Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆయుష్మాన్ భార‌త్ లో భాగంగా ఆరోగ్య హామీ కార్య‌క్ర‌మం ప్రారంభ స‌న్నాహాల‌ను స‌మీక్షించిన ప్ర‌ధాన మంత్రి


ఆయుష్మాన్ భార‌త్ లో భాగ‌మైన ఆరోగ్య హామీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించే దిశ‌గా సాగుతున్న స‌న్నాహాల లో పురోగ‌తి ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు స‌మీక్షించారు.

ప్ర‌తి ఒక్క కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఆరోగ్య హామీ ర‌క్ష‌ణ‌ ను ఈ ప‌థ‌కం అందించనుంది. దీని పరిధి లోకి 10 కోట్ల‌ కు పైగా పేద‌ మరియు దుర్బల కుటుంబాలను తీసుకురావాలని ల‌క్ష్యంగా నిర్దేశించుకొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ల‌కు చెందిన ఉన్న‌తాధికారులు ఈ ప‌థకానికి సంబంధించి రాష్ట్రాల‌ లో సాగుతున్న స‌న్నాహ‌క చ‌ర్య‌లతో పాటు ఈ పథకం తో ముడిపడిన సాంకేతిక అంశాల, మౌలిక అంశాల అభివృద్ధి సహా వివిధ అంశాల‌ను ప్ర‌ధాన మంత్రి కి వివ‌రించారు.

ఆయుష్మాన్ భార‌త్ లో భాగ‌ంగా తొలి ‘హెల్త్ అండ్ వెల్ నెస్ సెంట‌ర్’ ను ఆకాంక్ష భ‌రిత జిల్లా లలో ఒకటైన బీజాపుర్ జిల్లా (చండీగఢ్ లో ఉంది ఈ జిల్లా) లో- ఆంబేడ్ కర్ జ‌యంతి సందర్భం గా ఏప్రిల్ నెల‌ లో- ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు.

*****