Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆయుష్మాన్ భార‌త్ కు ధన్యవాదాలు – సుదూర ద్వీప నివాసి కి జీవ‌నం గాడి న పడింది


అండ‌మాన్‌నికోబార్ కు చెందిన పేద కుటుంబపు సభ్యుడు అయిన 52 ఏళ్ళ వ‌య‌స్సు క‌లిగిన ర‌త‌న్ బ‌రయి మాయోకార్డియ‌ల్ ఇన్‌ ఫార్‌ క్ష‌న్ తో బాధ‌ప‌డుతుండే వారు.

 

ఆయన తనకు ఛాతీ లో ఎడ‌మ భాగాన నొప్పి యే కాకుండా విపరీతమైన చెమ‌ట పోస్తున్నదని కూడా చెప్పి, పోర్ట్ బ్లేయ‌ర్ లోని జి.బి పంత్ ఆసుప‌త్రి లో చేరారు.  ఆయ‌న కు డాయ‌బిటీజ్  మెలిట‌స్ సైతం ఉన్నది.  విస్తృతమైన ప‌రీక్ష‌ లు చేసిన అనంత‌రం ఇది ఎక్యూట్ ఎంటెరియ‌ర్ వాల్ మాయోకార్డియ‌ల్ ఇన్‌ ఫార్‌ క్ష‌న్ అని తేలింది.  దీనికి చికిత్స ఏర్పాట్ల ను నిర్ధారించి, ఆ తరువాత అదనపు విశేష ఉపచారాల కోసం దేశం లోని ముఖ్య భూభాగానికి చెందిన హృద‌య కోశ రోగ నిపుణుల కు చూపించుకోవ‌ల‌సింది గా సూచించడమైంది. 

 

http://164.100.117.97/WriteReadData/userfiles/image/image0012U0B.jpg

అండ‌మాన్‌నికోబార్ ద్వీప సమూహం లో గుండె జ‌బ్బు ల‌ను న‌యం చేసే స‌దుపాయం ఏదీ లేక‌పోవ‌డం తో అటువంటి రోగుల ను ఉపచారం కోసం కోల్ కాతా మరియు చెన్నై వంటి న‌గ‌రాల‌ కు పంపించడం పరిపాటి.

 

అయితే, ర‌త‌న్ బ‌రయి వ‌ద్ద త‌గినంత డ‌బ్బు లేదు; అందువల్ల ఇలా ఇత‌ర ప్రాంతాల కు వెళ్ళాలంటే అది ఆయ‌న కు క‌ష్ట‌మే.

 

ఆయుష్మాన్ భార‌త్ – పిఎంజెఎవై ద్వారా న‌గ‌దు ర‌హిత బీమా ర‌క్ష‌ణ దొరుకుతుంద‌ని ఆయ‌న కు తెలిశాక‌, ఆయన యొక్క జీవ‌నం ప‌ట్ల ఆయ‌న లో ఓ ఆశాకిర‌ణం ఉద‌యించింది.  ఈ పథకం స‌హాయం తో నిర్దేశించిన రోగ చికిత్స ఉచితం గా పొంద‌వచ్చని తోచింది. 

 

http://164.100.117.97/WriteReadData/userfiles/image/image002G9UN.jpg

ఈ రోజు న ఆయన ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి.  అంతేకాదు, ప్ర‌పంచం లో కెల్లా అతి పెద్ద‌దైన‌టువంటి ఆరోగ్య ప‌థ‌కం యొక్క సాఫ‌ల్యాన్ని గురించి వివ‌రించ‌డం కోసం ప్ర‌ధాన మంత్రి తో భేటీ అయిన 31 మంది ల‌బ్ధిదారుల లో ర‌త‌న్ బ‌రయి కూడా ఒక‌రు గా ఉన్నారు. 

 

స‌రిగ్గా ఒక సంవ‌త్స‌రం క్రితం 2018 లో ప్రారంభించ‌బ‌డిన ఆయుష్మాన్ భార‌త్ ప్ర‌పంచం లోనే అతి భారీ ఆరోగ్య బీమా ప‌థ‌కం గా ఉంది.  దేశం లోని 10.74 కోట్ల కు పైబ‌డిన పేద‌ల కు వైద్య సౌక‌ర్యాలు సుల‌భం గా అందుబాటు లోకి తీసుకురావాల‌నేదే ఈ ప‌థ‌కం ధ్యేయం గా ఉంది.

 

గ‌డ‌చిన సంవ‌త్స‌ర కాలం లో ర‌త‌న్ బ‌రయి వంటి 50,000 మంది కి పైగా రోగులు వారి రాష్ట్రాని కి వెలుప‌ల ఆయుష్మాన్ భార‌త్  కార్యక్రమం ద్వారా వైద్య సౌక‌ర్యాల ను పొందగలిగారు.     

 

ఆయుష్మాన్ భార‌త్ ప్ర‌ధాన మంత్రి జ‌న ఆరోగ్య యోజ‌న పిఎం-జెఎవై లో భాగం గా 16,085 ఆసుప‌త్రుల‌ ను పట్టిక లో చేర్చుకొని 41 ల‌క్ష‌ల మందికి పైగా ల‌బ్ధిదారుల‌ కు చికిత్స ను అందించడమైంది. అలాగే 10 కోట్ల ఇ-కార్డుల ను జారీ చేయ‌డం జ‌రిగింది.

 

దేశం అంతటా ఆయుష్మాన్ భార‌త్ లో భాగం గా 20,700 కన్నా అధికంగా హెల్త్ ఎండ్ వెల్ నెస్ సెంట‌ర్ లను ప్రారంభించడమైంది.

 

మరిన్ని వివ‌రాలను తెలుసుకోవాలంటే ఈ క్రింద క్లిక్ చేయ‌గ‌ల‌రు

 

**