Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆర్థిక బంధం చాలా కీలకం

ఆర్థిక బంధం చాలా కీలకం

ఆర్థిక బంధం చాలా కీలకం

ఆర్థిక బంధం చాలా కీలకం

ఆర్థిక బంధం చాలా కీలకం

ఆర్థిక బంధం చాలా కీలకం

ఆర్థిక బంధం చాలా కీలకం

ఆర్థిక బంధం చాలా కీలకం

ఆర్థిక బంధం చాలా కీలకం

ఆర్థిక బంధం చాలా కీలకం

ఆర్థిక బంధం చాలా కీలకం

ఆర్థిక బంధం చాలా కీలకం

ఆర్థిక బంధం చాలా కీలకం

ఆర్థిక బంధం చాలా కీలకం

ఆర్థిక బంధం చాలా కీలకం


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం యూకే ప్రధాని శ్రీ డేవిడ్ కామెరాన్తో సమావేశమయ్యారు. బ్రిటన్ ప్రధాని నివాసం చెకర్స్ (అధికారిక గ్రామీణనివాసం)లో వీరిద్దరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని శ్రీ మోదీ ఓక్ మొక్కను నాటారు. ఇరువురు నేతలు బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం ప్రధాని శ్రీ మోదీ, ప్రధాని శ్రీ కామెరాన్లు యూకే-భారత్ సీఈఓ సదస్సులో పాల్గొన్నారు. భారత భవిష్యత్పై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను తన ప్రారంభోపన్యాసంలో ప్రధాని కామెరాన్ ప్రస్తావించారు. అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ – ఇరుదేశాల చారిత్రక సంబంధాలను, పరస్పర పూరకాలను ప్రస్తావించారు. రెండుదేశాల సంబంధాల్లో ఆర్థిక బంధాలు అత్యంత కీలకమైనవని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘మేకిన్ ఇండియా ‘ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా శ్రీ మోదీ గుర్తు చేశారు. మౌలిక సదుపాయాల కల్పన, వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవటం, 2022కల్లా 50 మిలియన్ల కొత్త ఇళ్ళనిర్మాణం, 175 గిగావాట్ల సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి తదితరాంశాలను ఆయన నొక్కిచెప్పారు. బ్రిటిష్ కంపెనీలు భారత్లో పెట్టే పెట్టుబడులు ఇరుదేశాలకూ ప్రయోజనకారిగా ఉంటాయన్నారు.

ప్రధాని శ్రీ మోదీని బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురూ బహుమతులను ఆదానప్రదానం చేసుకున్నారు.

అపూర్వ భిన్నత్వమే భారతావని ప్రత్యేకత, ఖ్యాతి, ప్రతిష్ట, బలమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బ్రిటన్ ప్రధానమంత్రి శ్రీ డేవిడ్ కామెరాన్ సమక్షంలో వెంబ్లీ స్టేడియంలో సమావేశమైన అశేష బ్రిటిష్-భారత్ సమాజాన్ని ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగించారు. సిక్కు సమాజం, భారత సూఫీ సంప్రదాయాలు పోషించిన ఘనమైన పాత్రను, భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. లండన్లో సిక్కు సమాజ ప్రతినిధులతో అంతకుముందు జరిగిన తన భేటీని ప్రస్తావిస్తూ- వారి బాధను పంచుకున్నానన్నారు. వారి సమస్యలను అర్థం చేసుకున్నానని, వాటిని పరిష్కరించటానికి ప్రయత్నం చేస్తున్నానని హామీ ఇచ్చారు.

దాదాపు గంటకుపైగా సాగిన తన ప్రసంగంలో ప్రధాని మోదీ భవిష్యత్ భారత్పై తన దార్శనికతను వివరించారు. రాజస్థాన్ లోని అల్వర్ కు చెందిన ఇమ్రాన్ ఖాన్ విద్యకు సంబంధించి 50 యాప్లు తయారు చేసి అందరికీ ఉచితంగా పంచిపెట్టారని ప్రధాని గుర్తు చేశారు. అలాగే హర్యానాలోని ఓ సర్పంచ్ తానిచ్చిన బేటీ పడావో, బేటీ బచావో పిలుపునకు స్పందించి, ‘కూతురుతో సెల్ఫీ’ ప్రచారం మొదలెట్టారని, అది విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని ప్రధాని తెలియజేశారు. ‘భారత్ బంగారు భవిష్యత్పై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే నా భవిష్యత్ భారత్ 50 విద్య సంబంధ యాప్లను తయారు చేసి ఉచితంగా అందజేసిన ఇమ్రాన్ ఖాన్లది, బిడ్డతో సెల్ఫీలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేపట్టిన హర్యానా సర్పంచిలాంటివారిది. ఇలాంటి స్ఫూర్తి దాయక వ్యక్తులు భారత్లో లెక్కలేనంత మంది ఉన్నారు’ అని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తంజేశారు.

‘ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలు భారత్లో ఉన్నాయి. మచ్చుకు కాదు… భారీ జనాభాతోనే ఉన్నాయి’ అని శ్రీ మోదీ గుర్తు చేశారు. భారత సమాజం ఎక్కడికెళ్ళినా ఈ భిన్నత్వంలో ఏకత్వ విలువను వెంట తీసుకొని వెళుతుందని అంటూ, అందుకే వారంతా భారత్కు రాయబారులని శ్రీ మోదీ ప్రశంసించారు. ఇప్పటిదాకా భారత్లో తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రధాని వివరించారు. ముఖ్యంగా భారత ప్రజల జీవనాన్ని మార్చే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఇంధనం గురించి తెలిపారు. చౌకగా సౌర ఇంధన ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో అపారమైన సౌరశక్తిగల దేశాలన్నింటితో కలసి ‘సౌర బంధా’నికి భారత్ సారథ్యం వహించబోతోందని ప్రధాని శ్రీ మోదీ ప్రకటించారు. టీవీ తెరలపైనా, పత్రికల పతాకశీర్షికలపైన కన్పించేకంటే కూడా భారతావని చాలా విశాలమైన దేశమని ప్రధాని అన్నారు.