Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల్లో సెపక్‌తక్రాలో చారిత్రాత్మక కాంస్య పతకం సాధించిన భారత పురుషుల క్వాడ్రంట్‌ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు


ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల క్వాడ్రంట్‌ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

 

ఆసియా క్రీడల్లో పురుషుల క్వాడ్రంట్‌ విభాగంలో భారత్‌ తొలిసారిగా పతకం సాధించడం ఇదేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు. జట్టు ప్రదర్శించిన దృఢ సంకల్పం, పోరాట స్ఫూర్తి ఆదర్శప్రాయమని ఆయన ప్రశంసించారు

 

ఈ విజయం దేశవ్యాప్తంగా సెపక్‌తక్రా క్రీడకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

“భారత సెపక్‌తక్రా క్రీడకు ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం! ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల క్వాడ్రంట్‌ జట్టుకు అభినందనలు. ఆసియా క్రీడల్లో పురుషుల క్వాడ్రంట్‌ విభాగంలో భారత్‌ తొలిసారిగా ఈ పతకం సాధించింది. జట్టు ప్రదర్శించిన దృఢ సంకల్పం, పోరాట స్ఫూర్తి ఆదర్శప్రాయమైనవి. ఈ విజయం దేశవ్యాప్తంగా సెపక్‌తక్రా క్రీడకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను” అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొంది.   

 

****