పిఎంఇండియా

వేదిక ను అలంకరించిన నా మంత్రివర్గ సహచరులు డాక్టర్ హర్ష్ వర్ధన్ గారు, అశ్వినీ కుమార్ చౌబే గారు, వివిధ రాష్ట్రాల, సంస్థ ల ప్రతినిధులు, ఆయుష్మాన్ భారత్ తో అనుబంధాన్ని కలిగివున్న మిత్రుల తో పాటు ఈ రోజు న ఇక్కడ కు విచ్చేసిన పథకం లబ్ధిదారులారా,
సోదరీమణులు మరియు సోదరులారా,
నేడు నవరాత్రి ఉత్సవాల లో మూడో రోజు. ఈ రోజు న మాత ను చంద్రఘంట అవతారం లో ఆరాధించడం జరుగుతుంది. పది సాయుధ బాహువులు కలిగిన చంద్రఘంటా దేవి యొక్క చంద్ర సమానమైన శీతలత్వం తోను, శాంతం తోను యావత్తు ప్రపంచపు బాధల ను హరించివేస్తుందని భక్తజనం నమ్ముతారు. భారతదేశం లో 50 కోట్ల కు పైగా పేద ల బాధల ను రూపుమాపినటువంటి ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ తాలూకు ఒకటో సంవత్సరాన్ని గురించి చర్చించుకోగలగడానికి ఇంత కన్నా ఉత్తమమైన యాదృచ్ఛిక సందర్భం మరేమి ఉంటుంది.
మిత్రులారా,
ఆయుష్మాన్ భారత్ ఒకటో సంవత్సరం నేర్చుకొనే ప్రక్రియ గా సాగింది. ప్రపంచం లో కెల్లా అతి భారీ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని మనం విజయవంతం గా నిర్వహించుకొంటున్నామంటే అది భారతదేశం యొక్క సంకల్ప బలం. మరి ఈ సఫలత వెనుక సౌహార్దం, ఇంకా సమర్పణ భావం అండ గా నిలుస్తున్నాయి. ఈ సమర్పణ భావం దేశం లోని ప్రతి ఒక్క రాష్ట్రాని కి మరియు ప్రతి ఒక్క కేంద్ర పాలిత ప్రాంతాని కి చెందుతుంది; ఈ సమర్పణ భావం దేశం లో వేలాది ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రైవేటు ఆసుపత్రుల కు చెందుతుంది; ఈ సమర్పణ భావం ప్రతి ఒక్క ఉద్యోగి కి, ప్రతి ఒక్క వైద్య వృత్తి అభ్యాసకుడుఅభ్యాసకురాలి కి, ప్రతి ఒక్క ఆయుష్మాన్ మిత్ర కు, ఆశా కార్యకర్తల కు, సాంఘిక సంస్థల కు, ప్రజా ప్రతినిధుల కు.. అంటే దాదాపు గా ప్రతి ఒక్కరి కి చెందుతుంది.
సోదరీమణులు మరియు సోదరులారా,
ఈ రోజు న ఈ సమర్పణ భావం కారణం గానే, దేశ ప్రజలు విశ్వాసం తోను, గర్వం తోను, ‘సాల్ ఏక్, ఆయుష్మాన్ అనేక్’ అని నినదిస్తున్నారు.
దేశం అంతటా 46 లక్షల పేద కుటుంబాల సభ్యుల కు వ్యాధుల తాలూకు నిరాశ నుండి ఒక ఆరోగ్యదాయకమైన జీవనం యొక్క ఆశ ను కల్పించడం అనేది నిజం గా ఒక గొప్ప కార్య సాధన. ఈ ఒకటో సంవత్సరం లో ఏ వ్యక్తి కి చెందిన భూమి గాని, ఇల్లు గాని, లేదా ఆభరణాలు గాని, లేదా మరే వస్తువు ను అయినా గాని ఏ వ్యాధి తాలూకు చికిత్స ఖర్చుల ను భరించడం కోసమో విక్రయించడం, లేదా తనఖా పెట్టడం జరుగకుండా కాపాడిన పక్షం లో, అదుగో అటువంటప్పుడు భారతదేశం లో ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ఒక గొప్ప సఫలత ను సాధించినట్లే భావించవచ్చును.
