పిఎంఇండియా
తాన్ శ్రీ దాతో డాక్టర్ మహమ్మద్ మునీర్ అబ్దుల్ మజీద్, ఆసియాన్ వ్యాపార సలహా మండలి చైర్మన్ గారు,
దాతో రమేశ్ కొడ్డామల్, ఆసియాన్ – ఇండియా వ్యాపార మండలి కో-చైర్మన్ గారు,
ఆసియాన్ వ్యాపార నాయకులు,
ఆసియాన్ వ్యాపార సమాజం సభ్యులు, సదస్సుకు హాజరైన అతిథులు,
సోదర సోదరీమణులారా,
మీతో కలసి వేదికను పంచుకోవడం నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది. ఆగ్నేయ ఆసియాను ప్రపంచంలోనే క్రియాశీలంగా మార్చిన నాయకులను ఉద్దేశించి ప్రసంగించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ‘ఒకే ఆసియాన్ సమాజం’ ఏర్పాటుకు ముందుకు వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.
భారత్, ఆసియాన్ లు సహజ భాగస్వాములు. మన బంధం పూర్వ కాలం నుంచి కొనసాగుతోంది. మన దేశాలు, ప్రాంతాల మధ్య వారధిని నిర్మించేందుకు అప్పటి నుండి ప్రయత్నం జరుగుతూనే ఉంది.
మిత్రులారా! 21వ శతాబ్దం ఆసియాదే అని నేను మొదటి నుంచి చెబుతున్నాను. ఆసియాన్ సభ్యత్వ దేశాల గత చరిత్ర కారణంగానే నేను ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను. ఆసియాన్‌లోని పది సభ్యత్వ దేశాలు కలసి ఉంటే ఆర్థిక శక్తిని ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటికే ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక కేంద్రాలలో ఒకటిగా ఆసియాన్ ఉద్భవించింది. పదిహేనేళ్లుగా మీ వేగవంతమైన, స్థిరమైన అభివృద్ధిని ప్రపంచం గమనిస్తోంది. మీ స్థూల ఆర్థిక స్థిరత్వమే ఆగ్నేయ ఆసియాలో స్థిరత్వానికి ప్రధాన కారణం. సుపరిపాలన, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు అనుసరిస్తున్న వ్యూహాలు, కొత్త తరం సాంకేతికత ద్వారా అద్భుతాలు సృష్టిస్తున్నారు.
పర్యాటకం వంటి సాధారణ విషయాలలోనూ మీరు అద్భుతాలను సృష్టిస్తున్నారు. అందుకే ఆసియాన్ దేశాల నాయకత్వానికి, ప్రజలకు మరోసారి అభినందనలు తెలుపుతున్నాను. ఆసియన్ దేశాల అద్భుతాన్ని విశ్లేషిస్తున్నపుడు, చిన్న దేశాలైన ఆసియాన్ దేశాలు, పెద్ద దేశమైన చైనా ఇద్దరూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు. అభివృద్ధి అనేది జనాభాను బట్టి కాదు, ప్రజల మనస్సును బట్టి ఉంటుందనేది దీనిని బట్టి అర్థమైంది. ఈ ప్రాంతంలోని చాలా మంది నేతలతో నాకు వ్యక్తిగత సంబంధాలున్నాయి. ఈ దేశాల్లోని చాలా ప్రాంతాలను.. నేను సందర్శించాను. నేను ప్రధాన మంత్రి బాధ్యతలు తీసుకున్నాక ఆసియాన్ దేశాల నాయకులతో చర్చలు ప్రారంభించాను. క్రితంసారి జరిగిన సదస్సులోనూ చాలా మంది ఆసియాన్ దేశాల నాయకులను కలుసుకున్నాను.
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. అంతకుముందు భారత ఆర్థిక వ్యవస్థ ఎదుట ఎన్నో సవాళ్లు కనిపించాయి. ఆర్థిక లోటు, కరెంట్ ఖాతా లోటు, నిరంతరం ద్రవ్యోల్బణ సమస్యలు, చాలా ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోతుండటం వంటి సమస్యలు ఎన్నో మా ముందు నిలచాయి.
ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే.. ఎలాంటి సంస్కరణలు రావాలి? వాటి లక్ష్యం ఎలా ఉండాలి? జీడీపీ రేటు పెంచితే సరిపోతుందా? లేక సమాజంలో పరివర్తన తీసుకురావాల్సిన అవసరం ఉందా ? అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ నా సమాధానం మాత్రం ఒక్కటే.. ‘పరివర్తన కోసం సంస్కరణ’ (రిఫార్మ్ టు ట్రాన్స్‌ఫార్మ్).
