పిఎంఇండియా
ఆసియా క్రీడలు-2026 పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించిన హిమాన్షు ధిల్లాన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. అతని ప్రదర్శన పట్ల భారత్ గర్విస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
ఆసియా క్రీడల పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో హిమాన్షు ధిల్లాన్ అద్భుతమైన ఆటతీరుతో రజత పతకాన్ని సాధించారు! అత్యంత ఒత్తిడిలోనూ ఆయన ప్రదర్శించిన ప్రశాంతత, అద్భుతమైన గురి ప్రత్యేకంగా నిలిచాయి. ఈ గొప్ప విజయానికి ఆయనకు అభినందనలు. ఆయన ప్రదర్శన పట్ల భారత్ గర్విస్తోంది.
A superb Silver for Himanshu Dhillon in the 10m Air Rifle Men’s event at the Asian Games! His calm under pressure and remarkable accuracy stood out. Congratulations to him on this excellent achievement. India is proud of his performance: PM @narendramodi pic.twitter.com/Pc2iTSOHjY
— PMO India (@PMOIndia) September 21, 2026