Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆరోగ్యం మరియు వైద్య రంగంలో సహకారానికి గాను భారతదేశానికి, పాలస్తీనా కు మధ్య ఎమ్ఒయుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆరోగ్యం మరియు వైద్య రంగంలో సహకారానికి గాను భారతదేశానికి, పాలస్తీనా కు మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు)పై జరిగిన సంతకాలకు ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఎమ్ఒయు పై 2017 మే 16వ తేదీన సంతకాలయ్యాయి.

ఈ కింద పేర్కొన్న రంగాలలో ఉభయ దేశాల మధ్య సహకారం ఎమ్ఒయు పరిధిలోకి రానుంది:

i) ఆరోగ్య సిబ్బంది యొక్క కెపాసిటీ బిల్డింగ్;

ii) తేలికగా సంక్రమించగల వ్యాధుల నివారణ మరియు నియంత్రణ;

iii) భౌతిక చికిత్స మరియు పునరావాసం;

iv) మందులు, ఔషధనిర్మాణ సంబంధితమైన మరియు వైద్య సంబంధ సామాగ్రి; ఇంకా

v) పరస్పర ప్రయోజనం ముడిపడివుండే మరేదైనా రంగం.

ఈ ఎమ్ఒయు అమలును పర్యవేక్షించడానికి మరియు ద్వైపాక్షిక సహకారం తాలూకు వివరాలను మరింతగా విస్తృతపరచడానికి ఒక వర్కింగ్ గ్రూపు ను ఏర్పాటు చేస్తారు.