పిఎంఇండియా
ఆరోగ్యం మరియు వైద్య రంగంలో భారతదేశానికి, సెనెగాల్ కు మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు కు) కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఇరు పక్షాల మధ్య సహకారం ప్రధానంగా ఈ కింద పేర్కొన్న అంశాలలో ఉంటుంది :
అ. ఇంటిగ్రేటెడ్ డిజీజ్ సర్ వేలన్స్
ఆ. వైద్య పరిశోధన
ఇ. అత్యవసర సహాయం
ఈ. ఆసుపత్రి నిర్వహణ
ఉ. మందులు, ఔషధ సంబంధ ఉత్పత్తులు ఆసుపత్రి సామగ్రి
ఊ. సాంప్రదాయక వైద్యం
బుు. ఎయిడ్స్ నియంత్రణ
బుూ. పరస్పర ఆసక్తి వ్యక్తం అయ్యే ఏవైనా ఇతర అంశాలు
రెండు దేశాల మధ్య సహకారం తాలూకు వివరాలను మరింతగా విస్తరింపచేసుకొనేందుకు, ఈ ఎమ్ఒయు అమలును పర్యవేక్షించేందుకు ఒక కార్యాచరణ బృందాన్నిఏర్పాటు చేయనున్నారు.