Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకున్న సిమ్రన్‌కు ప్రధానమంత్రి అభినందనలు


ఆసియా పారా క్రీడలు 2026లో మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకొని సరికొత్త రికార్డు సృష్టించిన సిమ్రన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

గత పోటీల్లో రజత పతకం సాధించిన సిమ్రన్‌.. ఈసారి రికార్డు సృష్టిస్తూ స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం ఆమె ప్రతిభ, అత్యుత్తమ ప్రదర్శనకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ఆమె ఇదే స్ఫూర్తితో అడ్డంకులను అధిగమిస్తూ, కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

‘‘స్వర్ణ పతకంతో పాటు సరికొత్త రికార్డు.

ఆసియా పారా క్రీడలు 2026లో మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రన్‌ అద్భుత ప్రదర్శన కనబరిచారు. స్వర్ణ పతకం సాధించిన ఆమెకు అభినందనలు.

గత పోటీల్లో రజత పతకం నుంచి ఈసారి రికార్డుతో కూడిన స్వర్ణ పతకం వరకు ఆమె సాగించిన ప్రయాణం అత్యుత్తమ ప్రతిభకు నిదర్శనం. ఆమె ఇలాగే అడ్డంకులను అధిగమిస్తూ, కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.