Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఆల్ ఇండియా టైగ‌ర్ ఎస్టిమేశ‌న్ – 2018’ నాలుగో ఆవృత్తి యొక్క ఫ‌లితాల‌ ను విడుద‌ల చేసిన ప్ర‌ధాన మంత్రి


ఈ రోజు గ్లోబ‌ల్ టైగ‌ర్ డే సంద‌ర్భం లో ‘ఆల్ ఇండియా టైగ‌ర్ ఎస్టిమేశ‌న్ – 2018’ యొక్క నాలుగో ఆవృత్తి తాలూకు ఫ‌లితాల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని లోక్ క‌ళ్యాణ్ మార్గ్ లో విడుద‌ల చేశారు.

 

భార‌త‌దేశం లో పులుల లెక్క 2018వ సంవ‌త్స‌రం లో 2967కు పెరిగినట్లు ఈ సర్వేక్షణ పేర్కొన్నది.

 

ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ ఘ‌ట‌న ను భార‌త‌దేశాని కి ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన‌టువంటి కార్య‌సాధ‌న గా అభివ‌ర్ణించారు.  పులుల సంత‌తి ని ప‌రిర‌క్షించే దిశ గా భార‌త‌దేశం యొక్క నిబ‌ద్ధ‌త ను ఇది పున‌రుద్ఘాటిస్తోంద‌న్నారు.  దీని ని సాధించ‌డం కోసం ఎంతో వేగం గా, స‌మ‌ర్ప‌ణ భావం తో సంబంధిత వివిధ వ‌ర్గాలు కృషి చేశాయంని ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు.  ‘సంక‌ల్ప్ సే సిద్ధి’ యొక్క అతి చ‌క్కని ఉదాహ‌ర‌ణ‌ల లో ఇది ఒకటి అని కూడా ఆయ‌న వర్ణించారు.  భార‌త‌దేశం లోని ప్ర‌జ‌లు ఏదైనా చేయాల‌ని నిర్ణ‌యించుకొన్నారంటే గనక ఆశించిన ఫ‌లితాల‌ ను పొంద‌కుండా వారి ని నిరోధించగలిగిన శ‌క్తి అంటూ లేదు అని ఆయ‌న ప్ర‌క‌టించారు.

 

దాదాపు 3000 పులుల‌ తో భార‌త‌దేశం ఈ రోజు న అతి పెద్ద‌ మ‌రియు అత్యంత భ‌ద్ర‌మైన నివాస స్థలాల్లో ఒక‌టి గా ఉంది అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

 

ముందు ఉన్న‌ ర‌హ‌దారి ‘‘ఏవో కొన్ని ఎంపిక‌లు’’ కాక ‘‘స‌మ‌ష్టి త‌త్వం’’ అని శ్రీ న‌రేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు.  ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కు స్థూల ప్రాతిప‌దిక క‌లిగినటువంటి సంపూర్ణ దృష్టి కోణం అత్యవస‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు.  అభివృద్ధి కి మ‌రియు ప‌ర్యావ‌ర‌ణాని కి మ‌ధ్య ఒక ఆరోగ్య‌ప్ర‌ద‌మైన స‌మ‌తుల్య‌త ను సాధించ‌డం కుదిరే ప‌నే అని ఆయ‌న చెప్పారు.  ‘‘మ‌న విధానాల లో, మ‌న ఆర్థిక అంశాల లో, మ‌నం సంర‌క్ష‌ణ తాలూకు సంభాష‌ణ ను మార్పు చేసుకోవ‌ల‌సివుంది’’ అని ఆయ‌న అన్నారు.

