Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల-రికర్వ్ వ్యక్తిగత విభాగంలో చరిత్రాత్మక స్వర్ణ పతకం సాధించిన కుంకుమ్ అనీల్ మోహోద్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి


2026 ఆసియా క్రీడల-రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచిన కుంకుమ్ అనీల్ మోహోద్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

 

నిర్ణయాత్మక షూట్-ఆఫ్‌లో ఆమె ప్రదర్శించిన సంయమనం అత్యద్భుతమని ప్రధానమంత్రి ప్రశంసించారు.

 

కుంకుమ్ అనీల్ మోహోద్‌కు సదా విజయం లభించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. ఆమె భవిష్యత్తు ప్రయత్నాల కోసం శుభాకాంక్షలు తెలిపారు.

 

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

 

“ఎప్పటికీ గుర్తుండిపోయే స్వర్ణ పతకం.

 

2026 ఆసియా క్రీడల-రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళగా ఘనత సాధించిన కుంకుమ్ అనీల్ మోహోద్‌కు అభినందనలు. నిర్ణయాత్మక ‘షూట్-ఆఫ్’లో ఆమె ప్రదర్శించిన సంయమనం ఎంతో అద్భుతం. ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నా! ఆమె భవిష్యత్తు ప్రయత్నాల కోసం శుభాకాంక్షలు”.