మిత్రులారా,
కొద్దిసేపటి క్రితం కొందరు లబ్ధిదారుల తో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. గడచిన ఒక సంవత్సర కాలం లో, ఎన్నికల వేళ కూడాను దేశవ్యాప్తం గా ఆ కోవ కు చెందిన మిత్రుల తో సంభాషించడానికి నేను నిరంతరమూ ప్రయత్నం చేస్తూ వచ్చాను. వారి తో మాట్లాడిన తరువాత ఎవరైనా పేదల జీవితాల లో ఆయుష్మాన్ భారత్- ‘పిఎంజెఎవై’ ఏ విధమైన మార్పుల ను తీసుకు వస్తున్నదీ గ్రహించ గలుగుతారు. మరి ఒక రకంగా ‘పిఎంజెఎవై’ ఇప్పుడు పేద ల జయ్ లేదా విజయం వలె మారిపోయింది. పేదల కుటుంబాల లోని పిల్లలు స్వస్థులు గా ఉన్నప్పుడు, పరివారం లో ఏకైక ఆర్జనపరుడు/ఆర్జనపరురాలు ఆరోగ్యవంతులై విధుల కు తిరిగి హాజరు అయినప్పుడు, అదుగో అటువంటప్పుడు ఆరోగ్యం గా ఉండడం అంటే ఏమిటో ఒక వ్యక్తి అర్థం చేసుకోగలుగుతారు. మరి ఆయుష్మాన్ భారత్ ‘పిఎంజెఎవై’ యొక్క విజయాని కి సమర్పితులైన మరియు శ్రద్ధాళువులైనటువంటి వ్యక్తుల కు మరియు సంస్థల కు దేశం లోని కోట్లాది పేద ప్రజల శుభాశీస్సులు కూడా లభిస్తాయి. ఈ మహత్కార్యం లో పాలు పంచుకొంటున్న ప్రతి ఒక్క భాగస్వామి కి నేను నా అభినందనల ను తెలియజేస్తున్నాను.
సోదరీమణులు మరియు సోదరులారా,
ఈ ఒకటో సంవత్సరంలో దృఢ సంకల్పంతోను, సమర్పణ భావంతోను మనం అనుభవ రీత్యా ఎంతో నేర్చుకొన్నాము. నేను ఇక్కడ కు వచ్చే ముందే ఒక ప్రదర్శన లో ఒక సంవత్సరపు ప్రస్థానాన్ని గురించి తెలుసుకొన్నాను. ఆ ప్రదర్శన మనం కాల క్రమం లోప్రతి ఒక్క సవాలు ను మనం అధిగమించిన తీరు ను, సాంకేతిక విజ్ఞానం పరం గా నిరంతర ప్రాతిపదిక న సాధించిన విస్తరణ ను, ప్రతి ఒక్క సంబంధిత వ్యక్తి తో నిరంతర ప్రాతిపదిక న కమ్యూనికేశన్ కలిగివుండడాన్ని కళ్ళ కు కట్టడం తో పాటు భయానుమానాల ను తొలగించింది. నేర్చుకొనే, చర్చించే మరియు మెరుగులు దిద్దుకొనే ప్రక్రియ అంతరాయం లేకునండా కొనసాగుతూనేవుంటుంది.
