పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం, ఆరోగ్యం, ఔషధాల రంగంలో పరస్పర సహకారానికి సంబంధించి న అవగాహనా ఒప్పందానికి వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా తన ఆమోదం తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా 2018 ఫిబ్రవరి 17న ఈ అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఈ అవగాహనా ఒప్పందం, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పటిష్ఠం చేయడంతోపాటు పరస్పర సహకారాన్ని పెంపొందించనుంది.
ఈ అవగాహనా ఒప్పందం ఈ కింది అంశాలలో సహకారాన్ని కలిగి ఉంటుంది.
మెడికల్ డాక్టర్లు, ఇతర ఆరోగ్య వృత్తిదారుల శిక్షణలో అనుభవాన్ని పరస్పరం అందిపుచ్చుకోవడం, మానవ వనరుల అభివృద్ధిలో సహాయం, వైద్య సంరక్షణ సౌకర్యాల ఏర్పాటు, ఫార్మాసూటికల్స్,వైద్య పరికరాలు, కాస్మొటిక్స్ కు సంబంధించిన నియంత్రణ, అందుకు సంబంధించిన సమాచార మార్పిడి, వైద్య పరిశోధన రంగంలో సహకారం, నూతన సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞాన ఆధారిత చర్యలు, ప్రజారోగ్యం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డిజి లు), అంతర్జాతీయ ఆరోగ్య విషయంలో సహకారం, ఇంకా ఇరుపక్షాలూ పరస్పరం నిర్ణయించుకునే ఇతర రంగాలలో సహకారం ఉంటాయి.
సహకారానికి సంబంధించి మరింత వివరంగా నిర్వచించడానికి , ఈ అవగాహనా ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నారు.