 

భార‌త‌దేశం మ‌న పౌరుల కోసం మ‌రిన్ని గృహాల‌ ను నిర్మించ‌నుంది.  అదే కాలం లో జంతు జాలం కోసం నాణ్య‌మైన నివాస స్థలాల ను ఏర్ప‌ర‌చ‌నుంది.  భార‌త‌దేశం లో ఒక హుషారైన‌ స‌ముద్ర సంబంధి ఆర్థిక వ్య‌వ‌స్థ తో పాటు ఒక స్వ‌స్థ సాగ‌ర సంబంధిత ప‌ర్యావ‌ర‌ణం నెల‌కొనగలవు.  ఈ స‌మ‌తుల్య‌తే ఒక బ‌ల‌మైన మ‌రియు స‌మ్మిళిత‌మైన భార‌త‌దేశాని కి తోడ్పాటు ను అందిస్తుంది అని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

PM India

 PM India

భార‌త‌దేశం ఆర్థికం గాను, ప‌ర్యావ‌ర‌ణ ప‌రం గాను స‌మృద్ధం అవుతుంది.  భార‌త‌దేశం మ‌రిన్ని ర‌హ‌దారుల‌ ను నిర్మిస్తుంది.  అలాగే, భార‌త‌దేశం ప‌రిశుభ్ర‌మైన న‌దీ వ‌న‌రుల‌ ను  క‌లిగివుంటుంది.  భార‌త‌దేశం ఘ‌న‌తరమైన వృక్ష జాలాన్ని మరియు మ‌రింత ఉత్త‌మ‌మైన రైలు మార్గ సంధానాన్ని కూడా ఇది క‌లిగి ఉంటుంది.

 

గ‌డ‌చిన అయిదు సంవ‌త్స‌రాల కాలం లో త‌దుప‌రి త‌రం మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం చేప‌ట్ట‌వ‌ల‌సిన ప‌నులు వేగ‌వంత‌మైన రీతిన సాగాయ‌ని, దేశం లో వ‌న విస్తీర్ణం కూడా పెరిగింద‌ని ఆయ‌న చెప్పారు.  ‘‘ర‌క్షిత ప్రాంతాల’’లో కూడా పెంపుద‌ల ఉంద‌న్నారు.  2014వ సంవ‌త్సరం లో 692 ర‌క్షిత ప్రాంతాలు ఉండ‌గా, 2019వ సంవ‌త్స‌రానికి ఇవి 860కి పైగా పెరిగాయి.  ‘‘క‌మ్యూనిటీ రిజ‌ర్వ్ స్’’ కూడాను 2014 లో 43 నుండి ప్ర‌స్తుతం 100 కు పైగా పెరిగాయి.

 

 

భార‌త‌దేశం త‌న ఆర్థిక వ్య‌వ‌స్థ ను ‘‘ప‌రిశుద్ధ ఇంధ‌న ఆధారిత‌ం’’గా, ‘‘న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి ఆధారిత‌ం’’గా రూపుదిద్దుకోవ‌డానికి నిలుక‌డత‌నం తో కూడిన కృషి ని సాగిస్తోంది అని ఆయ‌న అన్నారు.  ‘‘వ్య‌ర్థాన్ని’’ మ‌రియు ‘‘బ‌యో-మాస్’’ ను భార‌త‌దేశ శ‌క్తి భ‌ద్ర‌త లో ఒక ప్ర‌ధాన భాగం గా చేయ‌డం జ‌రుగుతోంది అని ఆయ‌న చెప్పారు.  ఎల్ పిజి కనెక్షన్ ల కోసం ‘‘ఉజ్జ్వ‌ల’’ను, ఎల్ ఇడి బల్బుల కోసం ‘‘ఉజాలా’’ ప‌థ‌కాలను తీసుకురాగా ఆ పథకాల్లో చోటు చేసుకున్న పురోగ‌తి ని గురించి ఆయ‌న వివరించారు. 

 

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, పులుల సంర‌క్ష‌ణ దిశ గా మ‌రిన్ని ఘ‌నత‌ర ప్ర‌య‌త్నాలు సాగాలంటూ పిలుపునిచ్చారు. 

 

ఈ కార్య‌క్ర‌మం లో కేంద్ర పర్యావరణం, అడవులు మ‌రియు జల వాయు పరివర్తన శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్,  పర్యావరణం, అడవులు మరియు జల వాయు పరివర్తన శాఖ సహాయ మంత్రి శ్రీ బాబుల్ సుప్రియో, ప‌ర్యావ‌రణం, అడ‌వులు మ‌రియు జ‌ల‌వాయు ప‌రివ‌ర్త‌న శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ సి.కె. మిశ్ర  పాల్గొన్నారు.

 

 

**