మిత్రులారా,
ఈ పథకం యొక్క పర్యవేక్షణ ను మరియు వ్యాప్తి ని మరింత ప్రభావవంతం గా ఎలాగ తీర్చి దిద్దవచ్చు; దీని ని లబ్ధిదారుల కు సులభతరం గా ఏ విధం గా మార్చవచ్చు; ఆసుపత్రుల లో సమస్యల ను ఎలా అధిగమించవచ్చు.. ఈ అంశాల ను అన్నిటి ని
గడచిన రెండు రోజులు గా ఇక్కడ సుదీర్ఘం గా చర్చించడమైంది. నాణ్యత మొదలుకొని కెపాసిటీ బిల్డింగ్ వరకు పలు అంశాల పై విస్పష్టమైన అభిప్రాయాల ను వెల్లడించుకోవడం జరిగింది. కొన్ని రాష్ట్రాలు వాటి అనుభవాల ను ప్రత్యేకించి సార్వజనిక ఆరోగ్య సంరక్షణ ను అందించడానికి సంబంధించి గాని లేదా ఈ పథకం యొక్క పరిధి ని ప్రతి ఒక్క కుటుంబాని కి ఏ విధంగా వర్తింప జేయవచ్చో అనే విషయాల కు సంబంధించి వాటి యొక్క ఆలోచనలను పంచుకొన్నాయి. వీటి ని గంభీరం గా పరిగణన లోకి తీసుకోవాలి మరి. ప్రతి ఒక్క పేద వ్యక్తి కి, ప్రతి ఒక్క పౌరునికి/పౌరురాలి కి కష్ట కాలం లో ఆసుపత్రి తలుపుల ను తెరచి ఉంచి, వారి కి ఉత్తమ చికిత్స ను అందుబాటు లోకి తీసుకు వచ్చేటట్లు చూడవలసిన బాధ్యత మన అందరి మీదా ఉంది.
సోదరీమణులు మరియు సోదరులారా,
ఆయుష్మాన్ భారత్ అనేది ‘న్యూ ఇండియా’ యొక్క విప్లవాత్మకమైన నిర్ణయాల లో ఒకటి గా ఉంది. ఇది దేశం లోని పేదల జీవితాలను మరియు సామాన్యుల జీవితాల ను కాపాడడం లో ఒక ముఖ్య పాత్ర ను పోషించడం ఒక్కటే కాకుండా భారతదేశాని కి ప్రాతినిధ్యం వహిస్తున్న 130 కోట్ల మంది ప్రజల యొక్క బలానికి మరియు సమష్టి సంకల్పాని కి ఒక సంకేతం గా కూడా నిలుస్తోంది. ఈ కారణం గానే నేను అంటున్నాను.. మన దేశం లో పేదల కు చౌక గా ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ సేవల ను కల్పించడం కోసం ఇదివరకు కూడా ప్రయత్నాలు జరిగాయి అని. ప్రతి ఒక్క రాష్ట్రం మరియు ప్రతి ఒక్క కేంద్ర పాలిత ప్రాంతం వాటి వాటి స్థాయిల లో చేయగలిగినది అంతా చేశాయి. రాష్ట్రాలు వ్యక్తం చేసిన సదుద్దేశం అలా ఉన్నప్పటికీ, పేద ప్రజలు లబ్ధి ని పొందుతూ ఉండటం గాని, లేదా వైద్య మౌలిక సదుపాయాల రంగం లో ఎటువంటి మెరుగుదల గాని చోటు చేసుకోలేదు. అయితే ఆయుష్మాన్ భారత్ భారతదేశం యొక్క ఉమ్మడి శక్తి ని వినియోగం లోకి తీసుకు వచ్చిన ప్రతి సారి దాని యొక్క లబ్ధి విశేష ప్రభావాన్ని కనబరుస్తుందని రుజువు చేసింది. ఆయుష్మాన్ భారత్ ఇదివరకు అసాధ్యం గా భావించిన దేశం లోని ఏ ప్రాంతాని కి చెందిన రోగుల కు అయినా సరే ప్రయోజనాన్ని అందించవచ్చని నిరూపించింది. ఈ కారణం గానే గడచిన ఒక సంవత్సర కాలం లో దాదాపుగా 50 వేల మంది ఈ పథకం తాలూకు లాభాన్ని ఇతర రాష్ట్రాల లో, అంటే వారి రాష్ట్రాని కి వెలుపల, ఒక మంచి ఆసుపత్రి లో వైద్యాన్ని అందుకోగలిగారు.