క్లుప్తంగా చెప్పాలంటే.. సంస్కరణలకు అంతం లేదు. సంస్కరణ అనేది.. సుదూర ప్రయాణంలో ఓ మజిలీ మాత్రమే. భారతదేశంలో పరివర్తనే సుదూర ప్రయాణం. భౌగోళికంగా అభివృద్ధి సాధించడం ద్వారా ప్రజల్లో మార్పు తీసుకు రావాలి. ఆకాశానికి దూసుకెళ్తూనే ప్రజల జీవితాలను స్పృషించాలి. ఆ తరువాత విడుదలైన ప్రతి ఆర్థిక సూచీలో 18 నెలలుగా దేశం మంచి స్థానంలో కనబడుతోంది.
• జీడీపీ పెరిగింది; ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది.
• విదేశీ పెట్టుబడులు పెరిగాయి; కరెంటు ఖాతా లోటు తగ్గింది.
• పన్ను ఆదాయం పెరిగింది; వడ్డీ రేట్లు తగ్గాయి.
• ఆర్థిక లోటు తగ్గింది. రూపాయి విలువ స్థిరంగా ఉంది.
ఇదంతా అనుకోకుండా జరిగిందేం కాదు. ఓ వైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది. మేం సాధించిన ఈ విజయం.. నిరంతరంగా మంచి ఆలోచనతో కూడిన పాలసీలను అమలు చేయటమే. ఆర్థిక ఏకీకరణ కోసం ప్రణాళికను ప్రారంభించాం. మొదటి సారిగా మేం ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి భారతీయ రిజర్వు బ్యాంకుతో మానిటరీ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం.
ఆర్థిక లోటును తగ్గించే క్రమంలో ప్రజల పెట్టుబడులను కూడా గణనీయంగా పెంచాం. ఇది రెండు పద్ధతులలో సాధ్యమైంది. ఒకటోది.. శిలాజ ఇంధనాలపై కార్బన్ పన్ను విధించాం. డీజిల్ ధరలను నియంత్రించటం ద్వారా సబ్సిడీలను తగ్గించేందుకు ధైర్యంగా ముందడుగేశాం. రెండోది.. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ పన్నులపై చర్చ జరుగుతుంటే.. మేం బొగ్గుపై 300 శాతం సెస్ విధించాం. సబ్సిడీలు దారి మళ్లకుండా లబ్ధిదారులకే అందేటట్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా అనవసర ఖర్చులను చాలామట్టుకు తగ్గించుకుంటున్నాం.
మొత్తంగా చూస్తే, దేశవ్యాప్తంగా, దేశం బయట భారత్‌పై విశ్వాసం పెరిగింది. ఇకపై భారత ఆర్థిక వ్యవస్థ మరింత దూసుకుపోనుందని.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ ఎమ్ ఎఫ్), ప్రపంచ బ్యాంకు విశ్వాసం వ్యక్తం చేశాయి. పెద్ద వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ ఆర్థిక వ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఇందని ఈ వారం ద ఎకనామిస్ట్ పత్రిక పేర్కొన్నది.
ఏదేమైనా మా లక్ష్యం కేవలం సంస్కరణలు చేపట్టడమే కాదు; సంస్కరణల ద్వారా పరివర్తనను తీసుకురావడం మా లక్ష్యం. స్థూల ఆర్థిక స్థిరత్వం అనేది చాలా ముఖ్యం. భారతదేశంలో పరివర్తనను తీసుకురావడానికి ఇంకా చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మేం వరుస ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఇందులో సంస్థాగత, నిర్మాణాత్మక సంస్కరణలు అనేకం ఉన్నాయి.
దేశంలో ఇప్పటికీ వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా ఉంది. ఈ రంగంలో మేం మామూలువే అయినా.. ప్రభావవంతమైన సంస్కరణలను తీసుకువచ్చాం. రసాయనాల ఉత్పత్తి కోసం ఎరువులకు సబ్సిడీలు ఇచ్చే పద్ధతి అంతక్రితం అమల్లో ఉండేది. దీనికి.. ఎరువుకు వేప పూతను పెట్టేలా ఓ సాధారణ పరిష్కారాన్ని ఆలోచించాం. ఇది సబ్సిడీల మళ్లింపునకు సరిపోలేదు. దీంతో సార్వత్రికంగా వేప పూతకు మేం సిద్ధమయ్యాం. దీని వల్ల ఇప్పటికే వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సిన వందల కోట్ల రూపాయల సబ్సిడీలు మిగిలాయి.
