ఆసియా పారా గేమ్స్ పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్లో కొత్త రికార్డుతో తన స్వర్ణాన్ని నిలబెట్టుకున్న ప్రణవ్ సూర్మకు, కాంస్యం గెలిచిన ధరంబీర్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.
వారి విజయాలు దేశానికి గర్వకారణమని, వారు ఇలాగే రాణిస్తూ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
“ఆసియా పారా క్రీడల్లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్లో స్వర్ణం, కాంస్య పతకం సాధించిన భారత్!
ఈ గేమ్‌లో కొత్త రికార్డుతో తన స్వర్ణాన్ని నిలబెట్టుకున్న ప్రణవ్ సూర్మకు, కాంస్యం గెలుచుకున్న ధరంబీర్కు అభినందనలు. వారి విజయాలు దేశానికి గర్వకారణం. వారు ఇలాగే రాణించాలని ఆశిస్తున్నా. భవిష్యత్తులో వారు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా : ప్రధానమంత్రి @narendramodi”
Gold and Bronze for India in the Men’s Club Throw F51 event at the Asian Para Games! Congratulations to Pranav Soorma on retaining his Gold with a new Games Record and to Dharambir on winning Bronze. Their achievements are a source of pride for the nation. May they continue to shine. Wishing them many more achievements in the future: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 23, 2026