సోదరీమణులు మరియు సోదరులారా,
దేశం లోని ఏ వ్యక్తి అయినా- తప్పనిసరి పరిస్థితుల లో మినహా – చికిత్స కోసం అతడి యొక్క లేదా ఆమె యొక్క నివాసాన్ని, జిల్లా ను లేదా రాష్ట్రాన్ని దాటి పోవాలని కోరుకోబోరు. ప్రతి ఒక్క రాష్ట్రం దేశం లోని ప్రతి ఒక్క పౌరుడి కి గాని లేదా పౌరురాలి కి గాని వారి ఇంటి కి దగ్గర లోనే ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ను కల్పించడం కోసం కృషి చేస్తున్నది. ఆరోగ్య సంబంధిత సౌకర్యాలు మెరుగు గా ఉన్నటువంటి ప్రాంతాల లో మరింత ఒత్తిడి ఉందన్న మాట కూడా నిజమే. అయితే, దేశం లోని ఏ ఒక్క పౌరుడు, ఏ ఒక్క పౌరురాలు ఆధునిక ఆరోగ్య సంరక్షణ సేవల కు దూరం గా ఉండిపోకుండా చూడవలసిన బాధ్యత భారతదేశం లోని ప్రతి ఒక్కరి మీదా ఉంది. ఈ అంశాన్నే ఆయుష్మాన్ భారత్ నొక్కి వక్కాణిస్తోంది.
మిత్రులారా,
ఆయుష్మాన్ భారత్ అనేది యావత్తు భారతదేశాని కి మరియు ఒక స్వాస్థ్య భారత్ కు ఒక సంపూర్ణ పరిష్కార మార్గం గా ఉన్నది. ఇది భారతదేశం యొక్క సమస్యల ను మరియు సవాళ్ళ ను పరిష్కరించడం కోసం ఒక ఆలోచన ను ఒంటరి గా చేసేందుకు బదులు కలసికట్టుగా, సమగ్రమైన రీతి లో ఆలోచించాలి అనే దిశ గా ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి కి అనుగుణం గా ఉన్నది. కొద్ది రోజుల క్రితం ఐక్య రాజ్య సమితి లో సార్వజనిక ఆరోగ్య సంరక్షణ ను గురించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించ గా ఆ కార్యక్రమం లో భారతదేశాన్ని గురించి మాట్లాడే అవకాశం నాకు లభించింది. భారతదేశం లో ఆరోగ్య సంరక్షణ కు సంబంధించి సంపూర్ణ విధానాన్ని అనుసరిస్తున్న తీరు ను గురించి, అలాగే కృషి జరుగుతున్న విస్తృత స్థాయి ని గురించి తెలుసుకొన్న ప్రపంచం అబ్బుర పడి, ఆశ్చర్యచకితురాలు కూడా అయింది.
సోదరీమణులు మరియు సోదరులారా,
మనం నాలుగు బలమైన స్తంభాల ఆధారం గా ఒక స్వస్థ భారతదేశాన్ని నిర్మిస్తున్న విధం గురించి ప్రపంచం నలు మూలల నుండి తరలి వచ్చిన ప్రతినిధుల కు నేను వివరించాను. ఆ నాలుగు స్తంభాలు ఏవేవంటే- వాటి లో ఒకటోది ముందు జాగ్రత్త చర్యల తో కూడినటువంటి ఆరోగ్య సంరక్షణ; రెండోది తక్కువ ఖర్చు లో ఆరోగ్య సంరక్షణ; మూడోది సరఫరా వైపు నుండి చేపట్టిన సంస్కరణలు కాగా నాలుగోది జాతీయ పోషణ ప్రచార ఉద్యమం వంటి ఉద్యమ తరహా కార్యక్రమాలు.
ఒకటో స్తంభాన్ని గురించి మనం చర్చించుకొంటే ప్రస్తుతం స్వచ్ఛత, యోగ, ఆయుష్, టీకాలు వేయడం, ఇంకా దేహ దారుఢ్యం ల విషయం లో శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేయడం జరుగుతోంది. తత్ఫలితం గా, వ్యాధుల బారిన పడడాన్ని తగ్గించుకోవచ్చును. అంతేకాకుండా పశువుల వల్ల వ్యాపించే వ్యాధులు మనుషుల కు సైతం ఇక్కట్ల ను కొని తెస్తాయి. కాబట్టి, ఈ మారు మేము భారతదేశాన్ని పశువుల లో సోకే గాలికుంటు వ్యాధి బారి నుండి విముక్తం చేయడం కోసం ఒక కార్య భారాన్ని ఉద్యమ తరహా లో చేపట్టాము. దీనికి అర్థం మేము పశువుల పట్ల సైతం జాగ్రత్తలు తీసుకొంటున్నాము; వాటిని మరచి పోలేదు అని చెప్పడమన్న మాట.
