Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆరోగ్య రంగంలో స‌హ‌కారానికి గాను భార‌త‌దేశానికి, ఇండోనేశియా కు మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


ఆరోగ్య స‌హ‌కారం అంశం పై భార‌త‌దేశానికి, ఇండోనేశియా కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎంఒయు) పై సంత‌కాల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

దిగువన పేర్కొన్న రంగాల‌లో స‌హ‌కారానికి ఈ ఎంఒయు రంగాన్ని సిద్ధం చేస్తుంది:-

ఎ) ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి, యాక్టివ్ ఫార్మాస్యూటిక‌ల్ ఇంగ్రీడియంట్స్ (ఎపిఐ) మ‌రియు ఐటి-ఆధారిత‌మైన వైద్య సామ‌గ్రి;

బి) మాన‌వ వ‌న‌రుల వికాసం;

సి) ఆరోగ్య సేవ‌లు; ఇంకా

డి) ప‌ర‌స్ప‌రం అంగీకారం కుదిరే మేర‌కు మ‌రేదైనా రంగం.

స‌హ‌కారం తాలూకు వివ‌రాల‌ను మ‌రింత విస్తృతపరచుకోవ‌డానికి, అలాగే ఈ ఎంఒయు యొక్క అమ‌లు ను ప‌ర్య‌వేక్షించ‌డానికి ఒక కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు.

**