భూస్వాస్థ్య కార్డును ప్రవేశపెట్టాం. ఇది రైతు భూసారాన్ని తెలుసుకుని.. దానికి అనుగుణంగా పంటలు వేసుకునేందుకు ఇది దోహదపడుతుంది. దీని ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘అందరికీ ఇళ్లు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 3 కోట్ల ఇళ్లు.. మొత్తంగా 5 కోట్ల ఇళ్లు నిర్మిస్తున్నాం. ఇల్లు లేని భారతీయుడు ఉండొద్దనేదే మా పథకం ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు పథకం ద్వారా చాలా మంది పేదలకు ఉపాధి లభిస్తుంది.
రవాణా రంగంలోనూ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం తగ్గినా.. మా ప్రధాన నౌకాశ్రయాల్లో.. ట్రాఫిక్‌లో 4.65 శాతం వృద్ధి, నిర్వహణ ఆదాయంలో 11.2 శాతం వృద్ధి సాధించాం.
జాతీయ రహదారుల విస్తరణ వేగం రోజుకు 9 కిలోమీటర్ల (2013-14) నుంచి రోజుకు 23 కిలోమీటర్లకు పెరిగింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోవడానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
సహజ వనరుల కేటాయింపులో విశ్వసనీయత నెలకొల్పేందుకు మేం చిత్తశుద్ధితో ఉన్నాం. ఇందులో బొగ్గు, ఇతర ఖనిజాలతో పాటు స్పెక్ట్రమ్ కూడా ఉన్నాయి. ముడి సరుకుతో పాటు ఇతర కీలక వస్తువుల సరఫరా కోసం శాసన, పరిపాలన పరమైన చర్యలకు కూడా మా ప్రభుత్వం ముందంజ వేసింది. పారదర్శకమైన పద్ధతుల్లో వేలం వేయడం ద్వారా అవినీతికి తావు లేకుండా చేస్తున్నాం.
మేం ‘జన్ ధన్ యోజన’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. కేవలం ఏడాదిలో 19 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలను తెరిపించాం. సామాజిక భద్రత కోసం అందరికీ బీమా, పెన్షన్ పథకాలను ప్రారంభించాం. చిరు వ్యాపారులకు అప్పులు ఇచ్చేందుకు ముద్ర బ్యాంకును ప్రారంభించాం. దీని ద్వారా ఇప్పటికే 60 లక్షలకు పైగా చిరు వ్యాపారులు రుణాలు పొందారు.
బ్యాంకింగ్ వ్యవస్థను మరింత విస్తరించేందుకు ఈ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం. విశ్వసనీయమైన, సమర్థులైన బ్యాంకర్లకు.. బ్యాంకుల నాయకత్వం అప్పజెబుతున్నాం. 46 ఏళ్ల క్రితం బ్యాంకుల జాతీయీకరణ తరువాత తొలిసారిగా.. ప్రయివేటు రంగంలో నిపుణులను బ్యాంకుల కీలక స్థానాల్లో నియమిస్తున్నాం. ఆగిపోయిన అన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించే ప్రణాళికలను రూపొందించాం. విద్యుత్ రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చాం. దీని ద్వారా మా బ్యాంకులకు లాభం జరుగుతుంది.
మీకు సంబధించించిన పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం.
65ఏళ్ల తరువాత తొలిసారిగా భారత విదేశాంగ విధానంలో రాష్ట్రాలను భాగస్వాములను చేశాం. విదేశాంగ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో కలసి పనిచేసేలా వ్యూహాలు రూపొందించాం. నేను చైనా సందర్శించినపుడు.. వివిధ రాష్ట్రాల మధ్య సదస్సులు కూడా నిర్వహించాం. రాష్ట్రాలు ఎగుమతి ప్రొత్సాహక మండళ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించాం. రాష్ట్రాలు మరింత శక్తివంతంగా తయారయ్యేందుకు ఇలాంటి సంస్కరణలు తీసుకొచ్చాం.
