించిన పనులనే చేస్తూ ఉండిపోవాలా ? జరుగుతున్నదల్లా ఇదే. రాజకీయ నాయకులు దేశ ప్రజల ను గురించి పట్టించుకోవడం లేదు. వారు ఒకరి కేసి మరొకరు చూడటానికైనా సిద్ధం గా లేరు.
వారు ‘చౌకీదార్’ అంటే భయపడుతున్నారు. వారు ముందుగా ‘చౌకీదార్’ను వదలించుకోవాలని కోరుకుంటున్నారు. ఒకసారి ‘చౌకీదార్’ వెళ్ళిపోయాడు అంటే వారు ప్రతిదీ దోచేసుకుంటారు. కానీ, ‘చౌకీదార్’ ఉన్నంత వరకు వారి కి మనుగడ సాగించడం కష్టమవుతుంది. మీరు నాతో చెప్పండి.. ‘చౌకీదార్’ తన ఉద్యోగాన్ని చేయాలా, లేక చేయకూడదా ? ‘చౌకీదార్’ ఎవరిని చూసైనా భయపడాలా ? ఈ ‘చౌకీదార్’కు మీ ఆశీర్వాదాలు ఉన్నాయా ? ఈ ‘చౌకీదార్’ తన పని ని చిత్తశుద్ధి తో చేయాలా, లేక చేయకూడదా ? దోచుకోబడినటువంటి దేశం యొక్క సంపద ను తిరిగి వెనుక కు తీసుకు రాకూడదా ? పేదలు వారి యొక్క హక్కుల ను పొందాలా, లేక పొందకూడదా ? దేశం లోని ప్రతి ఒక్క వ్యక్తి ‘చౌకీదార్’గా నిలబడేటట్లు చూడటాని కి నేను కట్టుబడి ఉన్నాను.
సోదరీమణులు మరియు సోదరులారా,
అగ్రకులాల పేదల కు రిజర్వేశన్ ను కల్పించడం లో పార్లమెంటు ఒక పెద్ద పని ని పూర్తి చేసింది. సమానత్వ స్ఫూర్తి ని బలపరచడం లో ఒక కీలకమైనటువంటి పాత్ర ను పోషించిన పార్లమెంటు లోని నా సహచరుల కు ప్రతి ఒక్కరి కి నేను కృతజ్ఞడినై వుంటాను.
మిత్రులారా,
ఈ చర్య డబ్బు లేకపోయినందువల్ల మరియు పేదరికం కారణం గా ముందుకు పోలేకపోయిన లక్షలాది యువజనుల కు అవకాశాల ను ప్రసాదిస్తుంది. ఎవరి జీవన ప్రమాణాన్ని అయినా పెంచడం లో అడ్డంకుల ను ఏర్పరచకుండా పేదరికాన్ని నిరోధించడం కోసం చరిత్రాత్మకమైన చొరవల ను తీసుకోవడమైంది.
సోదరీమణులు మరియు సోదరులారా,
మేము నియామకాల లో రిజర్వేశన్ ను కల్పించడం ఒక్కటే కాకుండా ఉన్నత విద్య లో, సాంకేతిక విద్య లో, మరి వృత్తి విద్య లో కూడా రిజర్వేశన్ ను కల్పించాము. రిజర్వేశన్ కు తోడు మేము ఉన్నత విద్య సంస్థల లో సీట్ల ను 10 శాతం మేర పెంచాలని కూడా నిర్ణయించాము. ఎవరి హక్కుల నో బెదరించగల ఏ పని ని మేము చేయబోము.