అక్కడ నేను మరొక స్తంభాన్ని గురించి కూడా తెలియజెప్పాను. ఆ రెండో స్తంభం ఏది అంటే దేశం లోని సామాన్య మానవుడు ఉత్తమమైనటువంటి మరియు తక్కువ ఖర్చు తో కూడినటువంటి ఉపచారాన్ని పొందేటట్లు చూసేందుకు అదే పని గా జరుగుతున్న ప్రయత్నాలు.
సోదరీమణులు మరియు సోదరులారా,
ఈ రెండు స్తంభాల కు ఆయుష్మాన్ భారత్ పథకం గొప్ప ఉత్తేజాన్ని అందిస్తోంది. అది.. దేశం అంతటా 1.50 లక్షల కు పైగా హెల్త్ ఎండ్ వెల్నెస్ సెంటర్ ల నిర్మాణం కావచ్చు లేదా ప్రతి సంవత్సరం అయిదు లక్షల రూపాయల వరకు విలువైన రోగ చికిత్స సదుపాయాన్ని ఉచితం గా కల్పించడం కావచ్చు.. ఆయుష్మాన్ భారత్ పోషిస్తున్నటువంటి పాత్ర ముఖ్యమైంది.
మిత్రులారా,
ఆయుష్మాన్ భారత్ మన మూడో స్తంభం అయినటువంటి సరఫరా పక్షాన్ని కూడా బలోపేతం చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ వల్ల దేశం లో ఆరోగ్య సంరక్షణ సేవల గిరాకీ పెరిగింది. ఇదివరకు ఎన్నడూ రోగ చికిత్స గురించి ఆలోచన అయినా చేయనటువంటి పేద రోగులు ప్రస్తుతం ఆసుపత్రి కి వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల లో చికిత్స చేయించుకొంటామని వారు ఎన్నడూ ఊహించి ఉండరు. ప్రస్తుతం ‘పిఎంజెఎవై’ సేవల ను అందిస్తున్న 18,000కు పైగా ఆసుపత్రుల లో సుమారు గా 10,000 ఆసుపత్రులు అంటే, ఆ తరహా ఆసుపత్రుల లో సగానికి పైగా ఆసుపత్రులు, ప్రైవేటు రంగం లో ఉన్నాయి. ఈ ప్రాతినిధ్యం మునుముందు ఇంకా అధికం కానుంది.
మిత్రులారా,
డిమాండు పెరుగుతున్న కొద్దీ దేశం లోని చిన్న నగరాల లో అధునాతనమైన వైద్య సంబంధిత మౌలిక సదుపాయాల విస్తృతి కూడా పెరుగుతుంది. భవిష్యత్తు లో అనేక నూతన వైద్య శాలలు ఏర్పాటు కానున్నాయి. కొత్త కొత్త ఉపాధి అవకాశాలు కూడా పుట్టకు వస్తాయి. ఒక అంచనా ఏమిటంటే, కేవలం ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల ఏర్పడ్డ డిమాండ్ కారణం గానే రాగల 5- 7 సంవత్సరాల కాలం లో రమారమి 11 లక్షల కొత్త కొలువులు అందివస్తాయి అని. దీని కన్నా ఎక్కువ సంఖ్య లో నౌకరీల ను ఒక్క రైల్వే ల రంగం మాత్రమే ఇస్తుందన్న వాస్తవాన్ని ఎవరైనా గమనిస్తే ఇది ఎంత భారీ సంఖ్యో అర్థం చేసుకోవచ్చును.
