Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా ఎన్నికైన శ్రీ ఆంథోనీ అల్బనీస్‌కు ప్రధానమంత్రి అభినందన


ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా శ్రీ ఆంథోనీ అల్బనీస్‌ ఎన్నిక కావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా రెండోసారి అద్భుత విజయం సాధించడంపై మీకు @AlboMP నా అభినందనలు! ఎన్నికలలో వెలువడిన ఈ దృఢమైన తీర్పు మీ నాయకత్వంపై దేశ ప్రజల నిరంతర విశ్వాసానికి ప్రతీక. ఈ నేపథ్యంలో భారత్‌-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత విస్తృతం చేయడం, ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు దిశగా మన సంయుక్త దృక్కోణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీతో కలసి సాగేందుకు నేను సదా సిద్ధంగా ఉంటాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.