మిత్రులారా,
ఈ తరహా వ్యవస్థ లతో మేము ముందుకు కదులుతున్నాము. అనేక సంవత్సరాల పాటు ఆర్థిక హోదా ఆధారం గా రిజర్వేశన్ ను మంజూరు చేయాలనే డిమాండు ఉంటూ వచ్చింది. ఈ డిమాండు ను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నెరవేర్చింది. అయితే, వదంతుల ను వ్యాప్తి లోకి తీసుకు వస్తున్న శక్తుల విషయం లో నేను కూడా మిమ్మల్ని హెచ్చరించ దలుస్తున్నాను. పేదల శత్రువులు అయినటువంటి ఈ శక్తులు అదే పని గా సామాజిక ప్రసార మాధ్యమాల ద్వారాను, అంతకన్నా పెద్ద వేదికల ద్వారాను అసత్యాల ను మరియు వదంతుల ను అదే పని గా వ్యాపింప చేస్తున్నాయి. సమాజం లో విభజన ద్వారా నెరవేరుతున్న కొంత మంది కి చెందిన స్వార్ధ ప్రయోజనాల కుతంత్రాన్ని మరియు ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మనం పరాజయం పాలు చేయవలసిన అవసరం ఉంది.
మిత్రులారా,
ప్రభుత్వం మరొక ముఖ్యమైన అడుగు ను కూడా వేసింది. పౌరసత్వాని కి సంబంధించిన రాజ్యాంగ సవరణ దేశ సంకల్పం లో ఒక భాగం. దీని ద్వారా మనం ఒక కాలం లో భారత భూమి లో ఓ భాగం గా ఉన్న వారందరి సరసన నిలబడ గలుగుతాము. దేశ విభజన కాలం లో మన భూమి నుండి దూరం చేయబడిన అటువంటి వారు అందరి, మరియు ధార్మిక కారణాల వల్ల చిత్రహింసల కు గురి చేయబడుతున్న వారి వెన్నంటి భారతదేశం నిలబడి తీరాలి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షం దీని ని అర్థం చేసుకొంటుందని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
అవినీతి కి వ్యతిరేకం గా మీరు దాదాపు నాలుగున్నర సంవత్సరాల క్రితం నాకు ఏదయితే ఆదేశాన్ని ఇచ్చారో వాటి విషయంలో నేను నా యొక్క పూర్తి దక్షత మేరకు పని చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఈ కారణం గానే ఈ చౌకీదార్ కు వ్యతిరేకం గా కొంత మంది గుమి కూడటం మొదలు పెట్టారు. సమాజం లో అణచివేత కు గురి అయినటువంటి మరియు వంచితులైన వర్గాల యొక్క హక్కుల ను ఉత్తర్ ప్రదేశ్ లో ఇసుక మాఫియా ఏ విధం గా లాగేసుకొందో మీరు స్పష్టం గా చూశారు. అటువంటి వారు ప్రస్తుతం అవినీతి లో చేతులు కలిపే ఒక ఉద్యమాన్ని ఆరంభించారు. ఒకరి ముఖం లోకి మరొకరు చూడటానికైనా ఎన్నడూ సిద్ధం గా లేనటువంటి వారు ప్రస్తుతం పరస్పర కుంభకోణాల, కళంకాల వెనుక దాగి వుండటం కోసం చేతులు కలుపుతున్నారు.
సోదరీమణులు మరియు సోదరులారా,
రాజకీయాల పరం గా ప్లస్ మార్కులు తెచ్చుకోవడం కోసం లఖ్‌నవూ అతిథి గృహ కుంభకోణాన్ని సైతం విస్మరించడం జరిగింది. వారు ముజఫర్‌నగర్ సహా ఉత్తర్ ప్రదేశ్ లోని పశ్చిమ దిశ ప్రాంతాల లో దీని ని చెరిపి వేయాలని అనుకొంటున్నారు. ‘చౌకీదార్’ మేల్కొని, అప్రమత్తం గా ఉన్నందునే ఇదంతా జరుగుతోంది. అతడు పూర్తి చిత్తశుద్ధి తో అక్కడ నిలబడివున్నాడు. వారు ‘చౌకీదార్’ను తొలగించడం కోసం ప్రతి ఒక్క చిన్న ముక్క నైనా సరే జోడించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వారి యొక్క కార్యాల కు సమాధానాల ను రాబట్టడం కోసం దర్యాప్తు సంస్థ లు ప్రయత్నిస్తూవుంటే, వారు ‘చౌకీదార’కు వ్యతిరేకం గా గూడుపుఠాణీ చేస్తున్నారు.