సోదరీమణులు మరియు సోదరులారా,
ఈ ఉద్యోగావకాశాల ను అందుకోవడం కోసం మన యువ నేస్తాల కు శిక్షణ ను ఇప్పించడం చాలా ముఖ్యం. ఈ కారణం గానే వైద్య విద్య కు సంబంధించిన మౌలిక సదుపాయాల ను విస్తరించడం తో పాటు, సంబంధిత విధానాన్ని ఎప్పటికప్పుడు మార్పు చేయడం జరుగుతోంది. ఒక పక్క వైద్య విద్య బోధన లో సీట్ల సంఖ్య ను పెంచడం తో పాటు మరో పక్క ప్రవేశాలు మొదలుకొని నియంత్రణ వరకు నిరంతరాయమైనటువంటి మరియు పారదర్శకమైనటువంటి ఏర్పాట్ల ను చేయడం జరుగుతోంది. అది.. దేశవ్యాప్తం గా 75 నూతన ప్రభుత్వ వైద్య కళాశాల లను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం కావచ్చు, లేదా దేశం లో కొత్త గా నేశనల్ మెడికల్ కమిశన్ ను స్థాపించడం కావచ్చు.. వైద్యరంగం లబ్ధి ని పొందబోతోందనేది తథ్యం.
నేశనల్ మెడికల్ కమిశన్ దేశం లో వైద్య విద్య యొక్క విస్తృతి ని వేగవంతం చేయడంతో పాటు వైద్య విద్య యొక్క నాణ్యత కు మెరుగులు కూడా దిద్దుతుంది. అంతేకాక అవినీతి ని అరికడుతుంది కూడాను.
మిత్రులారా,
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వినియోగదారుల కు మైత్రీపూర్వకం గా మలచడం కోసం మరియు దాని ని ఎటువంటి లోటుపాటుల కు తావులేనిది గా తీర్చిదిద్దడం కోసం అదే పని గా కృషి జరుగుతోంది. దీనితో ముడిపెట్టిన ఐటి వ్యవస్థ ను ‘పిఎంజెఎవై 2.0’ స్థాయి కి మెరుగుపరచడం తో పాటు, ఎప్పటికప్పుడు స్థాయి ని పెంచే ప్రయత్నాలు అదే పని గా కొనసాగుతున్నట్లు నాతో చెప్పారు. ఇవాళ ఆరంభమైన యాప్ లబ్ధిదారుల కు ఎంతగానో సహాయ పడుతుంది. అయితే, ఈ పథకాన్ని మరింత ప్రభావశీలమైందిగాను, మరింత సమగ్రమైందిగాను మార్చడం కోసం మనకు మరిన్ని సాంకేతిక పరిష్కార మార్గాలు అవసరపడువుతాయి. ఆయుష్మాన్ భారత్ లో వేరు వేరు భాగాలు కలసి ఉన్నాయి. కాబట్టి, ఈ భాగాల ను అన్నింటినీ ముడివేయడం కోసం సమర్ధమైనటువంటి మరియు అందుబాటు లో ఉండేటటువంటి ఒక వ్యవస్థ కావాలి. రోగ నిర్ధారణ, రెఫరల్, ఇంకా తదుపరి సంరక్షణ సేవలు మొదలుకొని హెల్త్ ఎండ్ వెల్నెస్ సెంటర్ ల నుండి ప్రధాన ఆసుపత్రుల లో ఆపరేశన్ థియేటర్ ల వరకు మనం సాంకేతికత ఆధారం గా అభివృద్ధి పరచుకోవలసి ఉంది. గ్రామం లో కొలువుదీరిన హెల్త్ ఎండ్ వెల్నెస్ సెంటర్ లలో పేరు నమోదు చేసుకొన్న ఏ వ్యక్తి తాలూకు ఆరోగ్య సమాచారాన్ని అయినా తీసుకొని సదరు వ్యక్తి రోగ నిర్ధారణ కు ఉపయోగించే స్థితి కి మనం చేరుకోవాలి. పెద్ద ఆసుపత్రుల కు వెళ్ళవలసింది గా రోగి కి సూచించినప్పుడు, ఈ సమాచారం తరువాత తరువాత ఆ రోగి కి అందించే చికిత్స విషయం లో ఒక ప్రభావశీలమైనటువంటి పాత్ర ను పోషించగలుగుతుంది. దీని కోసం మనమందరమూ ఆలోచించాలి.
