Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆగ‌స్టు 23వ తేదీన గుజ‌రాత్ లో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018, ఆగ‌స్టు 23వ తేదీన గుజ‌రాత్ లో ప‌ర్య‌టించ‌నున్నారు.

వ‌ల్‌సాడ్‌ జిల్లా జుజ్ వా గ్రామం లో జరిగే ఒక పెద్ద జ‌న‌ స‌భ లో ప్రధాన మంత్రి సమక్షంలో “అంద‌రికీ గృహ నిర్మాణం’’ క‌ల్ప‌న కు సంబంధించిన కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన ప‌థ‌కమైన ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న (గ్రామీణ్‌) యొక్క ల‌బ్దిదారుల సామూహిక ఇ- గృహ‌ప్ర‌వేశ్ కార్య‌క్ర‌మం చోటు చేసుకోనుంది.

గుజ‌రాత్ రాష్ట్రం లో ఒక ల‌క్ష‌ కు పైగా ఇళ్ళ నిర్మాణం పూర్తి అయింది. ఈ గృహాల ల‌బ్దిదారులు 26 జిల్లాల‌ లో ఉమ్మ‌డి గృహ ప్ర‌వేశాల‌ను నిర్వ‌హించుకోనున్నారు. వ‌ల్‌సాడ్‌ లో- ద‌క్షిణ గుజ‌రాత్ లోని అయిదు జిల్లాల- వ‌ల్‌సాడ్‌, నవ్ సారీ, తాపీ, సూర‌త్, ఇంకా డాంగ్ జిల్లాల‌- ల‌బ్దిదారులు గుమికూడ‌నున్నారు. మిగతా జిల్లాల‌ లో సామూహిక గృహ ప్ర‌వేశాలు బ్లాకు స్థాయి లో జ‌రుగనున్నాయి. ఈ జిల్లా ల‌కు చెందిన ల‌బ్దిదారుల‌ను ఒక వీడియో లింకు ద్వారా వ‌ల్‌సాడ్‌ లోని ప్ర‌ధాన కార్య‌క్ర‌మానికి తగు విధంగా సంధానించ‌నున్నారు. మొత్తం 2 ల‌క్ష‌ల‌ మందికి పైగా ఈ కార్య‌క్ర‌మం తో ముడివ‌డ‌తార‌ని అంచ‌నా.

ఇదే కార్య‌క్ర‌మం లో దీన్‌ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశ‌ల్ యోజ‌న, ముఖ్య‌మంత్రి గ్రామోద‌య యోజ‌న‌, ఇంకా నేశన‌ల్ రూర‌ల్ లైవ్‌లీహుడ్ మిశ‌న్ లు స‌హా వివిధ అభివృద్ధి ప‌థ‌కాల తాలూకు ఎంపిక చేసిన ల‌బ్దిదారుల‌కు ప్ర‌ధాన మంత్రి ధ్రువ ప‌త్రాల‌ను, నియామక ప‌త్రాల‌ను అంద‌జేయ‌నున్నారు. ఆయ‌న మ‌హిళా బ్యాంకు క‌ర‌స్పాండెంట్ ల‌కు నియామ‌క ప‌త్రాల‌ను, మినీ-ఎటిఎం ల‌ను పంపిణీ చేయనున్నారు. ఆయన అక్కడ ఒక స‌భను ఉద్దేశించి ప్ర‌సంగించనున్నారు.

జూనాగ‌ఢ్ లో అనేక అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్ర‌ధాన మంత్రి ప్రారంభించనున్నారు. వీటిలో జూనాగ‌ఢ్ లో ఒక ప్ర‌భుత్వ ఆసుప‌త్రి; జూనాగఢ్ న‌గ‌ర‌ పాల‌క సంస్థ‌ కు చెందిన 13 ప‌థ‌కాలు; ఇంకా ఖోఖ‌్ రాడా లో ఓ మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంటు వంటివి భాగంగా ఉండబోతున్నాయి. ప్రధాన మంత్రి అక్కడ కూడా ఒక స‌భ ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు.

ప్ర‌ధాన మంత్రి గాంధీన‌గ‌ర్ లో గల గుజ‌రాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివ‌ర్సిటీ లో స్నాతకోత్స‌వాన్ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. ఢిల్లీ కి తిరిగివెళ్లే ముందు గాంధీన‌గ‌ర్ లో సోమ్‌నాథ్ ట్ర‌స్టు స‌మావేశంలో ఆయ‌న పాలుపంచుకొంటారు.

***