వంద కోట్లకు పైగా యువతకు ఉపాధి కల్పించాలనేది మా లక్ష్యం. మా జీడీపీలో తయారీ రంగ భాగస్వామ్యం 25 శాతానికి పైగా ఉండాలని నిర్ణయించాం. వ్యాపారంలో సౌలభ్యం కోసం సంస్కరణలు తెచ్చి ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో ఓ ఉద్యమాన్ని ప్రారంభించి.. ఇందుకోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. సంక్లిష్టమైన విధానాలను తగ్గిస్తూ.. ఆన్‌లైన్ లోనే అనుమతులు దొరికేలా.. సరళమైన విధానాల అమలుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ప్రయత్నాల వల్ల ప్రపంచ బ్యాంకు 2016 సంవత్సరానికి ప్రకటించిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ జాబితాలో భారత్ 12 స్థానాలు ఎగబాకింది. ఈ మార్పుల లాభాన్ని పరిశ్రమ రంగం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటోంది. పారిశ్రామికంగా గతేడాది కంటే ఈసారి గణనీయమైన మార్పులున్నట్లు పారిశ్రామిక ఉత్పత్తి సూచీలు తెలుపుతున్నాయి. భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు మేం నిరంతరం శ్రమిస్తూ ఉన్నాం.
ఇప్పటి వరకు ప్రపంచస్థాయి మౌలిక వసతులు భారత్‌కు కలగానే మిగిలాయి. భవిష్యత్తులో ఆ స్థాయిలో మౌలిక సదుపాయాలను నిర్మించటమే మా ప్రధాన లక్ష్యం. అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా ప్రభుత్వం రంగంలో మూలధన పెట్టుబడులను పెద్ద సంఖ్యలో పెంచుకున్నాం. తదుపరి పెట్టుబడులను పెంచుకునేందుకు ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్య పద్ధతులను ప్రోత్సహిస్తున్నాం. జాతీయ పెట్టుబడులు, మౌలిక వసతుల నిధి ఏర్పాటు చేయనున్నాం. దీని ద్వారా ప్రజాపెట్టుబడులను మరింత పెంచుకునే వీలుంటుంది. ‘పన్ను రహిత మౌలికవసతుల బాండ్ల’ను ప్రవేశపెట్టడం ద్వారా మౌలిక వసతులకు దీర్ఘకాల ఆర్థిక సహాయం అందించటంతో పాటు కార్పొరేటు బాండు మార్కెటును కూడా విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాం. ఈ విషయంలో సింగపూర్, మలేషియాలతో పాటు ఇతర ఆసియాన్ దేశాలతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
మా చొరవ ఫలితంగా:
• విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ప్రయివేటు పెట్టుబడుల సెంటిమెంటు సానుకూలంగా మారింది. విదేశీ పెట్టుబడుల్లో 40 శాతం పెరుగుదల చోటు చేసుకొంది.
• ప్రపంచవ్యాప్తంగా పలు పెట్టుబడి సంస్థలు, ఏజెన్సీలకు భారత ఓ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది.
• పెట్టుబడులను ఆకర్షించే యూ ఎన్ సి టి ఎ డి ర్యాంకింగ్‌లో 15వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకుంది.
• అలాగే, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యొక్క ప్రపంచ స్పర్ధాత్మక సూచీలో ఐదేళ్ల పాటు తిరోగమనంలో ఉన్న భారతదేశం తాజాగా 16 ర్యాంకులు ఎగబాకింది కూడా.
• మూడీ స్ రేటింగ్స్ భారతదేశపు ఔట్ లుక్ ను అప్ గ్రేడ్ చేసింది.
డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా ల వంటి పథకాలను సరైన రీతిలో ప్రచారం చేస్తున్నందువల్ల ప్రజలు ఆసక్తితో వాటిలో భాగస్వాములవుతున్నారు. ఇటీవలి కాలంలో భారత్‌లో సార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటిని ప్రోత్సహించేందుకు ‘సార్టప్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించాం.
భారతదేశంలో ఉన్న శక్తిసామర్థ్యాలను ప్రపంచ పెట్టుబడిదారులు గుర్తిస్తారని మాకు ముందుగానే తెలుసు. ఇటీవలి కాలంలో ఇది మరింత పెరిగింది. ఈ పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత పెంచేందుకు మేం రెండో విడత నిర్మాణాత్మక, ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. పన్నుల వ్యవస్థలో స్థిరత్వం, అంచనా పెంచేందుకు, ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
ఇందుకోసం మీకు కొన్ని ఉదాహరణలు..:
• రైల్వేలు, బీమా, రక్షణ వంటి కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడుల శాతం పెంపునకు ఆమోదం తెలిపాం.