మిత్రులారా,
నేడు ప్రారంభించబడినటువంటి పిఎంజెఎవై స్టార్ట్-అప్ గ్రాండ్ చాలింజ్ ఒక చెప్పుకోదగిన పాత్ర ను పోషించనుంది. మరి మానవాళి కోసం ఉద్దేశించిన ఈ కార్యభారాన్ని వహించవలసింది గా దేశం లోని యువ శక్తి కి, ప్రత్యేకించి ఐటి వృత్తి నిపుణుల కు నేను విజ్ఞప్తి ని చేస్తున్నాను. వారు ఈ సవాలు ను స్వీకరించి, భవిష్యత్తు లో ఒక ఉత్తమ పరిష్కార మార్గం తో ముందుకు రావాలి. దేశ ఆరోగ్య రంగం లో కృషి చేస్తున్న స్టార్ట్-అప్ లను దీని కోసం ఆయుష్మాన్ భారత్ తో జోడించడం జరుగుతోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అంటూ దేశం లోని నూతన ఆవిష్కర్తల కు మరియు యువ నవ పారిశ్రామికవేత్తల కు నేను మరొక్కమారు విజ్ఞప్తి చేస్తున్నాను.
సోదరీమణులు మరియు సోదరులారా,
‘న్యూ ఇండియా’ యొక్క ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యావత్తు ప్రపంచాని కి ఒక ఉదాహరణ గా నిలవబోతోందనేది సత్యం. ఈ దిశ గా ఆయుష్మాన్ భారత్ యోజన సైతం ఒక ప్రధానమైన పాత్ర ను పోషిస్తుంది. మన దేశం లో కోట్లాది ప్రజల ను స్వస్థులు గా మార్చాలన్న మన నిబద్ధత మరింత పటిష్టం అవుతుందని, మన ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయని నేను ఆశ పడుతున్నాను. ఈ అపేక్ష తో మీకు అందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షల ను, అలాగే ధన్యవాదాల ను కూడా తెలియజేస్తున్నాను.
**
Prime Minister Shri Narendra Modi will preside over the valedictory function of Arogya Manthan at Vigyan Bhawan today. Arogya Manthan is a two-day event organized by the National Health Authority, to mark the completion of one year of Ayushman Bharat PM-JAY.
— PMO India (@PMOIndia) October 1, 2019
A new mobile application of Ayushman Bharat will be launched by the Prime Minister at the venue. He will also launch the ‘Ayushman Bharat Start-Up Grand Challenge’ and will release a commemorative stamp on the occasion.
— PMO India (@PMOIndia) October 1, 2019
Prime Minister will interact with select beneficiaries of Ayushman Bharat PM-JAY. He will visit the exhibition on PM-JAY which will showcase the journey of the scheme over the past one year.
— PMO India (@PMOIndia) October 1, 2019
The purpose of the Arogya Manthan is to provide a platform to meet for all the important stakeholders of PM-JAY to meet and discuss the challenges faced in the implementation of the scheme in the past year and to forge new understanding and pathways to improving implementation.
— PMO India (@PMOIndia) October 1, 2019
स्वस्थ भारत को चार मजबूत स्तंभों पर खड़ा किया जा रहा है। pic.twitter.com/EX3jEaQAAJ
— Narendra Modi (@narendramodi) October 1, 2019
आयुष्मान भारत, नए भारत के क्रांतिकारी कदमों में से एक है। सिर्फ इसलिए नहीं क्योंकि ये देश के सामान्य मानवी के, गरीब के जीवन को बचाने में अहम भूमिका निभा रही है, बल्कि इसलिए भी क्योंकि ये भारत के 130 करोड़ लोगों के सामूहिक संकल्प और सामर्थ्य का भी प्रतीक है। pic.twitter.com/JmXf95dj5r
— Narendra Modi (@narendramodi) October 1, 2019
In the years to come, we are making Ayushman Bharat even more people friendly. Today, we launched a mobile App that will help beneficiaries. The PM-JAY Start-up Challenge will give opportunities to youngsters to further innovation in healthcare. pic.twitter.com/pxaZnIs6nt
— Narendra Modi (@narendramodi) October 1, 2019
आयुष्मान भारत का ये पहला वर्ष- संकल्प का रहा है, समर्पण का रहा है, सीख का रहा है। pic.twitter.com/N7lo8znNne
— Narendra Modi (@narendramodi) October 1, 2019