Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా మౌలిక స‌దుపాయాల పెట్టుబ‌డి బ్యాంకు (ఏ.ఐ.ఐ.బి) ఆర్టిక‌ల్స్ ఆఫ్ అగ్రిమెంట్ కు ఆమోదం


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆసియా మౌలిక స‌దుపాయాల పెట్టుబ‌డి బ్యాంకు (ఏ.ఐ.ఐ.బి) ఆర్టిక‌ల్స్ ఆఫ్ అగ్రిమెంట్

(ఏ.ఓ.ఏ)కు ఆమోద ముద్ర వేసింది. ఈ ఏ.ఐ.ఐ.బి స్థాప‌న భార‌త్‌కు మ‌రియు ఈ ఒప్పందాల‌పై సంత‌కాలు చేసిన ఇత‌ర దేశాల‌కు మౌలిక స‌దుపాయాల విస్తృతికి, నిల‌క‌డైన అభివృద్ధి ప‌థ‌కాల‌కు అవ‌స‌ర‌మ‌య్యే నిధుల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. ఏ.ఐ.ఐ.బి నుంచి వ‌న‌రుల‌ను రుణంగా తీసుకొంటున్న అతిపెద్ద దేశాల‌లో ప్ర‌స్తుతం భార‌త్ ఒక‌టిగా ఉంది. అంతేకాకుండా ఏ.ఐ.ఐ.బి కి చైనా త‌రువాత రెండ‌వ అతిపెద్ద వాటాదారు కావాలాని ఇండియా ఆశిస్తోంది. ఈ బ‌హుళ పాక్షిక సంస్థ ప‌రిపాల‌న‌లో భార‌త్ ఒక ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించ‌డానికి ఇప్పుడు ఒక చారిత్ర‌క అవ‌కాశం ల‌భించిన‌ట్లు అవుతోంది. ఏ.ఐ.ఐ.బి లో స‌భ్య‌త్వం పొంద‌డం ద్వారా మ‌నదేశంలో మౌలిక స‌దుపాయాల విస్త‌ర‌ణ‌కు అతి కీల‌క‌మైన మ‌రిన్ని వ‌న‌రుల‌ను స‌మీక‌రించుకోవ‌డానికి భార‌త్ కు ఒక అవ‌కాశం ల‌భించిన‌ట్లే.

నేప‌థ్యం

భార‌త్‌లో మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి పెట్టుబ‌డులను స‌మీక‌రించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం, బ‌హుళ పాక్షిక అభివృద్ధి బ్యాంకులు త‌మ వంతు పాత్ర‌ను పోషిస్తున్నాయి. దీనికి ప్ర‌భుత్వ, ప్రైవేటు భాగ‌స్వామ్య ప‌థ‌కాల ద్వారా ప్ర‌భుత్వరంగం ఇస్తున్న తోడ్పాటు అద‌నం. అయితే, ఆర్థిక స్థిరీక‌ర‌ణ‌, న‌ష్ట భ‌యంతో కూడిన ప్రైవేటురంగం …. వంటి నేప‌థ్యంలో ఏ.ఐ.ఐ.బి రాక అద‌న‌పు వ‌న‌రుల‌ను కొని తెచ్చేదే. వ‌ర్థ‌మాన దేశాల‌లో పోగుప‌డుతున్న పొదుపు మొత్తాలకు ఏ.ఐ.ఐ.బి ఒక వేదిక‌గా మార‌గ‌ల‌ద‌ని ఆశిస్తున్నారు.