• ఇప్పుడు ఈ రంగాల్లో చాలా విదేశీ పెట్టుబడి సంస్థలకు నేరుగా అనుమతులు లభిస్తున్నాయి.
• నిర్మాణ రంగం, తోటల పెంపకం, వైద్య పరికరాల రంగంలోనూ విదేశీ పెట్టుబడులను హేతుబద్ధీకరించాం.
• విదేశీ పెట్టుబడులను ఆమోదించిన అన్ని విభాగాల్లో విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడిదారులకు సంయుక్తంగా ఒకే పరిధిలోకి తీసుకువచ్చాం. అంతకుముందు ఇవన్నీ వేర్వేరుగా ఉండేవి.
• అనుమతులిచ్చే ప్రక్రియను సరళతరం చేశాం. ఉదాహరణకు రక్షణ రంగంలో 60 శాతం వస్తువులను లైసెన్నింగ్ ప్రక్రియ నుండి వెలుపలకు తెచ్చాం.
• గడచిన కాలం నుండి వర్తించే పన్ను విధానానికి స్వస్తి పలికాం.
• ఆల్టర్నేటివ్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్స్ నిబంధనలను నోటిఫై చేశాం.
• రియల్ ఎస్టేట్ ఇన్ వెస్ట్ మెంట్ ట్రస్టులకు మూలధనం లాభాల పన్నును హేతుబద్ధీకరించాం.
• జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ అమలును వాయిదా వేయాలని నిర్ణయించాం.
• వస్తు సేవల పన్నును పార్లమెంటులో ప్రవేశపెట్టాం. 2016 కల్లా దీనిని ప్రవేశపెట్టగలమని ఆశిస్తున్నాం. దీని వల్ల దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానం అమల్లోకి వస్తుంది.
• ఒక కొత్త బ్యాంక్ రప్టసీ కోడ్ ను రూపొందించాం. కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ‘కంపెనీ లా ట్రైబ్యునల్’ను ఏర్పాటుచేయనున్నాం.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అభివృద్ధి ప్రక్రియను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో ప్రతిబంధకంగా మారిన నిబంధనలను తొలగించేందుకు దాదాపు రోజువారీ ప్రాతిపదికన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. ఈ నెల మొదట్లో సైతం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం ఆర్థిక వ్యవస్థలో పలు కీలక చర్యలు తీసుకున్నాం. ఈ విడత సంస్కరణల ద్వారా ప్రపంచంలోని అత్యంత పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచాం.
దీంతో పాటు, కొత్త పరిశోధనలు చేసేవారి మేధో సంపత్తి హక్కులకు కాపాడే విషయంలో మేం చిత్తశుద్ధితో ఉన్నాం. మేధో హక్కుల నిర్వహణలో ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. పన్నుల విధానాన్ని కూడా పారదర్శకంగా అమలు చేసేలా వేగంగా స్పందిచే వ్యవస్థను రూపొందిస్తున్నాం. నిజమైన పెట్టుబడిదారులు, నిజాయతీగా పన్ను కట్టే వారికి పన్ను చెల్లింపులో సత్వర సహాయమందిస్తాం.
మిత్రులారా, అపరిమిత అవకాశాలకు భారతదేశం నిలయం. మీకో విషయం చెప్పాలి.. భారతదేశంలోని 50 నగరాలు మెట్రో రైలు వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మేం 5 కోట్ల ఇళ్లను నిర్మించవలసివుంది. రహదారులు, రైలు మార్గాలు, జల మార్గాల నిర్మాణం చాలా అవసరం. 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తికి నిర్ణయించాం. చాలా తక్కువ సమయంలోనే ఈ పనులన్నీ చేయాల్సి ఉంటుంది. మా ప్రజాస్వామ్య వ్యవస్థ, అప్రమత్తంగా ఉండే న్యాయ వ్యవస్థ మీ పెట్టుబడికి భద్రతను, భరోసాను కల్పిస్తుంది. పాలనకు దీర్ఘ కాలిక దృక్పధాన్ని జోడించి, దాపరికానికి తావు ఇవ్వకుండా ముందుకు సాగుతున్నాం. మేం మరీముఖ్యంగా భారతదేశాన్ని సులభంగా వ్యాపారం చేసే దేశంగా తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నాం.
