Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆదాయంపై ప‌న్ను విష‌యంలో ఆర్థిక ఎగ‌వేత‌ల నిరోధం మ‌రియు రెండు సార్లు ప‌న్ను విధింపు నివార‌ణ‌ ల కోసం భారతదేశానికి, కిర్గిజ్ కు మ‌ధ్య ఒప్పందాన్ని సవరించే ప్రోటోకాల్ ను ఆమోదించిన మంత్రివ‌ర్గం


ఆదాయంపై ప‌న్ను విష‌యంలో ఆర్థిక ఎగ‌వేత‌ల నిరోధం మ‌రియు రెండు సార్లు ప‌న్ను విధింపు నివార‌ణ‌ ల కోసం భారతదేశానికి, కిర్గిజ్ కు మ‌ధ్య ఒప్పందాన్ని సవరించే ఒక ఒడంబడికల ప్రాథమిక పత్రాన్ని (ప్రోటోకాల్)ను కుదుర్చుకోవడానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

రెండు సార్లు ప‌న్ను విధింపు నివార‌ణ‌ ఒప్పందం (డిటిఎఎ)లో సవరణకు వీలు కల్పించే ఈ ప్రోటోకాల్, డిటిఎఎ లోని ఆర్టికల్ 26 (సమాచార మార్పిడి కి సంబంధించినటువంటిది)ని అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అప్ డేట్ చేయడానికి ఉద్దేశించినటువంటిది. అప్ డేట్ అయిన అనంతరం సదరు ఆర్టికల్ సమాచారాన్ని మార్పిడి చేసుకొనేందుకు వీలైనంత విస్తారమైన పరిధిని ప్రసాదిస్తుంది. డిటిఎఎ లో ఇప్పుడు ఉన్న ఆర్టికల్ 26లో కొత్తగా పొందుపరచే 4 వ మరియు 5 వ పేరాగ్రాఫుల ఏ దేశం నుండయితే సమాచారాన్ని అభ్యర్థించడం జరుగుతోందో ఆ యొక్క సమాచారంలో- దేశీయ పన్ను సంబంధ ప్రయోజనం ఏదీ లేదన్న కారణం గానో లేదా కోరినటువంటి ఆ సమాచారం ఏదైనా ఒక బ్యాంకు గాని ఒక ఆర్థిక సంస్థ వద్ద లేదా మరో చోటు గాని ఉందన్న కారణం గానో- సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించే అవకాశాన్ని కలుగజేయవు. దీనికి తోడు ఈ ప్రోటోకాల్ డిటిఎఎ లో భాగంగా అందుకొన్న సమాచారాన్ని చట్టాన్ని అమలుపరచే ఇతర సంస్థలు ఉపయోగించుకొనే అధికారాన్ని భారతదేశానికి దఖలుపరుస్తుంది; మరియు ఇటువంటి సమాచారం యొక్క వినియోగాధికారాన్ని ఆ సమాచారం అందజేసే దేశం మీద ఉపయోగించేందుకూ అధికారాన్నిస్తుంది.

పూర్వ రంగం:

భారతదేశానికి, కిర్గిజ్ రిపబ్లిక్ కు మధ్య ఇప్పుడు అమలవుతున్న డిటిఎఎ ను 7/02/2001న నోటిఫై చేయడమైంది. అది 10/01/2001 నుండి వర్తిస్తోంది. భారతదేశానికి, కిర్గిజ్ రిపబ్లిక్ కు మధ్య ఆదాయంపై ప‌న్ను విష‌యంలో ఆర్థిక ఎగ‌వేత‌ల నిరోధం మ‌రియు రెండు సార్లు ప‌న్ను విధింపు నివార‌ణ‌ ల కోసం డిటిఎఎ ను సవరిస్తూ ఒక ప్రోటోకాల్ రెండు దేశాలూ కుదుర్చుకోవాలని ఇరు పక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి.

***