సోదరీమణులు మరియు సోదరులారా,
రెండు, మూడు రోజుల క్రితం పార్లమెంటు లో జరిగింది మీరు చూసే వుంటారు.. 125 కోట్ల మంది భారతీయుల భద్రత ను పర్యవేక్షిస్తున్న ప్రప్రథమం గా మన దేశాని కి రక్షణ మంత్రి అయినటువంటి మహిళ విపక్షాని కి ఏ విధం గా దీటైన సమాధానాన్ని ఇచ్చారో. ఇది మన మహిళలు గర్వించవలసినటువంటి విషయం. ఆమె ప్రతిపక్ష నేతల అసత్యాలు అన్నిటినీ బహిర్గతం చేశారు. ఆమె ఒకదాని తరువాత మరొకటి గా నిజాన్ని పార్లమెంటు ముందుకు తీసుకు వచ్చారు. వారు ఎంత గా ఆశా భంగాని కి లోనయ్యారంటే, ఒక మహిళ ను అవమానించేందుకు వారు ప్రయత్నించారు. వారు ఒక మహిళా రక్షణ మంత్రి ని పరాభవం పాలు చేయజూశారు. ఇది కేవలం రక్షణ మంత్రి కి లభించిన నిరాదరణ మాత్రమే కాదు. యావత్తు భారతదేశం లో మహిళా శక్తి కి జరిగినటువంటి తిరస్కారం. మరి ఈ బాధ్యత లోపించిన నాయకులు దీని కి గాను మూల్యాన్ని చెల్లించుకోవలసి ఉంటుంది.
సోదరీమణులు మరియు సోదరులారా,
వారు ఎంతగా ప్రయత్నించినప్పటికి కూడాను దర్యాప్తు సంస్థ లు వాటి పని ని అవి చేస్తాయి; అవి వారి ని లెక్కలు అడుగుతాయి. మిత్రులారా, ఈ రోజు న వారు ఈ స్థితి కి వచ్చారంటే అందుకు కారణం మోదీ కాదు; అందుకు కారణం మీ యొక్క ఆశీస్సులే. ఇది 130 కోట్ల మంది భారతీయుల నమ్మకం కారణం గా సాధ్యపడింది. మీ యొక్క విశ్వాసాలకు తులతూగడానికి నేను ఎల్లప్పుడూ యత్నిస్తూవున్నాను.
సోదరీమణులు మరియు సోదరులారా,
ప్రస్తుతం మీరు చాపర్ కుంభకోణం లో మిశెల్ ‘మామ’కు సంబంధించిన కథ తో సుపరిచితులే అయివుంటారు. ఇవాళ అతడు భారతదేశపు కారాగారం లో ఉన్నాడు. అందుకనే వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. అతడు వారి కి వ్యతిరేకం గా ఏదైనా కక్కేస్తే ఏమి కాను. అందుకని చాపర్ కుంభకోణం లో నిందితుడు అరెస్టు అయిన వెంటనే అతడి ని రక్షించడానికని కాంగ్రెస్ తన న్యాయవాది ని ఒకరి ని పంపించింది.
సోదరీమణులు మరియు సోదరులారా,
నిందితుడి కి సహాయం చేయడం కోసం కాంగ్రెస్ తన న్యాయవాది ని పంపించింది అంటే, ఇది దేని ని సూచిస్తోంది ? ఏదో మతలబు ఉందని స్పష్టం కావడం లేదా ? తెర వెనుక ఏమి జరుగుతున్నదీ ఇట్టే తెలుసుకోవచ్చును.
సోదరీమణులు మరియు సోదరులారా,
ప్రస్తుతం ‘చౌకీదార్’వారి కి సమస్యల ను తెచ్చి పెడుతున్నాడు. మోదీ కాలక్రమం లో ఇతర రాజకీయవాదులకు మల్లేనే అయిపోతాడని వారు అనుకున్నారు. కానీ, 4 సంవత్సరాల తరువాత మోదీ ఎప్పటి మాదిరి గానే ఉన్నాడు. దీనితో వారు చౌకీదార్ అంటే భయపడటం మొదలుపెట్టారు. అందువల్ల వారు నైరాశ్యం లో కూరుకుపోయారు. మరొక్క మారు వివిధ అభివృద్ధి పథకాల కు గాను మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. మీరు మీ యొక్క ఆశీర్వాదాల ను వర్షించడం కోసం ఇంత పెద్ద సంఖ్య లో ఇక్కడ కు తరలి వచ్చినందుకు మీకు నేను కృతజ్ఞుడి ని. నాతో పాటు బిగ్గర గా పలకండి..