మిత్రులారా, ఆసియాన్ దేశాలలో అనేకం ఆసియా పునరుజ్జీవనంలో వాటి వంతు పాత్రను పోషించాయి. ఇప్పుడు భారతదేశం వంతు. మా సమయం వచ్చిందన్న సంగతి మాకు తెలుసు. మేం ఇప్పడు టేకాఫ్ దశలో ఉన్నాం. భారతదేశంలో మారుతున్న గాలులను పరిశీలించడానికి రావలసిందిగా మీకు నేను ఆహ్వానం పలుకుతున్నాను. సరిహద్దులను దాటడానికి పవనాలకు కొంత సమయం పడుతుంది. అందుకే, మీకు వ్యక్తిగతంగా స్వాగతం పలికేందుకే నేను ఇక్కడికి వచ్చాను. మీరు వచ్చేసరికి.. కొత్త వ్యాపార అనుకూల వాతావరణాన్ని మీరు గమనిస్తారు. ఒకసారి అక్కడికి వచ్చారో.. నేను మీకు నా పూర్తి సహకారాన్ని అందిస్తాను. ఇదే మీకు నా హామీ.
ధన్యవాదాలు
We asked ourselves the question – Reforms for what? What is the aim of reform? My answer is clear: we must Reform To Transform: PM Modi
— PMO India (@PMOIndia) November 21, 2015
Reform for me is just a way station on the long journey to the destination. The destination is the transformation of India: PM Modi
— PMO India (@PMOIndia) November 21, 2015
By almost every major economic indicator, India is doing better than when we took office: PM Modi. Watch Live: https://t.co/RlKSe1Guct
— PMO India (@PMOIndia) November 21, 2015
GDP growth is up and inflation is down. Foreign investment is up and the CAD is down. Tax revenues are up and interest rates are down: PM
— PMO India (@PMOIndia) November 21, 2015
Macro-economic stability is good. But to transform India, much more needs to be done. We have begun a series of concerted steps: PM Modi
— PMO India (@PMOIndia) November 21, 2015
We have launched a 'Housing for All' program. It involves building 20 million urban houses and 29.5 million rural houses: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 21, 2015
Our major ports witnessed 4.65% growth in traffic and 11.2% increase in operating income in 14-15 despite a global contraction in trade: PM
— PMO India (@PMOIndia) November 21, 2015
The pace of award of new highway works has increased from 9 km/day in 13-14 to 23 km/day currently: PM Modi. Watch: https://t.co/RlKSe1Guct
— PMO India (@PMOIndia) November 21, 2015
IIP in current year shows a distinct improvement over the last year. We are working in all ways to make India a global manufacturing hub: PM
— PMO India (@PMOIndia) November 21, 2015
To re-vitalize the flow of investments, we have launched 2nd wave of reforms. We are trying to further open up the economy: PM Modi
— PMO India (@PMOIndia) November 21, 2015
I want to assure you that India is committed to protect IP Rights of innovators. A National IPR policy is expected by end of the year: PM
— PMO India (@PMOIndia) November 21, 2015
Most ASEAN economies have done their bit for Asia’s resurgence. Now, it is India's turn. We know that our time has come: PM Modi
— PMO India (@PMOIndia) November 21, 2015
I invite you to come and see the winds of change in India. Winds do take time to cross the borders. That is why I am here to invite you: PM
— PMO India (@PMOIndia) November 21, 2015
At the ASEAN Business & Investment Summit, I emphasised on India & ASEAN being natural partners & why we must deepen our economic ties.
— Narendra Modi (@narendramodi) November 21, 2015
Talked about how our Govt. is overcoming economic challenges, initiating reforms & creating infrastructure to bring more investment to India
— NarendraModi(@narendramodi) November 21, 2015
Track record of ASEAN countries is strong. Together, we will ensure that this century belongs to Asia! https://t.co/jqoibObXwc
— NarendraModi(@narendramodi) November 21, 2015
Happy to meet my friend, Premier Li Keqiang. We had wide-ranging talks on India-China ties during our meeting. pic.twitter.com/pzlis4mq2k
— NarendraModi(@narendramodi) November 21, 2015
Watch Live: PM @narendramodi is speaking at the 13th ASEAN-India Summit https://t.co/V53GEKSp4T
— PMO India (@PMOIndia) November 21, 2015
My speech at ASEAN-India Summit. As the world faces economic challenges, India & ASEAN are bright spots of optimism. https://t.co/Jgg4x1heO6
— Narendra Modi (@narendramodi) November 21, 2015
Highlighted need to expand our trade & economic partnership & increase cooperation in development of Ocean Economy. pic.twitter.com/1CbIZh5Lo8
— NarendraModi(@narendramodi) November 21, 2015