భారత్ మాతా కీ జయ్
భారత్ మాతా కీ జయ్
భారత్ మాతా కీ జయ్.
మీ అందరికీ నా తరఫు న ముందస్తుగానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
******
GST कोई अलग से लगाया गया टैक्स नहीं है। बल्कि पहले जो आप सभी सामान पर या सेवाओं पर दर्जनों टैक्स देते थे, उनको समेटकर कम कर दिया गया है.
— PMO India (@PMOIndia) January 9, 2019
पहले बहुत सी चीजों पर 30% से भी अधिक टैक्स लगते थे, जो कहीं दिखते नहीं थे। अब जितना टैक्स आप देते हैं उतना दिखता भी है, यही पारदर्शिता है: PM
अब सामान्य मानवी के काम आने वाला ज्यादातर सामान यानि करीब-करीब 99 प्रतिशत सामान पर GST 18% से कम है।
— PMO India (@PMOIndia) January 9, 2019
GST को व्यापारियों और उपभोक्ताओं के लिए और सरल करने की प्रक्रिया निरंतर चल रही है।
जनभागीदारी से चलने वाली ये सरकार आप सभी से मिल रहे सुझावों पर अमल कर रही है: PM
कल पूरे देश ने देखा है कि किस प्रकार लोकसभा में एक ऐतिहासिक बिल पास किया गया है।
— PMO India (@PMOIndia) January 9, 2019
आजादी के इतने दशकों के बाद गरीबी के कारण बढ़ी असमानता को स्वीकार किया गया है।
सामान्य श्रेणी के गरीब परिवारों को 10% का आरक्षण मिले, इस तरफ एक महत्वपूर्ण बड़ा कदम उठाया गया: PM
किसी भी वर्ग के हितों का नुकसान किए बिना, गरीबों को समता और समानता देने की एनडीए सरकार की ये पहल भविष्य के भारत के लिए बहुत महत्वपूर्ण है।
— PMO India (@PMOIndia) January 9, 2019
मैं देश के हर नागरिक का, संसद के सभी साथियों का, समता और समरसता की भावना को मज़बूत करने के लिए आभार व्यक्त करता हूं: PM
इस प्रकार की व्यवस्था को लेकर मांग नई नहीं है।
— PMO India (@PMOIndia) January 9, 2019
आर्थिक स्थिति के आधार पर जो हमारे समाज में जो एक खाई बनी है उसके आधार पर दशकों से इसकी मांग चल रही थी।
इस मांग को पूरा करने का काम सरकार ने किया है: PM
अब उन ताकतों से भी सावधान रहना है जो अपने स्वार्थ के लिए अफवाहों का बाज़ार गर्म करने में जुट गई हैं।
— PMO India (@PMOIndia) January 9, 2019
गरीबों के दुश्मन सोशल मीडिया से लेकर बड़े मंचों पर अब झूठ फैलाने के काम में जुट गए हैं।
समाज में बंटवारे से जिनका स्वार्थ सिद्ध होता है, उनकी हर चाल को हमें असफल करना है: PM
वर्षों से आगरा के लोगों की एक मांग थी, जिसे हमारी सरकार को पूरा करने का सौभाग्य मिला है।
— Narendra Modi (@narendramodi) January 9, 2019
जानिए, मैं किस मांग की बात कर रहा हूं। pic.twitter.com/8fVZcGNEqm
भ्रष्टाचार के खिलाफ साढ़े चार साल पहले आपने मुझे जो जनादेश दिया था, उस पर मैं पूरी क्षमता से खरा उतरने का प्रयास कर रहा हूं।
— Narendra Modi (@narendramodi) January 9, 2019
इस कारण कैसे इस चौकीदार के खिलाफ कुछ लोग इकट्ठा होना शुरू हो गए हैं। pic.twitter.com/SpkAM1XOwt